అక్రమంగా నివసిస్తున్నారంటూ అనేకమంది భారతీయులను విమానంలో పంపిన అమెరికా

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి పత్రాలు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అమెరికాలో ఉంటున్నారంటూ అనేకమంది భారతీయులతో బయలుదేరిన అమెరికా సైనిక విమానం బుధవారం అమృత్‌సర్‌లోని గురు రవిదాస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.
డోనల్ట్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో అనధికారికంగా ఉంటున్న భారతీయులను బహిష్కరించడం ఇదే తొలిసారి.
అమెరిక సైనిక విమానంలో వచ్చిన భారతీయుల పేర్లను చెక్ చేశామని, వారిలో ఎవరూ నేరస్తులు లేరని బీబీసీ అసోసియేట్ జర్నలిస్ట్ రవీందర్ సింగ్ రాబిన్‌తో భద్రతా అధికారులు చెప్పారు.
అమృత్‌సర్ చేరుకున్న వీరిలో కొందర్ని పోలీసు వాహనాల్లో వారి గ్రామాలకు తీసుకెళ్లనున్నట్లు రవీందర్ సింగ్ రాబిన్ చెప్పారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని విమానాల్లో వారి రాష్ట్రాలకుపంపించనున్నారు. విమానాశ్రయం లోపలికి మీడియాను అనుమతించలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
పంజాబ్ ప్రభుత్వం, మీడియా ఏం చెబుతోంది?
అమెరికా నుంచి కొందరు భారతీయులను వెనక్కి పంపించిన వార్తలపై పంజాబ్ ప్రభుత్వంలో ఎన్‌ఆర్ఐ వ్యవహారాలకు మంత్రిగా చేస్తోన్న కుల్దీప్ సింగ్ ధాలివాల్ స్పందించారు.
ఇది చాలా సీరియస్ విషయమని చెప్పారు. అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కుల్దీప్ సింగ్.. చాలామంది భారతీయులు అక్కడికి వర్క్ పర్మిట్లతోనే వెళ్తారని అన్నారు.
వర్క్ పర్మిట్లకు కాలం చెల్లిన తర్వాత, ఈ భారతీయులందరూ అక్రమ వలసదారుల కేటగిరీలోకి వస్తారని చెప్పారు.
అక్కడి నుంచి వెనక్కి పంపిన వారందరూ అమెరికా ఆర్థిక వ్యవస్థకు సహకరించారని ఆయన అన్నారు. వారిని వెనక్కి పంపడానికి బదులు..శాశ్వత నివాసానికి అవకాశం ఇస్తే బాగుండేదని ధాలివాల్ అభిప్రాయపడ్డారు.
ఈ విషయంపై కుల్దీప్ సింగ్ ధాలివాల్ వచ్చే వారంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో సమావేశం కానున్నారు.
సరైన అనుమతులు, పత్రాలు లేకుండా విదేశాలకు వెళ్లొద్దని పంజాబ్ ప్రజలకు మంత్రి సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
గతవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడిన సందర్భంగా, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోలు, అమెరికాలో నిబంధనలకు విరుద్ధంగా నివసిస్తున్న భారతీయ వలసదారుల అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు.
"అమెరికాలో పత్రాలు లేకుండా నివసిస్తున్న భారతీయుల విషయంలో భారతదేశం సరైన చర్యలు తీసుకుంటుందని మేం ఆశిస్తున్నాం.’’ అని అనంతరం జరిగిన మీడియా సమావేశంలో డోనల్డ్ ట్రంప్ అన్నారు.
అక్రమ వలసల అంశాన్ని అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ముందు కూడా ప్రస్తావించారు అమెరికా విదేశాంగ కార్యదర్శి.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జైశంకర్ "భారతదేశం అక్రమ వలసలకు మద్దతు ఇవ్వదు. అక్రమ వలసలు అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలతో ముడిపడి ఉన్నాయి. ఇది మా ప్రతిష్టకు మంచిది కాదు. మా పౌరులలో ఎవరైనా అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు గుర్తిస్తే, వారు భారతీయ పౌరుడే అని తేలితే, వారిని చట్టబద్ధంగా భారతదేశానికి తిరిగి తీసుకువచ్చే ప్రక్రియకు మేము సిద్ధంగా ఉన్నాము" అని జైశంకర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సైనిక విమానంలో తరలింపు
అమెరికాలో నివసిస్తోన్న అక్రమంగా నివసిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వారి దేశాలకు పంపించేందుకు మిలిటరీని వాడటం చాలా అరుదైన విషయం.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, వలసదారుల్ని వెనక్కి పంపించే మిషన్ కోసం మిలటరీని విరివిగా వాడుతున్నారు.
అమెరికా-మెక్సికో సరిహద్దులో ఆర్మీ క్యాంపుల్లో వలసదారుల్ని ఉంచేందుకు ఏర్పాట్లు కూడా చేశారు.
అదే సమయంలో, చాలా దేశాలకు చెందిన అక్రమ వలస ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని కూడా అమెరికా ఆర్మీ వెనక్కి పంపించేస్తోంది.
రాయిటర్స్ కథనాల ప్రకారం.. మొదట గ్వాటెమాలా, పెరూ, హోండురాస్‌లకు చెందిన అనేకమంది వలసదారులను అమెరికా ఆయా దేశాలకు పంపింది.
సాధారణంగా అమెరికా ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ ఆ దేశంలోని అక్రమ వలసదారుల్ని వారి స్వదేశాలకు పంపిస్తూ వస్తోంది.
మిలటరీ సహకారంతో వారిని తరలించడం కాస్త ఖర్చుతో కూడుకున్నదే. గ్వాటెమాలా నుంచి వచ్చిన వలసదారుల్ని వెనక్కి పంపించేందుకు ఆర్మీని వాడినప్పుడు, ఒక్కోక్క వలసదారు మీద సుమారు 4700 డాలర్లను ( సుమారు రూ.4 లక్షలు) అమెరికా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని రాయిటర్స్ వెల్లడించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














