ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే బొబ్బిలిపులుల్లా తిరగబడతారు: కేంద్రానికి చంద్రబాబు హెచ్చరిక

దిల్లీలో చంద్రబాబు దీక్ష

‘‘పాలకులు తమ ధర్మాన్ని పాటించనప్పుడు.. రాష్ట్రాలపై వివక్ష చూపినప్పుడు, అన్యాయం చేసినపుడు న్యాయం కోసం పోరాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే బొబ్బిలిపులులై తిరగబడతారంటూ కేంద్రాన్ని చంద్రబాబు హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ దిల్లీలోని ఏపీ భవన్‌లో చంద్రబాబు చేపట్టిన ‘ధర్మపోరాట దీక్ష’ స్థలానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా దేశంలోని వివిధ పార్టీల నాయకులు చేరుకుని సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో లేదా? అంటూ రాష్ట్రంపై కేంద్రం చూపుతున్న వివక్షను రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

చంద్రబాబుకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తున్న దేవెగౌడ

ఫొటో సోర్స్, APGovt

ఫొటో క్యాప్షన్, చంద్రబాబుతో మాజీ ప్రధాని దేవెగౌడ నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు.

ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగించిన చంద్రబాబుతో మాజీ ప్రధాని దేవెగౌడ నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

దీక్ష సందర్భంగా చంద్రబాబు కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు. ఈ పోరాటానికి మద్దతు పలుకుతూ ఏపీ భవన్‌కు వచ్చిన మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ.. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్.. దేశంలోని వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ తామంతా ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్‌కు మద్దతు పలుకుతున్నట్లు చెప్పడమే కాకుండా కేంద్రం తీరుపై మండిపడ్డారు.

సొంత పార్టీవారే మోదీని వద్దంటున్నారు: చంద్రబాబు

‘‘పాలకుడు రాజధర్మం పాటించాలి.. రాష్ట్రాలు, ప్రజలు, వర్గాల విషయంలో పాలకులు సానుకూలంగా ఉండాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రాల మధ్య సున్నితమైన సమస్యలు ముదురుతున్నాయి.

విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేక హోదా హామీ అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నారు.

రాష్ట్రాలతో ఇష్టమొచ్చినట్లు ఆడుకుంటున్నారు. తమిళనాడులో ఏం చేశారో చూశాం. అందుకే అక్కడ ప్రజలు విసిగి మోదీ వెళ్తే గో బ్యాక్ అంటున్నారు. నిరసనలు తెలుపుతున్నారు.

సుప్రియ సూలె

ఫొటో సోర్స్, APgovt

ఫొటో క్యాప్షన్, చంద్రబాబు దీక్షకు మద్దతు పలికిన ఎన్సీపీ నేత సుప్రియ సూలె

ఈశాన్య రాష్ట్రాల్లో వాతావరణం, మత విశ్వాసాలు అన్నీ వేరు. అలాంటివారినీ ఇబ్బందిపెట్టేలా, వారి మనోభావాలు దెబ్బతినేలా ప్రధాని మోదీ, అమిత్ షా వ్యవహరిస్తున్నారు.

కశ్మీర్‌లో ముస్లింలలో ద్వేషాన్ని పెంచారు. వారు కూడా ఈ దేశంలో భాగస్వాములు. హిందూముస్లింల మధ్య విభేదాలు పెంచుతున్నారు. రాజకీయ లబ్ధి పొందేందుకు దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు.

మనుషుల మధ్య గోడలు కట్టారు. రాష్ట్రాలు మధ్య విద్వేషాన్ని సృష్టించారు.

సొంత పార్టీలోనూ విద్వేషం సృష్టించారు. ఆ పార్టీలో ఓటింగ్ పెడితే మోదీ వద్దనేవారే ఎక్కువ. 100కి 99 శాతం మంది వద్దంటారు.

యశ్వంత్ సిన్హా, చంద్రబాబు, శత్రుఘ్న సిన్హా

ఫొటో సోర్స్, TeluguDeshamParty

ఫొటో క్యాప్షన్, యశ్వంత్ సిన్హా, చంద్రబాబు, శత్రుఘ్న సిన్హా

అవకాశం ఉన్నప్పుడు మంచి పనులు చేయండి. అంతేకానీ, దేశం ఏమైపోయినా ఫర్వాలేదు నేను మాత్రమే లబ్ధి పొందాలనుకునే వ్యక్తి మోదీ. ఆయన ఆటలు సాగవు.

ఈ కేంద్రానికి మనుషుల ప్రాణాలు, మనోభావాలు లెక్కలేదు. ఎవరిని ఎలా అవమానించాలి, ఇబ్బంది పెట్టాలి.. సీబీఐ, ఈడీ వంటివాటితో ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు.

ఎన్నికలకు నెల రోజులే ఉంది. త్వరలో నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ యాక్టివ్‌గా ఎవరైనా తిరిగితే వారి ఇంటికి ఇన్‌కం ట్యాక్స్ అధికారులను పంపిస్తారు. అయినా భయం పడం. రాష్ట్ర హక్కులు సాధించుకునేవరకు రాజీలేని పోరాటం చేస్తాం’’ అన్నారు చంద్రబాబు.

శరద్ యాదవ్, చంద్రబాబు, ములాయం సింగ్ యాదవ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శరద్ యాదవ్, చంద్రబాబు, ములాయం సింగ్ యాదవ్

ఈ రోజు ఇక్కడ చనిపోయిన వ్యక్తి ది శ్రీకాకుళం జిల్లా. ప్రత్యేక హోదా రాలేదన్న మనోవేదనతో ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని చంద్రబాబు చెప్పారు.

రాష్ట్రం కోసం ఇలా ఒక వికలాంగుడు ప్రాణాలు అర్పిస్తుంటే మోదీలాంటివారి మనసు మాత్రం చలించడం లేదన్నారాయన.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

మన్మోహన్, కేజ్రీవాల్,దేవెగౌడ, ఫరూక్ అబ్దుల్లాల మద్దతు

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా, సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్, మాజీ ప్రధాని జేడీఎస్ నేత దేవెగౌడ కూడా చంద్రబాబు దీక్షా ప్రాంగణానికి వచ్చి సంఘీభావం ప్రకటించారు.

కమల్ నాథ్, చంద్రబాబు, దిగ్విజయ్

ఫొటో సోర్స్, APgovt

ఫొటో క్యాప్షన్, కమల్ నాథ్, చంద్రబాబు, దిగ్విజయ్

తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత డెరెక్ ఒ-బ్రియాన్, ఎల్‌జేడీ నాయకుడు శరద్‌యాదవ్, ఎన్‌సీపీ నాయకుడు మజీద్ మెమన్‌, కాంగ్రెస్ నాయకులు ఆనంద్‌శర్మ, అహ్మద్‌పటేల్‌, జైరాంరమేశ్, డీఎంకే నాయకుడు శివ, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, మధ్య ప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్, బీజేపీ అసంతృప్త నేతలు శత్రుఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హా తదితరులు కూడా ఏపీ భవన్ చేరుకుని చంద్రబాబు దీక్షకు మద్దతు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో భాగం కాదా: రాహుల్

ఈ సందర్భంగా రాహుల్ ప్రసంగించారు. ''నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. మోదీ ఏ తరహా ప్రధానమంత్రి? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీని ఆయన నెరవేర్చలేదు. ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో భాగం కాదా?'' అని ప్రశ్నించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

''మోదీ దేశంలో ఎక్కికి వెళ్లినా అబద్ధాలే చెప్తారు. ఆయనకు విశ్వసనీయత లేదు'' అని విమర్శించారు.

''రాఫెల్ ‌డీల్‌లో ప్రధానే దొంగ’’ అని రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘అవినీతిపై పోరాటం చేస్తానంటూ ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బును లూటీ చేశారు. ఆ డబ్బును రాఫెల్ డీల్ కోసం అనిల్ అంబానీకి ఇచ్చారు’’ అని వ్యాఖ్యానించారు.

ప్రఫుల్ కుమార్, శరద్ పవార్‌లతో చంద్రబాబు

ఫొటో సోర్స్, APgovt

ఫొటో క్యాప్షన్, ప్రఫుల్ కుమార్, శరద్ పవార్‌లతో చంద్రబాబు

‘‘రక్షణ రంగానికి చెందిన ప్రతి ఒప్పందానికీ అవినీతి వ్యతిరేక నిబంధన ఒకటి ఉంటుంది. ఆ యాంటీ కరప్షన్ నిబంధనను ప్రధానమంత్రి తొలగించినట్లు ద హిందూ ఒక కథనం ప్రచురించింది. ప్రధాని ఈ లూటీకి ఊతమిచ్చినట్లు స్పష్టమైంది’’ అని రాహుల్ చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ, మోదీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ప్రత్యేక హోదా హామీని తక్షణం అమలు చేయాలి: మన్మోహన్‌సింగ్

మాజీ ప్రధాని మన్మోహన్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. ‘‘ప్రత్యేక హోదా హామీని ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా అమలు చేయాలి. స్పెషల్ స్టేటస్ గురించి పార్లమెంటులో చర్చించినపుడు అన్ని పార్టీలూ మద్దతిచ్చాయి’’ అని పేర్కొన్నారు.

చంద్రబాబు దీక్షకు మద్దతు పలికిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/gettyimages

మోదీ, అమిత్‌షాలు మళ్లీ వస్తే సమాఖ్య కుప్పకూలుతుంది: కేజ్రీవాల్

దిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దిల్లీ వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి. మన దేశ సమాఖ్య వ్యవస్థ మీద చాలా పెద్ద ప్రశ్నను రేకెత్తిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కనీసం మూడుసార్లు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. తిరుపతిలో దేవుడి సమక్షంలో ఇచ్చిన హామీని కూడా నెరవేర్చని వారిని ఎన్నడూ విశ్వసించలేం’’ అని విమర్శించారు.

‘‘ప్రపంచంలో అబద్ధాలు చెప్పటంలో ప్రధాని మోదీ అత్యంత ప్రముఖుడు. తాము మాట్లాడేవన్నీ గిమ్మిక్కులేనని అమిత్‌షా ఒకసారి అన్నారు’’ అని ఆయన ఎద్దేవా చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

‘‘మోదీ కేవలం ఒక బీజేపీకి మాత్రమే ప్రధానమంత్రి కాదు. మొత్తం దేశానికీ ప్రధానమంత్రి. కానీ విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల విషయంలో ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి లాగా కాకుండా పాకిస్తాన్ ప్రధానమంత్రిలాగా వ్యవహరిస్తున్నారు’’ అని కేజ్రీవాల్ ఆరోపించారు.

‘‘దిల్లీలో ఉన్న అవినీతి వ్యతిరేక విభాగాన్ని మోదీ అధికారంలోకి వచ్చాక పారామిలటరీ దళాలు కబ్జా చేశాయి. నరేంద్రమోదీ పంపిన సీబీఐ అధికారులను మమతాబెనర్జీ తరిమికొట్టారు. ఆమెకు సెల్యూట్ చేస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు, కేజ్రీవాల్

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/gettyimages

‘‘మోదీ, అమిత్‌షా ద్వయం మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో సమాఖ్య వ్యవస్థ కుప్పకూలుతుంది. చంద్రబాబు చేస్తున్న పోరాటం ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల పోరాటం మాత్రమే కాదు.. మొత్తం దేశ ప్రజల పోరాటం. మేం సంపూర్ణంగా మద్దతు అందిస్తాం’’ అని కేజ్రీవాల్ చెప్పారు.

విశాఖ రైల్వే జోన్ ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి: మల్లికార్జున్ ఖర్గే

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు చేపట్టిన సత్యాగ్రహానికి మా అందరి మద్దతు ఉందని మల్లికార్జున ఖర్గే అన్నారు.

విశాఖ రైల్వే జోన్ ఇవ్వడానికి అభ్యంతరం ఏముందన్నారు. రాష్ట్రాన్నే విభజించడం సాధ్యమైనప్పుడు రైల్వే జోన్ విభజించడం ఎందుకు సాధ్యం కాదని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు.

మేమంతా మీవెంటే: శరద్ పవార్

విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు రూ.వేల కోట్ల నష్టం వచ్చిందని, కేంద్రం ఆ ఆర్థిక లోటును భర్తీ చేయలేదని ఎన్సీపీ నేత శరద్‌పవార్‌ అన్నారు. ధర్మపోరాట దీక్షకు సంఘీభావం తెలిపిన ఆయన.. ఆంధ్రప్రదేశ్‌ హక్కుల సాధనలో ఎన్డీయేతర పార్టీల సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

మోదీ పాలనలో ఏపీకి ఏమీ దక్కలేదని, ప్రధాని మోదీకి బుద్ధి చెప్పేందుకు ఆంధ్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు.

గులాం నబీ ఆజాద్ ఏమన్నారంటే..

విద్యార్థులు, మహిళలు, రైతులు.. ఇలా సమాజంలోని అన్ని వర్గాల వారిని బీజేపీ ప్రభుత్వం మోసగించిందని గులాంనబీ ఆజాద్ అన్నారు.

బీజేపీ దేశ ప్రజల మధ్య విద్వేషాలను పెంచుతోందని ఆరోపించారు.

అంతకు ముందు చంద్రబాబు నాయుడు దీక్ష సభలో మాట్లాడారు. తెలుగులోనూ, ఇంగ్లిష్‌లోనూ ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

bbc
ఫొటో క్యాప్షన్, దీక్ష ప్రాంగణం

విభజన చట్టంలో 18 హామీలను నెరవేర్చలేదు: చంద్రబాబు

- విభజన తర్వాత ఆర్థిక సుస్థిరత కోసం, ఆంధ్రప్రదేశ్ మనుగడ కోసం ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆర్థికమంత్రిగా ఉన్న అరుణ్‌జైట్లీ, నేడు ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు నాడు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నా.

- విభజన చట్టంలో 18 అంశాలను నెరవేర్చాల్సి ఉంది. ఒకటి లోటు బడ్జెట్. అప్పుడు దాదాపు రూ. 16,000 కోట్లు లోటు బడ్జెట్‌గా చెప్పారు. దానికింద కేవలం రూ. 3,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇంకేమీ ఇవ్వటం లేదు.

- రాయలసీమకు, ఉత్తరాంధ్రలకు బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామన్నారు. కానీ అవి ఇవ్వలేదు. జిల్లాలకు ఇచ్చిన అరకొర నిధులను కూడా వెనక్కు తీసేసుకున్నారు.

- రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం, పెట్రో కెమికల్ కారిడార్ హామీలేవీ నెరవేర్చలేదు. పోలవరం డీపీఆర్ ఇంతవరకూ అంగీకరించలేదు.

దిల్లీలో చంద్రబాబు దీక్ష

హక్కుల కోసం పోరాడుతున్నాం.. మీ భిక్ష కోసం కాదు

- కొత్త రాజధాని నిర్మాణానికి ఐదు లక్షల కోట్ల రూపాయలు అవసరమని, నిర్మాణానికి 20 సంవత్సరాలు పడుతుందని మేం ఆనాడే చెప్పాం. ప్రభుత్వం రూ. 25,000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చింది.

- ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తామని చెప్తేనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. రాష్ట్ర హక్కులు ఉల్లంఘిస్తే బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నా. మా ఐదు కోట్ల మంది ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే తగిన గుణపాఠం చెప్తామని ఈ దిల్లీ సభ ద్వారా హెచ్చరిస్తున్నా.

- మా హక్కుల కోసం పోరాడుతున్నాం తప్ప మీ భిక్ష కోసం కాదు.. మీ దయాదాక్షిణ్యాలు మాకవసరం లేదు. మా మీద వివక్ష చూపిస్తే మీ ఆటలు సాగవని హెచ్చరిస్తున్నా.

- న్యాయం కోసం పోరాడుతుంటే మోదీ నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. లెక్కలు చెప్పమని అడిగితే నేను భయపడుతున్నామని మోదీ అన్నారు. లెక్కలు చెప్పటానికి మేం సిద్ధం.. మేము పన్నులు కట్టిన దానికి లెక్కలు చెప్పటానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

- టీడీపీ నాయకులపై ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారు. దిల్లీ రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. మోదీకి పరిపాలించే హక్కు లేదు. ప్రజలు ఆయనను సాగనంపుతారు.

దిల్లీలో చంద్రబాబు దీక్ష

రాజ్‌ఘాట్‌లో నివాళుల అనంతరం దీక్ష ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిల్లీలో సోమవారం ‘ధర్మపోరాట దీక్ష’ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏపీ భవన్ వద్దకు పెద్దఎత్తున తెలుగు దేశం పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. శ్రీకాకుళం, అనంతపురం నుంచి రెండు ప్రత్యేక రైళ్ల ద్వారా టీడీపీ కార్యకర్తలు దిల్లీ వచ్చారు.

ధర్మ పోరాట దీక్ష వద్ద సెల్ఫీ

అంతకుముందు చంద్రబాబునాయుడు రాజ్‌ఘాట్ వెళ్లి.. మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అక్కడి నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ భవన్ వద్దకు చేరుకుని ధర్మపోరాట దీక్షను ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు కూడా దీక్షలో పాల్గొన్నారు.

దిల్లీలోని ఏపీ భవన్‌ ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరగనున్న దీక్ష కోసం భారీ స్థాయిలో వేదికను ఏర్పాటు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేయటం, ఆయన విమర్శలపై చంద్రబాబు ఘాటుగా స్పందించిన నేపథ్యంలో.. ఈ దీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

‘‘మీరే ఈ దేశానికే దిష్టిబొమ్మగా మారారనేదే నా బాధ’’

ఇదిలావుంటే.. ''ప్యాకేజి గురించి ప్రసవ్తవించిన మీరు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదో ప్రజలకు చెప్పలేకపోయారెందుకని..? హోదా ఇస్తే గుజరాత్‌ని మించిపోతుందని భయంతోనే ఏపికి ఇవ్వలేదని చెప్పలేకపోయారా..?'' అని ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ చంద్రబాబు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.

‘‘నా రాష్ట్రం మీద, నా కుటుంబం మీద చేసిన మీ వ్యాఖ్యలను దిష్టిచుక్కలుగానే నేను భావిస్తాను. కాకపోతే మీరే మరీ ఈ దేశానికే దిష్టిబొమ్మగా మారారే అనేదే నా బాధ’’ అంటూ ఆ లేఖలో ఎద్దేవా చేశారు.

ప్రత్యేక హోదా డిమాండ్‌తో చంద్రబాబు దిల్లీలో దీక్ష చేపట్టటం ‘‘హంతకుడే తాను హత్య చేసిన బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేసినట్లు’’ ఉందని ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

మరోవైపు.. ‘‘ప్యాకేజీ కోసం హోదాను తాకట్టుపెట్టిన ప్రజా ద్రోహి చంద్రబాబు. ప్యాకేజీ ద్వారా వచ్చే నిధుల కోసం చాటుగా ఢిల్లీని దేబిరిస్తూనే మరోపక్క దొంగ దీక్షలు చేస్తున్నారు’’ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక ట్వీట్‌లో ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)