లియాండర్ పేస్: టెన్నిస్‌లోనే కాదు వివాదాల్లోనూ చాంపియన్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వందన
- హోదా, టీవీ ఎడిటర్, ఇండియన్ లాంగ్వేజెస్
ఇది 2016లో జరిగిన విషయం. లండన్, రియో ఒలింపిక్స్‌లో టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ టీమ్ గురించి లియాండర్ పేస్ కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు.
దీంతో కోపం వచ్చిన సానియా మీర్జా ఎవరి పేరు ప్రస్తావించకుండా ఒక ట్వీట్ చేసింది. "ఒక టాక్సిక్ వ్యక్తి నుంచి గెలవడానికి ఒకే పద్ధతి ఉంది, వారితో కలిసి ఆడకపోవడం" అని పోస్ట్ చేసింది.
రియో ఒలింపిక్స్‌లో భారత్ తరపున సానియాతో కలిసి డబుల్స్ ఆడాలని పేస్ భావించగా.. సానియా బోపన్నతో కలిసి ఆడారు.

ఫొటో సోర్స్, TWITTER
ఇప్పుడు ఆసియా క్రీడలకు కొన్ని గంటల ముందు టీమ్ నుంచి తప్పుకోవాలనే నిర్ణయంతో పేస్ మళ్లీ వివాదాల్లోకి ఎక్కాడు.
దీనిపై పేస్ వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడాడు. "ఆసియా క్రీడల్లో బలమైన రెండో డబుల్స్ జోడీ కోసం జట్టులోకి డబుల్స్ స్పెషలిస్టును తీసుకోమని నేను చాలా వారాలుగా చెబుతున్నా. కానీ లాభం లేకుండా పోయింది అని" చెప్పాడు.
లియాండర్ పేస్‌కు టైటిల్స్ గెలవడం, వివాదాలు కొత్తేం కాదు. కానీ, పేస్ వివాదాల గురించి తెలుసుకునే ముందు అతడి కెరీర్ గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
28 ఏళ్లు వెనక్కు వెళ్తే, 1990లో భారత్, జపాన్ డేవిస్‌కప్ పోటీలు జరుగుతున్నాయి. చండీగఢ్ సెక్టార్-10లో జరుగుతున్న ఆ పోటీల్లో 17 ఏళ్ల లియాండర్ పేస్, డేవిస్ కప్ టీమ్ రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్నాడు.
అప్పటి నాన్ ప్లేయింగ్ కెప్టెన్ నరేష్ కుమార్, ఎప్పుడూ డేవిస్ కప్ ఆడని కొత్త కుర్రాడు పేస్‌పై నమ్మకం ఉంచాడు. 17 ఏళ్ల పేస్, జిషాన్ అలీతో కలిసి జపాన్ జోడీతో తలపడాలి.
ఐదు గంటలకు పైగా సాగిన ఆ ఆటలో పేస్, జిషాన్ జోడీ 4-6, 6-3,6-4,4-6, 18-16 తేడాతో మ్యాచ్ గెలుచుకుంది. ఆ రోజు డేవిస్ కప్‌కే కాదు, భారతీయ టెన్నిస్‌కు కూడా ఒక కొత్త తార లభించాడు.
భారత డేవిస్ కప్ చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా నడిచిన ఐదో సెట్ కూడా ఇదే. ఇప్పుడు 45 ఏళ్ల వయసులో ఉన్న లియాండర్ పేస్ ఎక్కువకాలం టెన్నిస్ ఆడిన భారతీయ టెన్నిస్ ఆటగాడు కూడా అయ్యాడు.
అతడి 28 ఏళ్ల కెరీర్ ఒక డ్రీమ్ రన్‌లా నడిచింది. అందులో యాక్షన్, డ్రామా, రొమాన్స్, వివాదాలు అన్నీ ఉన్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఫుట్‌బాల్ వద్దని టెన్నిస్ ఎంచుకున్నాడు
1986 మే 12.. ఇదే రోజు టెన్నిస్ ఆడడం కోసం లియాండర్ ఇల్లు వదిలాడు. భారత హాకీ టీంలో ఆడిన తన తండ్రిలా ఒలింపిక్ పతకం గెలవాలనేదే అతడి లక్ష్యం.
కోల్‌కతాలో నివసించే లియాండర్ పేస్ ఫుట్‌బాల్, టెన్నిస్ రెండూ బాగా ఆడేవాడు. కానీ 12 ఏళ్ల వయసులో అతడికి వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. ఒలింపిక్ పతకం గెలవాలనే కల నెరవేర్చుకోడానికి అతడు టెన్నిస్ వైపే మొగ్గుచూపాడు.
28 ఏళ్ల నుంచి టెన్నిస్ ఆడుతున్న పేస్ గురించి ఏటీపీ వరల్డ్ టూర్ వెబ్‌సైట్ ఒక ప్రత్యేక వ్యాసం ప్రచురించింది.
"లియాండర్ పేస్ 1990లో జూనియర్ వింబుల్డన్ విజయంతో తన జర్నీ ప్రారంభించినపుడు, ప్రస్తుతం ఏటీపీ ర్యాంకింగ్ టాప్ 100 మందిలో ఉన్న 43 మంది ఆటగాళ్లు, 21 మంది డబుల్స్ ఆటగాళ్లు అసలు పుట్టనేలేదు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం" అని చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
లియాండర్ పేస్ 1996 ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం అందించిన ఒకే ఒక క్రీడాకారుడుగా నిలిచాడు. అప్పట్లో పోడియంపై అగాసీ, సెర్జీ బ్రుగ్వేరా, పేస్ ఫొటోలు అన్ని వార్తాపత్రికల మొదటి పేజీలో వచ్చాయి.
కాంస్య పతకం గెలుచుకున్న ఆ మ్యాచ్ లో పేస్ మొదటి సెట్ 3-6 తేడాతో ఓడిపోయాడు. కానీ తర్వాత పుంజుకుని 6-2, 6-4 సెట్ల తేడాతో విజయం సాధించాడు. పోరాడే ఆ సత్తా పేస్‌లో ఈరోజుకూ కనిపిస్తుంది.
అగాసీ తన ఆత్మకథలో పేస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. "పేస్ ఒక హైపవర్ కైనెటిక్ ఎనర్జీ బండిల్" అని ప్రశంసించాడు.

ఫొటో సోర్స్, Getty Images
20 ఏళ్ల ముందు 1998లో ఆగస్టులోనే లియాండర్ పేస్ టెన్నిస్ సంచలనం పీట్ సాంప్రాస్‌ను వరుస సెట్లలో ఓడించాడు. దానికి కొన్ని రోజులముందే సాంప్రాస్ తన నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయాడు. పేస్ దగ్గర అప్పుడు కోల్పోవడానికి ఏదీ లేదు.
కానీ ఆ అద్భుత విజయంతో పేస్ సింగిల్స్‌లో 73వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. డబుల్స్‌లో మహేష్ భూపతితో కలిసి నంబర్ టూకు చేరాడు. చెప్పాలంటే 1998లో పేస్ హవా నడిచింది.
1999లో పేస్, భూపతి నాలుగు గ్రాండ్ స్లామ్ ఫైనల్స్‌కు చేరారు. వాటిలో రెండు గెలిచి, ప్రపంచ నంబర్ వన్ జోడీ అయ్యారు.
ఆ తర్వాత కూడా పేస్ కెరీర్‌లో గ్రాండ్ స్లామ్‌లు వరుసకట్టాయి. వింబుల్డన్, యూఎస్ ఓపెన్ అన్నీ అతడి ఖాతాలో చేరాయి.

ఫొటో సోర్స్, Getty Images
నదాల్‌తో కూడా ఆడాడు.
5 అడుగుల 10 అంగుళాల పొడవుండే పేస్ కంటే ప్రత్యర్థులు చాలా పొడవుగా, దృఢంగా ఉన్నవారే. కానీ పేస్ తన ఆట, వ్యూహం, మానసిక స్థైర్యంతో అందరినీ మించిపోయాడు. వాటిని తన విజయాలకు అనుకూలంగా మార్చుకున్నాడు.
పేస్ ఆటను బాగా గమనించిన వారు అతడి కాళ్లలో చిరుత లాంటి శక్తి, ఆ వేగం ఉందని చెబుతారు.
మీడియాకు ఇచ్చిన అన్ని ఇంటర్వ్యూల్లో పేస్ ఒక మాట చెబుతాడు. ఆటను రీఇన్వెంట్ చేసుకోవడమే తన విజయ రహస్యం అంటాడు.
పేస్ విషయంలో మరో ప్రత్యేకత, అతడితో జత కట్టే కొత్త కొత్త ఆటగాళ్లు. లియాండర్ ఇప్పటివరకూ 120 మందికి పైగా క్రీడాకారులతో జోడీకట్టి, డబుల్స్ ఆడాడు.
వారిలో మార్టినా నవ్రవతిలోవా నుంచి మార్టినా హింగిస్ వరకూ ఉన్నారు. మార్టినా హింగిస్‌తో కలిసి పేస్ ఎన్నో గ్రాండ్ స్లామ్స్ గెలుచుకున్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
2015లో ప్యారిస్ మాస్టర్స్ కోసం పేస్ నదాల్‌ను తన పార్ట్‌నర్‌గా చేసుకున్నాడు.
ఎందుకంటే ఆ సమయంలో పేస్ ర్యాకింగ్ తక్కువ, నదాల్‌లో ఆడడం వల్ల అతడికి ప్రయోజనం లభించింది.

ఫొటో సోర్స్, Getty Images
వివాదాలు
జోడీలతో విజయాలే కాదు, వివాదాలతో కూడా పేస్ వార్తల్లో నిలిచాడు. పేస్ భారతీయుల అభిమాన ఆటగాడు. కానీ తనతో ఆడే ఆటగాళ్లతో మాత్రం పేస్‌కు విభేదాలు వస్తూనే ఉంటాయి.
ఒకప్పుడు 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' అనిపించుకున్న పేస్-భూపతి జోడి 90వ దశకంలో ఎన్నో టైటిల్స్ గెలుచుకుంది. కానీ పట్టాలు తప్పిన తర్వాత ఆ ఎక్స్‌ప్రెస్‌ను మళ్లీ ఒక్కటి చేసి ఎవరూ పరుగులు పెట్టించలేకపోయారు.
ఇద్దరి మధ్య పొసగడం లేదు అనే వార్తలు ఎప్పుడూ వస్తూ ఉండేవి. 2017లో పేస్‌ను డేవిస్‌కప్ కోసం ఎంపిక చేయకపోవడంతో, నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేష్ భూపతితో తను చేసిన వాట్సప్ చాట్‌ను అతడు బయటపెట్టాడని పేస్ ఆరోపించాడు.
ఒక డేవిస్ కప్ కెప్టెన్ ఇలా చేయడం ఏమాత్రం సరికాదని ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
2012లో లండన్ ఒలింపిక్స్ ముందు కూడా తనకు జోడీగా ఎవరైనా చిన్న ఆటగాడిని ఎంపిక చేస్తే అసలు పోటీల నుంచే తప్పుకుంటానని లియాండర్ బెదిరించాడు. అయినా, అతడు లండన్ ఒలింపిక్స్‌లో ఆడాడు.

ఫొటో సోర్స్, TWITTER
రియో ఒలింపిక్ తర్వాత పేస్‌పై ఆటగాళ్ల ఆగ్రహం మరోసారి బయటపడింది.
ఎవరినీ ఉద్దేశించకుండా ట్వీట్ చేసిన రోహన్ బోపన్న "మళ్లీ మొదలైంది. వార్తల్లో నిలిచి ఉండడానికి అవే ఎత్తులు, తోటి ఆటగాళ్లకు వ్యతిరేకంగా మీడియాలో దాడి" అని పోస్ట్ చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఏజ్‌లెస్ వండర్
వివాదాలు ఎన్ని చుట్టుముట్టినా పేస్ రికార్డులపై అవి ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. ఇప్పటికీ అతడిని అభిమానులు 'ఐరన్‌మ్యాన్, ఏజ్‌లెస్ వండర్' అని పిలుచుకుంటూ ఉంటారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
23 సార్లు గ్రాండ్ స్లామ్ చాంపియన్ అయిన సెరీనా విలియమ్స్ తన కూతురు ఎలెక్సిస్ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేసినపుడు, దానికి పేస్ "@serenawilliams.. 2040 వింబుల్డన్‌లో ఆడడానికి పార్ట్‌నర్ కోసం వెతుకుతున్నా. ఆ టైటిల్ గెలుచుకోడానికి మీ కూతురేమైనా నాకు సాయం చేయగలదని, మీకు అనిపిస్తోందా" అని పేస్ ట్వీట్ చేశాడు.
ఇది సరదాగా పోస్ట్ చేసిందే, 2040 నాటికి లియాండర్ పేస్ రిటైర్ అయిపోయి ఉంటాడు. కానీ అతడిలోని పోరాట స్పూర్తి, ఆటపై ఉన్న కసి, ఉత్సాహాన్ని ఆ ట్వీట్ మనకు చెబుతుంది. పేస్ విజయ రహస్యం కూడా అదే.
లియాండర్ పేస్ జకార్తాలో ఆడి ఉంటే 2006 తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అతడు ఆసియా క్రీడల్లోకి తిరిగి వచ్చినట్టు అయ్యేది. 2006లో ఆడిన పేస్ , సానియాతో కలిసి దేశానికి రెండు గోల్డ్ మెడల్స్ కూడా అందించాడు. కానీ ఈసారీ మాత్రం అభిమానులు అతడి ఆటను ఆసియా క్రీడల్లో చూడలేకపోతున్నారు.
ఇవి కూడా చదవండి:
- సచిన్‌ను అందరికన్నా ఎక్కువ భయపెట్టిన క్రికెటర్ ఆయనే
- లైఫ్‌స్టైలే వినోద్ కాంబ్లీ ఫెయిల్యూర్‌కు కారణమా?
- నా ఎముకలు విరిచేసి పోలీసులకు అప్పగించాలని ఆ విద్యార్థులు ప్లాన్ చేశారు
- కేరళ వరదలు: 26 సెకన్లలో చిన్నారిని కాపాడిన జవాను
- ఫొటోల్లో లక్షల ఏళ్ల భారత చరిత్ర!
- అమెరికాకు ఆ పేరు పెట్టిన మధ్యయుగాల నాటి మ్యాప్ ఇదే
- సిపాయిల తిరుగుబాటు: పబ్‌లో ఉన్న పుర్రెలో 1857 నాటి చరిత్ర
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








