ఒకే రోజు 78 మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్.. విమర్శల వెల్లువ

ఫొటో సోర్స్, ANI
పార్లమెంట్‌లో ఒకేరోజు 78 మంది ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.
లోక్‌సభలో డిసెంబర్ 13న చోటుచేసుకొన్న భద్రతా వైఫల్యాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష ఎంపీలు సోమవారం ఉదయం నుంచి ఉభయ సభల్లో నిరసనలు చేశారు.
భద్రతా వైఫల్యంపై హోం మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని లోక్‌సభలో ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో సభలో వ్యవహార శైలి సరిగా లేదనే కారణంతో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి సహా 33 మంది సభ్యులను సోమవారం స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారని వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది.
ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు ఎంపీలపై సస్పెన్షన్ అమల్లో ఉంటుంది.
సభలో గందరగోళం కారణంగా లోక్‌సభ సమావేశాలను మంగళవారానికి వాయిదా వేశారు స్పీకర్.

ఫొటో సోర్స్, ANI
రాజ్యసభలో 45 మంది సస్పెన్షన్
భద్రతా వైఫల్యంపై రాజ్యసభలోనూ ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలపడంతో చైర్మన్ 45 మందిని సస్పెండ్ చేశారని వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది.
వీరిలో 34 మందిని ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయగా, మిగిలిన 11 మంది విషయంపై ప్రివిలేజ్ కమిటీ మూడు నెలల్లోగా రిపోర్టు ఇవ్వాలని చైర్మన్ కోరారు.
అప్పటివరకు ఈ 11 మందిపై సస్పెన్షన్ అమల్లో ఉంటుంది.

ఫొటో సోర్స్, ANI
చీకటి రోజులు: ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా
సస్పెన్షన్లపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.
‘‘ప్రాథమిక హక్కులను బీజేపీ తుంగలో తొక్కుతోంది’’ అని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆరోపించారు.
విపక్ష ఎంపీల సస్పెన్షన్‌పై ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝా తీవ్రంగా స్పందించారు. ఈ చర్య ప్రధాని నరేంద్ర మోదీ బలహీనతను సూచిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
రెండోసారి అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి మోదీ చాలా బలహీనపడ్డారని ఆరోపించారు.
సోమవారం ఒక్క రోజే రాజ్యసభ నుంచి 45 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. వీరిలో మనోజ్ ఝా ఒకరు.
ఇప్పుడు చీకటి రోజులు నడుస్తున్నాయని, ఇలాంటి సమయాల్లో నియంతలు ప్రశ్నించే పార్లమెంటు ఉండాలని కోరుకోరని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇది ప్రతిపక్షాల ముందస్తు వ్యూహం: పీయూష్ గోయల్
ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌పై రాజ్యసభలో సభా నాయకుడు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. ప్రతిపక్ష నాయకులకు సభ సజావుగా జరగడం ఇష్టం లేదని ఆరోపించారు.
"ఈరోజు మొత్తం 45 మంది రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేశారు. సభ సజావుగా నడవడం వారికి ఇష్టం లేదు, ఇది వారి ముందస్తు వ్యూహం" అని పీయూష్ గోయల్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఎవరెవరు సస్పెండ్ అయ్యారు?
సస్పెన్షన్ వేటు పడిన లోక్‌సభ ఎంపీలు..
- అధీర్ రంజన్ చౌదరి
- కల్యాణ్ బెనర్జీ
- ఏ రాజా
- తిరు దయానిధి మారన్
- అపరూప పొద్దార్
- ప్రసూన్ బెనర్జీ
- ఈటీ మొహమ్మద్ బషీర్
- గణేషన్ సెల్వం
- సీఎన్ అన్నాదురై
- టీ సుమతి (తమిజాచి తంగపాండియన్)
- కనీ. కె.నవాస్
- ఎన్ కే ప్రేమచంద్రన్
- శతాబ్ది రాయ్
- సౌతా రే
- కౌశలేంద్ర కుమార్
- ఆంటో ఆంటోనీ
- ఎస్ఎస్ ప్లానీమాణిక్కం
- ప్రతిమా మోండల్
- కకోలి ఘోస్ దస్తిదార్
- మురళీధరన్
- సునీల్ కుమార్ మోండల్
- సెల్లపెరుమాల్ రామలింగం
- సురేశ్ కొడికున్నిల్
- అమర్ సింగ్
- తాళిక్కోట్టై రాజుతెవార్ బాలు
- తిరునవుక్కరసర్,
- విజయ్ వసంత్
- గౌరవ్ గగోయ్
- రాజ్ మోహన్ ఉన్నితన్
- కే జయ కమార్
- కె. వీరస్వామి
- ఆషిత్ కుమార్ మాల్
- అబ్దుల్ ఖలీక్

ఫొటో సోర్స్, Getty Images
శీతాకాల సమావేశాల వరకు సస్పెండ్ అయిన రాజ్యసభ ఎంపీలు..
- ప్రమోద్ తివారీ
- జైరాం రమేష్
- అమీ యాజ్ఞిక్
- నారన్‌భాయ్ జె. రత్వా
- సయ్యద్ నాసిర్ హుస్సేన్
- ఫూలో దేవి నేతం
- శక్తి సిన్హ్ గోహిల్
- కేసీ వేణుగోపాల్
- రజనీ అశోకరావ్ పాటిల్
- రంజీత్ రంజన్
- ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి
- రణదీప్ సింగ్ సూర్జేవాలా
- సుఖేందు శేఖర్
- మొహమ్మద్ నదీముల్ హక్
- అబిర్ రంజన్ బిస్వాస్
- శాంతాను సేన్
- మౌసమ్ నూర్
- ప్రకాష్ చిక్ బరైక్
- సమీరుల్ ఇస్లాం
- ఎం. షణ్ముగం
- ఎన్.ఆర్. ఎలాంగో
- కనిమొళి
- ఆర్. గిరిరాజన్
- మనోజ్ కుమార్ ఝా
- ఫయాజ్ అహ్మద్
- వి. శివదాసన్
- రామ్‌నాథ్ ఠాకూర్
- అనీల్ ప్రసాద్ హెగ్డే
- వందన చవాన్
- రామ్‌గోపాల్ యాదవ్
- జావేద్ అలీ ఖాన్
- మహువా మజీ
- జోస్ కె. మణి
- అజిత్ కుమార్ భుయాన్
ప్రివిలేజ్ కమిటీ ముందుకు వెళ్లిన రాజ్యసభ ఎంపీల పేర్లు
- జేబీ మాథర్ హిషార్
- ఎల్. హనుమంతయ్య
- నీరజ్ డాంగి
- రాజమణి పటేల్
- కుమార్ కేత్కర్
- జీసీ చంద్రశేఖర్
- బినోయ్ విశ్వం
- పి. సంతోష్ కుమార్
- ఎం. మొహమ్మద్ అబ్దుల్లా
- జాన్ బ్రిట్టాస్
- ఏఏ రహీమ్.
(గమనిక: ఈ కథనం అప్డేట్ అవుతోంది.)
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇవి కూడా చదవండి:
- హత్య కేసులో జైలు పాలైన యువకుడు బెయిల్‌పై బయటకు వచ్చి ‘లా’ చదివి తన కేసు తానే వాదించుకున్నాడు.. మరి నిర్దోషిగా బయటపడ్డాడా?
- మాజీ డీఎస్పీ నళిని: తెలంగాణ కోసం 12 ఏళ్ల కిందట రాజీనామా చేసిన ఈమె గురించి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఆమె ఏమని బదులిచ్చారు?
- మహారాష్ట్ర: 'నా బాయ్ ఫ్రెండ్ నన్ను కారుతో తొక్కించి చంపాలని చూశాడు'.. ఐఏఎస్ అధికారి కుమారుడిపై ఆరోపణ..
- నిమిష ప్రియ: బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తే హత్య కేసులో మరణశిక్ష పడినా తప్పించుకోవచ్చా? యెమెన్‌లో ఈ భారతీయురాలి కేస్ ఏమిటి?
- ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం: రెండు దేశాల పరిష్కారం అంటే ఏంటి... అది ఎందుకు అమలు కాలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














