ప్రత్యేక హోదా అడిగితే జైల్లో పెడతానన్న చంద్రబాబు ఇప్పుడు దీక్షలు చేస్తున్నారు- వైఎస్ జగన్

ఫొటో సోర్స్, facebook/YSJaganmohanreddy
ప్రత్యేక హోదా అడిగితే జైళ్లో పెడతానన్న చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న వేళ దిల్లీలో దీక్షలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విమర్శించారు.
అనంతపురం జిల్లాలో సమర శంఖారావం పేరుతో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. 2014లో ఓట్ల కోసం చంద్రబాబు అనేక హామీలిచ్చారని, వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు.
నాలుగేళ్లు బీజేపీతో అధికారం పంచుకున్న టీడీపీ ఇప్పుడు ఎన్నికల వేళ కొత్త డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక హోదా వల్ల ఏం ఓరుగుతుంది? హోదా ఏమైనా సంజీవినా ? అని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు నల్లచొక్కాలు వేసుకొని దీక్షలు చేస్తున్నారని తప్పుపట్టారు.
ప్రత్యేక హోదా కావాలని అడిగితే జైళ్లో పెడుతానని చంద్రబాబు హెచ్చరించారని అన్నారు.
జనవరి 27, 2017న చంద్రబాబు మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌కే మోదీ ఎక్కువ చేశారని చంద్రబాబు అన్నట్లు జగన్ గుర్తు చేశారు.

ఫొటో సోర్స్, ugc
చంద్రబాబు నన్ను కాపీ కొడుతున్నారు
ప్రతీ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చంద్రబాబు వారికి ఏమీ చేయలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలోనే ఆయనకు బీసీలు గుర్తుకొస్తారని విమర్శించారు.
టీడీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేరలేదని అన్నారు. తాము ప్రజలకు ఇస్తున్న హామీలను చంద్రబాబు కాపీ కొడుతున్నారన్నారు. కనీసం కాపీ కొట్టడం కూడా చంద్రబాబుకు చేతకావడం లేదని విమర్శించారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు ఎంత ఉన్నా నాలుగు దఫాలుగా వాటిని మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆస్పత్రి ఖర్చులు రూ.వెయ్యి దాటితే ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు.

ఫొటో సోర్స్, UGC
టీడీపీ మరోసారి అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటుకు రూ. 3 వేలు ఇస్తామంటూ గ్రామాల్లోకి డబ్బు మూటలు తరలిస్తారని విమర్శించారు.
తమ పార్టీ కార్యకర్తలు కొంతమందిపై అక్రమ కేసులు పెట్టారని, మరికొందరిని పథకాలను దూరం చేశారని అన్నారు.
ఇకపై ‘నిన్ను నమ్మం బాబు’ అని గ్రామాల్లో ప్రతీ ఒక్కరికి చెప్పాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
ఇవి కూడా చదవండి
- 'సర్కార్'లో చెప్తున్న సెక్షన్ 49(పి)తో దొంగ ఓటును గెలవడం సాధ్యమేనా?
- నెహ్రూ కాలర్ పట్టుకుని నిలదీసిన మహిళ
- జాతీయగీతానికి మదనపల్లెకూ ఉన్న సంబంధమిది
- క్విట్ ఇండియా ఉద్యమం: ఆ ఊళ్లో ఇంటి పేరును ఆజాద్ అని మార్చుకున్నారు
- 90 ఏళ్ల క్రితం కులం గురించి భగత్‌సింగ్ ఏం చెప్పారు?
- రూ.10 కాయిన్స్: ఏవి చెల్లుతాయి? ఏవి చెల్లవు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








