Ind Vs Aus: వన్డేల్లో 500వ విజయం సాధించిన భారత జట్టు

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

నాగపూర్ వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టు 48.2 ఓవర్లలో 250 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.

భారత జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యధికంగా 120 బంతుల్లో పది ఫోర్ల సహాయంతో 116 పరుగులు చేశాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 40వ సెంచరీ.

కోహ్లీ తర్వాత విజయ్ శంకర్ అత్యధికంగా 41 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 46 పరుగులు చేశాడు. భారత జట్టులో రోహిత్ శర్మ, ధోనీ, బుమ్రాలు డకౌట్ అయ్యారు.

251 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 242 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో భారత జట్టు 8 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఐదు వన్డేల ఈ సిరీస్‌లో భారత జట్టు 2-0తో ముందంజలో ఉంది.

మూడో వన్డే ఈనెల 8వ తేదీన రాంచీలో జరుగనుంది.

వన్డేల్లో 500వ విజయం

వన్డేల్లో భారత జట్టుకు ఇది 500వ విజయం.

ఆస్ట్రేలియా తర్వాత వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ రికార్డు సాధించింది.

భారత జట్టు తన తొలి వన్డేను 1974 జూలై 13వ తేదీన ఇంగ్లండ్‌పై ఆడింది.

తొలి విజయం 1975 జూన్ 11వ తేదీన ఈస్ట్ ఆఫ్రికాపై పది వికెట్ల తేడాతో నమోదు చేసింది.

పదో వికెట్

49 ఓవర్ మూడో బంతికి ఆడమ్ జంపా (2 బంతుల్లో రెండు పరుగులు) ఔటయ్యాడు.

తొమ్మిదో వికెట్

49 ఓవర్ మొదటి బంతికి మార్కస్ స్టొయినిస్ (65 బంతుల్లో 52 పరుగులు) ఔటయ్యాడు.

ఎనిమిదో వికెట్

45 ఓవర్ నాలుగో బంతికి పాట్ కమ్మిన్స్ డకౌట్ అయ్యాడు.

ఏడో వికెట్

45 ఓవర్ రెండో బంతికి కైల్టెర్ నైల్ (4 బంతుల్లో నాలుగు పరుగులు) ఔటయ్యాడు.

ఆరో వికెట్

44 ఓవర్ మూడో బంతికి అలెక్స్ క్యారీ (24 బంతుల్లో 22 పరుగులు) ఔటయ్యాడు.

ఐదో వికెట్

37 ఓవర్ మూడో బంతికి హ్యాండ్స్‌కోంబ్ (59 బంతుల్లో 48 పరుగులు) రనౌట్ అయ్యాడు.

నాలుగో వికెట్

28 ఓవర్ మూడో బంతికి మాక్స్‌వెల్ (18 బంతుల్లో 4 పరుగులు) ఔటయ్యాడు.

మూడో వికెట్

23 ఓవర్ ఐదో బంతికి షాన్ మార్ష్ (27 బంతుల్లో 16 పరుగులు) ఔటయ్యాడు.

రెండో వికెట్

15 ఓవర్ మూడో బంతికి ఖవాజా (37 బంతుల్లో 38 పరుగులు) ఔటయ్యాడు.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: తొలి వికెట్

14 ఓవర్ మూడో బంతికి ఆరోన్ ఫించ్ (53 బంతుల్లో 37 పరుగులు) ఔటయ్యాడు.

భారత్ ఆసీస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శిఖర్ ధవన్

పదో వికెట్

48 ఓవర్ రెండో బంతికి బుమ్రా డకౌట్ అయ్యాడు.

తొమ్మిదో వికెట్

47 ఓవర్ ఐదో బంతికి కుల్దీప్ యాదవ్ (మూడు బంతుల్లో మూడు పరుగులు) ఔటయ్యాడు.

ఎనిమిదో వికెట్

స్కోరు 248 పరుగుల వద్ద 47 ఓవర్ మొదటి బంతికి కోహ్లీ ఔటయ్యాడు.

ఏడో వికెట్

45వ ఓవర్ ఐదో బంతికి రవీంద్ర జడేజా (40 బంతుల్లో 21 పరుగులు) ఔటయ్యాడు.

ఆరో వికెట్

32 ఓవర్ మూడో బంతికి ధోనీ డకౌట్ అయ్యాడు.

ఐదో వికెట్

32 ఓవర్ రెండో బంతికి జాదవ్ (12 బంతుల్లో ఒక ఫోర్ సహాయంతో 12 పరుగులు) ఔటయ్యాడు.

నాలుగో వికెట్

28వ ఓవర్ ఐదో బంతికి విజయ్ శంకర్ రనౌట్ అయ్యాడు. కోహ్లీ నేరుగా కొట్టిన బంతిని బౌలర్ జంపా అడ్డుకునే ప్రయత్నం చేయగా.. అది వెళ్లి రెండో ఎండ్‌లో వికెట్లను తాకింది. అప్పటికే క్రీజు నుంచి ముందుకొచ్చిన విజయ్ శంకర్ వెనుదిరిగే ప్రయత్నం చేసినప్పటికీ చేరుకోలేకపోయాడు. దీంతో అతను రనౌట్ అయ్యాడు. విజయ్ శంకర్ 41 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 46 పరుగులు చేశాడు.

మూడో వికెట్

17వ ఓవర్ చివరి బంతికి 75 పరుగుల దగ్గర భారత్ మూడో వికెట్ కోల్పోయింది.

18 పరుగులు చేసిన అంబటి రాయుడు లియాన్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు.

10 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది.

రెండో వికెట్

టీమిండియా 9వ ఓవర్ మూడో బంతికి 38 పరుగుల దగ్గర రెండో వికెట్ కోల్పోయింది.

21 పరుగులు చేసిన శిఖర్ ధవన్ మాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు.

తొలి వికెట్

మొదట బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ పరుగుల ఖాతా తెరవక ముందే తొలి వికెట్ కోల్పోయింది.

ఓపెనర్ రోహిత్ శర్మ తొలి ఓవర్ చివరి బంతికి అవుట్ అయ్యాడు.

పాట్ కమిన్స్ బౌలింగ్‌లో రోహిత్ కొట్టిన బంతి జంపా చేతుల్లో పడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)