మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పోలింగ్, లెక్కింపు తేదీలివే

ఫొటో సోర్స్, Election Commission of India
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది.
మహారాష్ట్రలో 9.63 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఝార్ఖండ్‌లో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
వీరంతా సజావుగా ఓట్లు వేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
ఓటర్లు ‘ఓటర్ హెల్ప్‌లైన్’ యాప్‌లో తమకు సంబంధించిన సమాచారం చెక్ చేసుకోవచ్చని తెలిపారు.
మొత్తంగా మహారాష్ట్రలో ఒకే విడతలో 288 అసెంబ్లీ స్థానాలకు, ఝార్ఖండ్‌లో రెండు విడతల్లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇరు రాష్ట్రాల ఎన్నికలకు నామినేషన్ తేదీ, ఓటింగ్ తేదీ, కౌంటింగ్ తేదీలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు
నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 22
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 22
నామినేషన్లకు తుది గడువు: 29 అక్టోబర్
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: నవంబర్ 4
పోలింగ్: నవంబర్ 20
ఓట్ల లెక్కింపు: నవంబర్ 23

ఫొటో సోర్స్, Getty Images
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి.
మొదటి ఫేజ్ (43 స్థానాలు)
నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 18
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 18
నామినేషన్లకు తుది గడువు: అక్టోబర్ 25
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: అక్టోబర్ 30
పోలింగ్: నవంబర్ 13
ఓట్ల లెక్కింపు: నవంబర్ 23
రెండో ఫేజ్ (38 స్థానాలు)
నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 22
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 22
నామినేషన్లకు తుది గడువు: అక్టోబర్ 29
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: నవంబర్ 1
పోలింగ్: నవంబర్ 20
ఓట్ల లెక్కింపు: నవంబర్ 23

ఫొటో సోర్స్, Getty Images
మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ఈ ఏడాది నవంబర్ 26తో గడువు ముగియనుంది.
36 జిల్లాల నుంచి 288 మంది సభ్యులున్న అసెంబ్లీ ఇది.
మహారాష్ట్రలో ప్రస్తుతం బీజేపీ, శివసేన, ఎన్సీపీలు కూటమిగా ఉన్న సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది.
ఝార్ఖండ్ అసెంబ్లీ గడువు 2025 జనవరి 25తో ముగియనుంది.
ఝార్ఖండ్ అసెంబ్లీలో 24 జిల్లాల నుంచి 81 మంది సభ్యులుంటారు.
ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వం ఉంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














