లోక్‌సభ ఎన్నికలు 2019: అయిదో దశలో 60.80 శాతం పోలింగ్

ఫొటో సోర్స్, Pib india
లోక్‌సభ ఎన్నికల్లో అయిదో దశ పోలింగ్ 7 రాష్ట్రాల్లోని 51 స్థానాల్లో కొనసాగుతోంది.
ఈ ఏడు రాష్ట్రాల్లో బిహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బంగాల్, జమ్ము-కశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. పోలింగ్ ముగిసేటప్పటికి మొత్తం 60.80 శాతం ఓటింగ్ నమోదైంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 74.06 శాతం, జమ్ముకశ్మీర్‌లో అత్యల్పంగా 17.07 శాతం పోలింగ్ జరగ్గా.. బిహార్‌లో 56.79 శాతం, మధ్యప్రదేశ్‌లో 62.96శాతం, రాజస్థాన్‌లో 63.03 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 53.32 శాతం, ఝార్ఖండ్‌లో 63.99 శాతం ఓటింగ్ నమోదైంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పోలింగ్ జరుగుతున్న ఏడు రాష్ట్రాల్లో మధ్యాహ్నం3 గంటలకు.. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 62.84 శాతం, జమ్ముకశ్మీర్‌లో అత్యల్పంగా 15.34 శాతం పోలింగ్ జరగ్గా.. బిహార్‌లో 44.08 శాతం, మధ్యప్రదేశ్‌లో 54.17శాతం, రాజస్థాన్‌లో 50.40 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 44.79 శాతం, ఝార్ఖండ్‌లో 58.63 శాతం ఓటింగ్ నమోదైంది.
రాజస్థాన్‌లో సూరత్ ఘర్‌లో 102 ఏళ్ల గురుదయాళ్ కౌర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

ఫొటో సోర్స్, Pib/Manoj
క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ కొద్దిసేపటి కిందట తన సొంత రాష్ట్రం ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని జవహర్ విద్యామందిర్‌లో ఓటు వేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
పోలింగ్ జరుగుతున్న ఏడు రాష్ట్రాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.29 శాతం ఓటింగ్ నమోదైంది.
పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 50.78 శాతం, జమ్ముకశ్మీర్‌లో అత్యల్పంగా 11.35 శాతం పోలింగ్ జరగ్గా.. బిహార్‌లో 32.27 శాతం, మధ్యప్రదేశ్‌లో 43.30 శాతం, రాజస్థాన్‌లో 42.62 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 35.15 శాతం, ఝార్ఖండ్‌లో 45.98 శాతం ఓటింగ్ నమోదైంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5

ఫొటో సోర్స్, Ravi Prakash/BBC
మధ్యాహ్నం 12 వరకూ జార్ఖండ్‌లో 29.49 శాతం ఓటింగ్ జరిగింది.
అమేథీలో ఉదయం 11 గంటల వరకూ 21.83 శాతం, మధ్యప్రదేశ్‌లోని 7 స్థానాల్లో 25.68 శాతం, బిహార్‌లో 20.95 శాతం ఓటింగ్ జరిగింది.

ఫొటో సోర్స్, Chowkidar Rajnath Singh/twitter
లక్నోలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీఎస్పీ సుప్రీమో మాయావతి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
ఈ దశలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చీఫ్ సోనియా గాంధీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ లాంటి ప్రముఖులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC
మొత్తం 51 రాష్ట్రాల్లో 674 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ దశతోపాటు లోక్‌సభలోని 425 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి.
అయిదో దశలో సుమారు 8.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుంటారు. వీరిలో సుమారు 4.63 కోట్ల మంది పురుషులు, 4.12 కోట్ల మంది మహిళలు ఉన్నారు.

ఫొటో సోర్స్, SUREH NIAZI/BBC
ఎన్నికల బరిలో 674 మంది అభ్యర్థులు
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ లోక్‌సభ ఎన్నికల ఐదో దశలో మొత్తం 674 మందిలో 668 మంది అఫిడవిట్ విశ్లేషించింది.
వీరిలో 149 మంది జాతీయ, 31 మంది ప్రాంతీయ, 236 మంది గుర్తింపు పొందిన పార్టీల తరఫున, 252 మంది ఇండిపెంటెంట్లుగా బరిలోకి దిగుతున్నారని చెప్పింది.
ఈ దశలో మొత్తం 79 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
రిపోర్టును బట్టి మొత్తం 668 మంది అభ్యర్థుల్లో 19 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
14 శాతం మంది అభ్యర్థులపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి.
రిపోర్టు ప్రకారం అభ్యర్థుల్లో 28 శాతం మంది అభ్యర్థులు కోటీశ్వరులు. వీరి సగటు ఆస్తి 2.57 కోట్ల రూపాయలు.

ఐదో దశలో ముఖ్యమైన విషయాలు
- 126 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
- 95 మంది అభ్యర్థులపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి.
- 184 మంది అభ్యర్థులు కోటీశ్వరులు
- అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ 2.57 కోట్లు
- పార్టీలవారీగా చూస్తే బీజేపీ 48 మంది అభ్యర్థుల సగటు ఆస్తి 6.91 కోట్ల రూపాయలు. ఇటు కాంగ్రెస్ 45 మంది అభ్యర్థుల సగటు ఆస్తి 8.74 కోట్ల రూపాయలు.
- బీఎస్పీ 33 మంది అభ్యర్థుల సగటు ఆస్తి 3.32 కోట్ల రూపాయలు. ఎస్పీ నుంచి పోటీ చేస్తున్న 9 మంది అభ్యర్థుల సగటు ఆస్తులు 31.57 కోట్ల రూపాయలుగా ఉంది.
సంపన్న అభ్యర్థి పూనమ్ సిన్హా
ఐదో దశలో పోటీ చేస్తున్న సంపన్న అభ్యర్థుల జాబితాలో పూనమ్ సిన్హా అగ్ర స్థానంలో ఉన్నారు.
ఆమె అఫిడవిట్‌లో తన పేరిట 193 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ప్రకటించారు.
పూనమ్ సిన్హా సమాజ్ వాదీ పార్టీ తరఫున లక్నో లోక్‌సభ స్థానం నుంచ పోటీ చేస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్ సీతాపూర్ నుంచి పోటీ చేస్తున్న ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ(లోహియా) అభ్యర్థి విజయ్ కుమార్ మిశ్రా ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు.
ఈయనకు 177 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయి.
అత్యంత సంపన్న అభ్యర్థుల జాబితాలో మూడో స్థానంలో మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా కొడుకు జయంత్ సిన్హా ఉన్నారు. ఆయన బీజేపీ టికెట్‌పై హజారీబాగ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయనకు 77 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- మాస్కో విమాన ప్రమాదం: ఎయిరోఫ్లాట్ జెట్ మంటల్లో 41 మంది మృతి
- నీలి రంగును వదిలించుకుంటున్న ఫేస్‌బుక్
- వెనెజ్వేలా సంక్షోభం: కారకస్ ఘర్షణల్లో మహిళ మృతి; పదుల సంఖ్యలో ప్రజలకు గాయాలు
- శ్రీలంకలో దాడులను భారత్ ముందే ఎలా పసిగట్టింది?
- ట్రంప్-కిమ్ భేటీ: ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలేవి!
- సున్నా ఎలా పుట్టింది? దీన్ని భారతీయులు ఎలా కనిపెట్టారు?
- థాయ్ కింగ్ పెళ్ళి: బాడీగార్డుతో ప్రేమ వివాహం
- ‘పని ఒత్తిడితో ప్రాణాలు పోతున్నా మనం ఇంకా కళ్ళు తెరవడం లేదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)