యడ్యూరప్ప గురించి తెలుసుకోవాల్సిన 9 ముఖ్య విషయాలు

ఫొటో సోర్స్, Reuters
దక్షిణాదిన బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అయిన తొలి నేతగా బీఎస్ యడ్యూరప్ప రికార్డు సృష్టించారు. ఆయన ఈ రోజు కర్ణాటకకు మూడో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి ఆసక్తికరమైన విషయాలు.
1. ఆయన అసలు పేరు యడియూరప్ప. కానీ, 2007లో జ్యోతిష్యుడి సలహాతో తన పేరును యడ్యూరప్పగా మార్చుకున్నారు.
2. కర్ణాటకలో ప్రాబల్యం ఉన్న లింగాయత్ సముదాయానికి చెందిన వ్యక్తి యడ్యూరప్ప.
3. ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) మూలాలున్న వ్యక్తి. శికారిపుర శాఖ ఆర్ఎస్ఎస్ కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు.
4. జనసంఘ్ నేతగా ఎమర్జెన్సీ సమయంలో జైలుకు కూడా వెళ్లారు. 1975లో శికారిపుర పురపాలక సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Getty Images
5. 2006లో జేడీ(ఎస్) మద్దతుతో అధికారంలో కొనసాగుతున్న ధరమ్‌సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో యడ్డీ కీలకపాత్ర పోషించారు.
6. 2008లో తొలిసారిగా కర్ణాటక పగ్గాలు చేపట్టారు. కానీ, కుమారస్వామి మద్దతు ఉపసంహరించడంతో వారం రోజుల్లోనే సీఎం పదవిలోంచి దిగిపోవాల్సి వచ్చింది.
7. 2011లో మైనింగ్ కుంభకోణం ఆరోపణలు యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి, సొంత పార్టీ నుంచి తప్పుకొనేలా చేశాయి.
8. బీజేపీ నుంచి బయటకు వచ్చాక 'కర్ణాటక జన పక్ష' అనే పేరుతో యడ్డీ సొంతంగా పార్టీ పెట్టారు.
9. 2014 పార్లమెంట్ ఎన్నికల ముందు తన పార్టీని బీజేపీలో విలీనం చేసి ఆ పార్టీ తరఫున షిమోగ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసి గెలిచారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








