కేరళ వరదలు: 73 మంది మృతి, రాష్ట్రమంతటా ‘రెడ్ అలర్ట్’

కేరళ వరదలు

ఫొటో సోర్స్, Getty Images

కేరళలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇప్పటివరకూ 73 మందికి పైగా మృతి చెందారు. 85 వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒక్క బుధవారం నాడే 25 మంది మరణించారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

వరద పరిస్థితి తీవ్రంగా ఉండడంతో కోచిలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 26 వరకూ మూసేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు.

కేరళ వరదలు

ఫొటో సోర్స్, Getty Images

వరద సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న నోడల్ అధికారి పీహెచ్ కురియన్ బీబీసీతో "వరదల్లో చాలా మంది చిక్కుకుపోయారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. రాత్రి వారిని చేరుకోవడం కాస్త కష్టంగా ఉన్నా, పగలు మాత్రం సహాయక కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. సైన్యం చాలా సాయం అందిస్తోంది" అని చెప్పారు.

ఐదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని కురియన్ తెలిపారు.

కేరళ వరదలు

ఫొటో సోర్స్, Getty Images

పొంచి ఉన్న ప్రమాదం

"రాష్ట్రంలో గత 10-12 రోజుల నుంచి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. కేరళలో ఇప్పటివరకూ ఎప్పుడూ ఇలాంటి వరదలు రాలేదు" అని బీబీసీ ప్రతినిధి ప్రవీణ్ అన్నామలై తెలిపారు.

కేరళ ఉత్తర జిల్లాల్లో రాత్రంతా వర్షం కురుస్తోంది. స్కూళ్లు, కాలేజీలకు గురువారం వరకూ సెలవులు ప్రకటించారు.

లోతట్టు ప్రాంతాలవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే వర్షాలు పూర్తిగా ఆగిపోయేవరకూ ప్రమాదం తప్పేలా కనిపించడం లేదు.

వీడియో క్యాప్షన్, కేరళలో వరద బీభత్సం

‘కేంద్రం అండగా ఉంటుంది’: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోడీ వరదలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడానని ట్వీట్ చేశారు.

ప్రధాని తన ట్వీట్‌లో "రాష్ట్రంలో వరద పరిస్థితి గురించి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో వివరంగా చర్చించాను. వరదలో చిక్కుకున్న ప్రజలకు కేంద్రం అండగా నిలుస్తుంది. ఎలాంటి సాయం అవసరమైనా అందించడానికి సిద్ధంగా ఉంది. కేరళ ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నా" అని ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

‘విషాదంలో కేరళ’: రాహుల్

కేరళ వరదలపై రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు. కేరళ రాష్ట్రం విషాదంలో మునిగిపోయిందన్నారు. ‘‘కేరళ వరదలపై ప్రధానితో మాట్లాడాను. ఆర్మీ, నేవీ దళాలను పెద్దఎత్తున కేరళకు పంపాలని ఆయనను కోరాను’’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)