మైనర్ బాలికను లైంగికంగా వేధించారంటూ యడ్యూరప్పపై పోక్సో కేసు, ఆయన ఏమన్నారంటే..

యడ్యూరప్ప

ఫొటో సోర్స్, ANI

మైనర్ బాలికపై లైంగిక దాడి చేశారనే అభియోగాలతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పపై కేసు నమోదైనట్టు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.

ఆయనపై బెంగళూరు పోలీసులు పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ 354 (ఏ) కింద కేసు నమోదు చేశారని ఏఎన్ఐ తెలిపింది.

17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు.

2024 ఫిబ్రవరి 2న తాను ఓ చీటింగ్ కేసులో న్యాయం కోసం తల్లీకూతుళ్లు యడ్యూరప్ప నివాసానికి వెళ్ళగా ఈ ఘటన జరిగినట్టు ఆమె గురువారం సాయంత్రం ఫిర్యాదు చేయగా, రాత్రి పొద్దుపోయాక పోలీసులు కేసు నమోదు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఈ ఆరోపణలపై యడ్యూరప్ప స్పందించారు. తాను ఏమీ అనకముందే ఆమె తనపై నిందలు చేశారని ఆయన అన్నారు.

‘‘ఆమె ఇక్కడ నిలబడి, ఏడుస్తున్నారు. ఆమెను గతంలో కూడా చూశాను కానీ కలవలేదు. పిలిచి మాట్లాడాను. ఆ వెంటనే ఆమె నాపై నిందలు వేయడం ప్రారంభించారు. బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్‌ను పిలిచాను. ఆ తర్వాత ఆమె నాపై ఆరోపణలు చేయడం ప్రారంభించారు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేనట్టు అనిపించింది’’ అని యడ్యూరప్ప మీడియాతో చెప్పారు.

ఆయన కార్యాలయంలోని ఓ అధికారి మాట్లాడుతూ ‘‘రెండు నెలల కిందట మాజీ ముఖ్యమంత్రి యడ్యురప్పను కలవడానికి ఆమె వచ్చారు. మా దగ్గర అప్పటి సీసీటీవీ ఫుటేజీ కూడా ఉంది. అందులో ఆమె యడ్యూరప్ప నివాసం బయటే కూర్చున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. యడ్యూరప్ప అసలు ఆమెను కలవనేలేదు’’ అని చెప్పారు.

పలుకుబడి కలిగిన వ్యక్తులపై ఈ మహిళ కేసులు పెట్టారంటూ.. ఒక జాబితాను యడ్యూరప్ప కార్యాలయం విడుదల చేసింది.

కర్ణాటక హోం మంత్రి జీ. పరమేశ్వర పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ కొనసాగుతోంది. ఇది చాలా సున్నితమైన విషయం. నిజం బయటపడేవరకూ ఏం చెప్పలేం’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)