ప్రియాంకగాంధీ: రాహుల్‌తో కలిసి లఖ్‌నవూలో రోడ్ షో

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర ప్రదేశ్ పార్టీ పగ్గాలు అందుకున్న తర్వాత ప్రియాంక గాంధీ మొదటి సారి లఖ్‌నవూలో పర్యటించారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించింది.
ప్రియాంక గాంధీతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ యూపీ ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఉన్నారు.
లఖ్‌నవూ విమానాశ్రయం నుంచి అక్కడి కాంగ్రెస్ కార్యాలయం వరకూ ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా రోడ్‌షో నిర్వహించారు.

ఫొటో సోర్స్, congress/twitter
రోడ్‌షో జరిగే ఈ 12 కిలోమీటర్ల రూట్ మ్యాప్‌ను యూపీ కాంగ్రెస్ ఫిబ్రవరి 9న నిర్ధారించింది.
ఈ రోడ్ షోలో 500 మంది కార్యకర్తలతో ఉన్న 'ప్రియాంక సేన' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సేనలో కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు.

ఫొటో సోర్స్, up congress
ముఖ్యంగా వీరంతా 'పింక్ డ్రెస్' వేసుకున్నారు. మహిళలపై గౌరవానికి సూచనగానే తాము ఈ రంగు ఎంచుకున్నామని చెప్పారు.
ప్రియాంక గాంధీ రోడ్ షో జరుగుతున్న దారిలో కాంగ్రెస్ అభిమానులు మేం 'నీలో ఇందిరను చూస్తున్నాం' అనే భారీ హోర్డింగులు కూడా ఏర్పాటు చేశారు.
ప్రియాంకతోపాటు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉన్నప్పటికీ నేతలు, కార్యకర్తలు అందరూ ప్రియాంక కళ్లలో పడడానికి ప్రయత్నించారు. దారి పొడవునా ఆమె పేరుతో నినాదాలు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
'నయీ ఉమీద్, నయా దేశ్' అనే ట్యాగ్‌లైన్‌తో "పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ ఇంఛార్జిలు రోడ్ షో పొడవునా వేలాది మంది మద్దతుదారులను కలిశారని ఆ పార్టీ తన అధికారిక ట్విటర్ హాండిల్లో పేర్కొంది.
ఈ రోడ్ షోలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేవరకూ తమకు సంతృప్తి లేదని అన్నారు. తమది పేదల, రైతుల ప్రభుత్వం అని చెప్పారు.
"దేశ చౌకీదార్, ఉత్తర ప్రదేశ్, ఇతర రాష్ట్రాలు, ఎయిర్ ఫోర్స్ డబ్బు దొంగిలించారని" రాహుల్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, AICC
తర్వాత రాహుల గాంధీ, ప్రియాంక గాంధీ.. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులు అర్పించారు.
ఇవి కూడా చదవండి:
- #MeToo: 'పని మనుషులపై లైంగిక వేధింపులు.. లక్షల్లో బాధితులు'
- 'కార్డు'లను కరెన్సీనోట్లుగా మార్చేందుకు సైబర్ నేరగాళ్లు ఏం చేస్తున్నారంటే..
- మెనోపాజ్: ఇంతటితో స్త్రీ జీవితం అయిపోదు.. దాంపత్యానికి పనికిరాననీ అనుకోవద్దు
- పర్సును వెనక జేబులో పెట్టుకుంటే వెన్నుకు ఏమవుతుంది?
- చంద్రుని మీద మొలకెత్తిన చైనా పత్తి విత్తనం
- అమ్మాయిల కన్యత్వానికి, సీసా సీల్‌కు ఏమిటి సంబంధం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








