మన్మోహన్ సింగ్: వాజ్‌పేయి విమర్శలతో రాజీనామా చేయాలనుకున్న సున్నితస్వభావి... ఆ ఆర్థికవేత్త జీవితం కొన్ని చిత్రాలలో..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిచెందారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తొలి స్వాతంత్య్ర సంగ్రామం 150 వ వార్షికోత్సవం సందర్భంగా న్యూదిల్లీలో 2008 ఏప్రిల్ 18న ఒక నాణేన్ని విడుదల చేసే కార్యక్రమానికి హాజరైన డాక్టర్ మన్మోహన్ సింగ్

భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (92) డిసెంబర్ 26న కన్నుమూశారు.

భారతదేశానికి ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రులలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకరు. ఇక్కడ కొన్ని ఫోటోల ద్వారా ఆయన జీవిత ప్రయాణాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం.

మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డాక్టర్ మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభక్త భారత్‌లోని పంజాబ్‌ (ప్రస్తుతం పాకిస్తాన్)లో ఒక మారుమూల గ్రామంలో జన్మించారు. అప్పట్లో ఆ ఊరికి కరెంట్, మంచినీటి సరఫరా కూడా ఉండేది కాదు. ప్రధానమంత్రి కాకముందు మన్మోహన్ అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో 2013 సెప్టెంబర్ 6న జరిగిన జీ20 సదస్సుకు హాజరైన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
మన్మోహన్ సింగ్ చదువు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో 2012 జనవరిలో జరిగిన 'ఇండియా సైన్స్ కాంగ్రెస్ సెంటీనరీ’ కార్యక్రమానికి హాజరైన అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మన్మోహన్ సింగ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

పంజాబ్ విశ్వవిద్యాలయంలో చదువు పూర్తయ్యాక మన్మోహన్ సింగ్ కేంబ్రిడ్జ్ వర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ చేశారు.

మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గుజరాత్‌‌లోని అహ్మదాబాద్ సమీపంలో 1995 సెప్టెంబర్ 8న మూడు రోజుల సేవాదళ్ శిబిరాన్ని అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ ప్రారంభించారు.

మన్మోహన్ సింగ్ 1982 నుంచి 1985 వరకు ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేశారు. 1991లో దేశం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ భారత రాజకీయాల్లోకి మొదటి అడుగు వేశారు.

ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ చిత్రం 1995 ఫిబ్రవరి 7వ తేదీ నాటిది. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటిది. ఆయనతో పాటు అప్పటి స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రి జో డెలమూర్ ఉన్నారు.
కేంద్రమంత్రి మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెప్టెంబర్ 2004లో విదేశీ పర్యటనకు బయలుదేరే ముందు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాంను కలిసిన డాక్టర్ మన్మోహన్ సింగ్.

జూన్ 1991లో కేంద్రమంత్రి అయిన మన్మోహన్ సింగ్, అదే సంవత్సరం అక్టోబర్‌లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.

మన్మోహన్ సింగ్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దేశ ఆర్థిక వ్యవస్థ సరళీకరణకు మార్గదర్శకత్వం వహించిన మొదట ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్‌. ఆ తర్వాత 2004-14 మధ్యకాలంలో భారత 13వ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
అస్సాం నుంచి వరుసగా ఐదుసార్లు రాజ్యసభలో ప్రాతినిధ్యం.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జూలై 16, 2005న తన అమెరికా పర్యటనకు ముందు, రైల్వే మంత్రి లాలూ యాదవ్ ఇతర క్యాబినెట్ మంత్రులతో డాక్టర్ మన్మోహన్ సింగ్

అస్సాం నుంచి మన్మోహన్ వరుసగా ఐదుసార్లు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించారు. 2019లో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో అనర్గళంగా మాట్లాడే మన్మోహన్ సింగ్, తన కాలంలో అత్యుత్తమ పార్లమెంటరీ స్పీకర్లలో ఒకరు.
మన్మోహన్ సింగ్‌ ప్రసంగం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డాక్టర్ మన్మోహన్ సింగ్ 1996 మే 5 న అహ్మాదాబాద్‌లో గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఉద్దేశించి ప్రసంగించారు.

1984లో జరిగిన సిక్కు ఊచకోతపై పార్లమెంటులో ప్రభుత్వం తరపున మన్మోహన్ సింగ్ క్షమాపణలు చెప్పారు. అయితే, మన్మోహన్ సింగ్‌‌‌తో క్షమాపణలు చెప్పించడంపై కాంగ్రెస్‌ను చాలామంది విమర్శించారు.

మన్మోహన్ సింగ్‌ , సోనియా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మన్మోహన్ సింగ్, గురుశరణ్ కౌర్ దంపతులతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ఈ ఫొటో ఫిబ్రవరి 2014 నాటిది.

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో గాంధీ కుటుంబానికి అండగా ఉన్నారని, మౌన ప్రధానిగా వ్యవహరించారని విమర్శలు ఎదుర్కొన్నారు.

డాక్టర్ మన్మోహన్ సింగ్‌ బలహీనమైన ప్రధానమంత్రి అని బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అడ్వాణీ అన్నారు.

దేశ, ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో అంకితభావంతో పని చేసిందని మన్మోహన్ సింగ్ సమర్థించుకున్నారు.

మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మన్మోహన్ సింగ్ విద్యావేత్త , బ్యూరోక్రాట్ అయినా సాధారణ జీవితమే గడిపేవారు.
మన్మోహన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2015 ఏప్రిల్ లో జరిగిన రైతు ర్యాలీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ

2014లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ '' చరిత్ర నాపై దయ చూపుతుందని నేను నిజాయితీగా నమ్ముతున్నాను'' అని అన్నారు.

ఒబామా కుటుంబంతో మన్మోహన్ కుటుంబం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మన్మోహన్ సింగ్‌ను అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసించారు. 2009 నవంబరులో వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ లో విందుకు ముందు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాదంపతులను మన్మోహన్ సింగ్ దంపతులు కలుసుకున్నారు.
వాజ్‌పేయి, మన్మోహన్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2005 మేలో భేటీ అయిన అటల్ బిహారీ వాజ్ పేయి, మన్మోహన్ సింగ్

వాజ్‌పేయి, మన్మోహన్‌ మధ్య జరిగిన ఒక ఆసక్తికర సంఘటన గురించి సుప్రీంకోర్టు న్యాయవాది ఎన్‌ఎం ఘటాటే వివరించారు.

"1991లో వాజ్‌పేయికి అప్పటి ప్రధాని నరసింహారావు ఫోన్ చేసి, మీరు బడ్జెట్‌ను చాలా ఘాటుగా విమర్శించారని మా ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలనుకుంటున్నారని చెప్పారు. ఇది విన్న వాజ్‌పేయి.. డాక్టర్ మన్మోహన్ సింగ్‌కి ఫోన్ చేసి, రాజకీయ ప్రసంగం కాబట్టి విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోవద్దని సూచించారు" అని చెప్పారు.

ఆ రోజు నుంచి వారిద్దరి మధ్య ప్రత్యేక బంధం ఏర్పడింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)