ఇల్హాన్ ఒమర్: అమెరికా కాంగ్రెస్ నేత 9/11 మీద చేసిన వ్యాఖ్యలపై ముదురుతున్న వివాదం

ఫొటో సోర్స్, Getty Images
డెమాక్రటిక్ నేత ఇల్హాన్ ఒమర్ చేసిన వ్యాఖ్యలు అమెరికాలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. అయితే, ఎన్ని విమర్శలు ఎదురైనా తాను చెప్పాల్సింది చెబుతానని, మౌనం వహించే ప్రసక్తే లేదని ఇల్హాన్ అంటున్నారు.
9/11 దాడులకు సంబంధించి ఇల్హాన్ చేసిన వ్యాఖ్యలపై అధ్యక్షుడు ట్రంప్ ట్విటర్ వేదికగా స్పందించారు. 2001 సెప్టెంబ్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడి దృశ్యాలు, ఇల్హాన్ వ్యాఖ్యలను మిక్స్ చేసిన వీడియోను పోస్ట్ చేస్తూ దానికి "మేమెన్నటికీ మర్చిపోం" అనే వ్యాఖ్యను జోడించారు ట్రంప్.
ఇల్హాన్ వ్యాఖ్యల్లో ''ఎవరో ఏదో చేశారు'' (some people did something) అన్న మాటను ఈ వీడియో తయారీలో పదేపదే ఉపయోగించారు.. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను విమానాలు డీకొడుతున్నప్పుడు, అది కూలిపోతున్నప్పుడు ఈ మాటలను మధ్యలో కలుపుతూ రూపొందించిన ఆ వీడియోను ట్రంప్ ట్వీట్ చేశారు.
9/11 దాడులను ఇల్హాన్ చిన్నది చేసి మాట్లాడారని రిపబ్లికన్లు విమర్శిస్తుండగా, డెమాక్రాట్లలో చాలామంది మాత్రం ఆమెకు అండగా నిలిచారు. ట్రంప్ తీరు ఆమెపైన, ముస్లింలపైన దాడులకు ప్రేరేపించేలా ఉందని పలువురు ఆరోపించారు.
దీంతో వివాదం మరింత ముదిరింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకీ ఎవరీ ఇల్హాన్ ఒమర్?
2018 నవంబరులో మిన్నెసోటా నుంచి యూఎస్ కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. యూఎస్ కాంగ్రెస్‌కు మొట్టమొదటిసారి ఎన్నికైన ఇద్దరు ముస్లిం మహిళల్లో ఇల్హాన్ ఒకరు.
సోమాలియాకు చెందిన ఆమె కుటుంబం శరణార్థిగా అమెరికాకు వలస వచ్చింది. యూఎస్ కాంగ్రెస్‌లో తలకు హిజాబ్ ధరించి హాజరయ్యే మొట్టమొదటి మహిళ కూడా ఈలానే.
యూఎస్ కాంగ్రెస్‌కు ఎన్నికై కొద్ది కాలమే అయినప్పటికీ నిత్యం వార్తల్లో నానుతున్నారామె.
యూదు మత వ్యతిరేకి అన్న ముద్ర ఆమెపై ఉంది. గతంలో ఆమె ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ అనుకూల వర్గాల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలున్నాయి.
ఈ విషయంలో సొంత పార్టీ డెమాక్రాట్ల నుంచి కూడా చీవాట్లు తిన్నాక ఆమె క్షమాపణలు కూడా చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఇంతకీ ఆమె ఏమన్నారు? ఎందుకీ వివాదం?
ట్రంప్ చేసిన ట్వీట్‌లో ఉన్న 'కొందరు ఏదో చేశారు' అన్న ఇల్హాన్ మాటలు ఆమె మార్చి 23న 'కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్'(సీఏఐఆర్) అనే పౌరహక్కుల సంస్థలో ప్రసంగించినప్పటివి.
20 నిమిషాల పాటు సాగిన ఆ ప్రసంగంలో ఆమె ఇస్లామోఫోబియా, న్యూజిలాండ్‌లో మసీదుపై దాడి వంటి అనేకాంశాలను ప్రస్తావించారు. 9/11 దాడుల తరువాత పరిణామాలపై ఆమె మాట్లాడారు. ఆ సందర్భంగా ఆమె 'ఎవరో ఏదో చేశారు' అనగా ఆ మాటను ట్రంప్ తన ట్వీట్లో వాడారు.
''వాస్తవం ఇదీ.. చాలాకాలంగా మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవిస్తూ ఉన్నాం. ఈ వివక్షతో నేను విసుగెత్తిపోయాను. నాలాగే ఇక్కడ నివసిస్తున్న ప్రతి ముస్లిం విసిగిపోయే ఉంటారు. సీఏఐఆర్‌ను 9/11 దాడుల తరువాత ఏర్పాటు చేశారు. ఎందుకంటే, కొంతమంది ఏదో చేశారు. అప్పటి నుంచి మనమంతా స్వేచ్ఛను కోల్పోవడం మొదలైంది'' అన్న ఇల్హాన్ మాటల నుంచి ఆ ఒక్క వాక్యాన్ని తీసుకున్నారు ట్రంప్.
అయితే, ఇల్హాన్ మాటల్లో నిజమెంత అనేది వాషింగ్టన్ పోస్ట్ పరిశోధించింది. దాని ప్రకారం సీఏఐఆర్‌ను 1994లోనే ఏర్పాటు చేసినట్లు తేలింది.
దీనిపై ఇల్హాన్ కార్యాలయం వివరణ ఇస్తూ.. ఆమె పొరపాటున అలా అన్నారని, ఆ దాడుల తరువాత సీఏఐఆర్ మరింత పెద్దదైందని చెప్పడం ఆమె ఉద్దేశమని చెప్పుకొచ్చారు.
వివాదం ఎలా ముదిరింది?
ఏప్రిల్ 9న టెక్సాస్ రిపబ్లికన్ ప్రతినిధి డాన్ క్రెన్షా.. ఇల్హాన్ మాటలకు సంబంధించిన క్లిప్ ఒకటి షేర్ చేసినప్పటి నుంచి ఈ విషయం అందరి దృష్టికొచ్చింది.
రిపబ్లికన్ నేషనల్ కమిటీ అధ్యక్షురాలు రోనా మెక్‌డానియల్ అయితే దీనిపై స్పందిస్తూ ఈలాన్‌ను అమెరికా వ్యతిరేకి అని విమర్శించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కాగా, తనపై వస్తున్న విమర్శల వల్ల తనకు ప్రాణహాని కలిగే ప్రమాదం ఉందని.. ఇప్పటికే బెదిరింపులు వస్తున్నాయని ఇల్హాన్ అంటున్నారు. ఈ మాటలేమీ తానొక్కరే అంటున్నవి కావని, మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
మరోవైపు అమెరికాలోని ప్రసార మాధ్యమాలు కూడా దీనిపై ఎక్కువగానే స్పందించాయి. న్యూయార్క్ టైమ్స్ గురువారం తన మొదటి పేజీలో 'హియర్ ఈజ్ యువర్ సంథింగ్' అంటూ 9/11 దాడుల చిత్రాన్ని ప్రచురించింది.
అయితే, దీనిపై అక్కడ మిశ్రమ స్పందన కనిపించింది. కొందరు న్యూయార్క్ టైమ్స్‌ను ప్రశంసించగా మరికొందరు విమర్శించారు.
సోషల్ మీడియా యూజర్లలో చాలామంది ఇల్హాన్‌కు మద్దతుగా #IStandWithIlhan హ్యాష్ టాగ్‌తో ఆమెకు మద్దతుగా పోస్టులు పెట్టారు. దీంతో శుక్రవారం ఆ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది.
ప్రధానంగా అమెరికా సమాజంలోని అన్నివర్గాల్లో ఉన్న ట్రంప్ విమర్శకులంతా ఈ విషయంలో ఇల్హాన్‌కు మద్దతు పలికారు.
ఇవి కూడా చదవండి:
- BBC Fact Check: ఇందిరా గాంధీని వాజ్‌పేయీ 'దుర్గా' అని పిలిచేవారా...
- ఏపీలో అర్ధరాత్రి దాటాక కూడా పోలింగ్ ఎందుకు జరిగింది...
- రఫేల్ డీల్: అసలు ఏమిటీ ఒప్పందం... ఎందుకీ వివాదం?
- అభిప్రాయం: రాజీవ్‌కు బోఫోర్స్.. మోదీకి రఫేల్?
- Reality Check: రుణ మాఫీ పథకాలతో రైతుల కష్టాలు తీరుతాయా?
- పెళ్ళి పేరుతో అమ్మాయిలకు వల వేసి... వ్యభిచారంలోకి దింపుతున్నారు
- నిన్న ఒక పార్టీ.. నేడు మరో పార్టీ – ఏపీలో రంగులు మారుతున్న కండువాలు
- సిత్రాలు సూడరో: "జగన్ ఎప్పటికీ సీఎం కాలేరు.. కాబోయే ముఖ్యమంత్రి జగనే"
- ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూసుకోండి.. 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








