క్రికెట్ వరల్డ్ కప్ 2023: పాకిస్తాన్ ఇంటికి, సెమీస్‌లో భారత్ vs న్యూజీలాండ్....

భారత్, న్యూజీలాండ్ సెమీస్

ఫొటో సోర్స్, Getty Images

క్రికెట్ ప్రపంచకప్‌లో సెమీఫైనల్ జట్లు ఏవనేది అధికారికంగా తేలిపోయింది. టేబుల్ టాపర్‌గా ఉన్న ఇండియా నాలుగోస్థానంలో ఉన్న న్యూజీలాండ్‌తో నవంబరు 15న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో తలపడనుంది.

పాయింట్ల పట్టికలో 2,3 స్థానాలలో ఉన్న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా కోల్‌కతాలో నవంబరు 16న సెమీస్ ఆడనున్నాయి.

లీగ్ దశలో ఇండియా అగ్రస్థానంలో కొనసాగింది. ఆదివారం నాడు భారత్, నెదర్లాండ్స్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్ ఇండియాకు నామమాత్రమే అయినప్పటికీ ఇందులోనూ గెలిచి సెమీస్ కు మరింత బలంగా వెళుతుందని భావిస్తున్నారు.

ఇక క్రికెట్ వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ ప్రస్థానం ముగిసింది. శనివారం ఇంగ్లండ్, పాకిస్తాన్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను కోల్‌కతాలో ఆడాయి.

నెట్‌ రన్‌రేటు మెరుగుపరుచుకుంటేనే సెమీస్‌కు చేరుకునే అవకాశం ఉన్న పాకిస్తాన్ జట్టుకు మ్యాచ్‌లో టాస్ ఓడిపోగానే సెమీస్ ఆశలు గల్లంతైపోయాయి.

ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో పాకిస్తాన్ దింపుడుకల్లం ఆశలకు గండికొట్టినట్టయింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 337 పరుగుల భారీ స్కోరు చేసింది.

పాకిస్తాన్ సెమీఫైనల్ చేరాలంటే ఇంగ్లండ్ చేసిన 337 పరుగులను కేవలం 6.4 ఓవర్లలోనే సాధించాలి. ఈ లెక్కన చూసినప్పుడు పాకిస్తాన్ 6.4 ఓవర్ల సమయానికి 2 వికెట్లు కోల్పోయి 32 మాత్రమే పరుగులు చేసింది.

పాకిస్తాన్ ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, ఫఖార్ జమాన్ మొదటి మూడు ఓవర్లలోనే వెనుదిరిగారు. ఈ రెండు వికెట్లు కూడా ప్రపంచకప్ తరువాత రిటైర్ కానున్న డేవిడ్ విల్లేకే దక్కాయి.

పాకిస్తాన్ 7 ఓవర్లు ఆడగానే ఇక ఆ జట్టు సెమీస్‌ కు చేరలేదని తేలిపోవడంతో సెమీస్ జట్ల ప్రకటన అధికారికంగా వెల్లడైపోయింది.

ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది. 93 పరుగుల తేడాదో ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ పై విజయం సాధించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

భారత్ న్యూజీలాండ్ సెమీస్

ఫొటో సోర్స్, Getty Images

ముందే తేలిపోయింది కానీ...

పాకిస్తాన్ సెమీస్ చేరదనే విషయం శ్రీలంకపై న్యూజీలాండ్ గెలవగానే తెలిసిపోయింది. అప్పటిదాకా ఏదో ఒకరకంగా సెమీస్ చేరుకోవచ్చని భావిస్తూ వచ్చిన పాకిస్తాన్‌ ఇక ఇంటి ముఖం పట్టిందని తేలిపోయింది. దీంతో ఆ జట్టు ఆడే చివరి మ్యాచ్ పై రకరకాల లెక్కలు వేయడం మొదలైంది.

పాకిస్తాన్ తొలుత టాస్ గెలవాలని ఇంగ్లండ్ పై భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ ఆశలు ఉంటాయని క్రికెట్ పండితులు విశ్లేషించారు. ఇంత భారీ తేడా ఎందుకంటే న్యూజీలాండ్ 9 మ్యాచ్‌లు ఆడి 5 మ్యాచ్‌లు గెలిచి పది పాయింట్లతో ప్లస్ 0.743 రన్‌రేటుతో నిలిచింది.

దీంతో పాకిస్తాన్ తన చివరి మ్యాచ్ గెలిచి, పది పాయింట్లు సాధించినా నెట్‌రన్ రేటు భారీగా మెరుగుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ చేతిలో 8 పాయింట్లు ఉన్నా రన్‌రేటు కేవలం ప్లస్ 0.036 మాత్రమే ఉంది.

అందుకే ఇంగ్లండ్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేస్తే కనీసం 288 పరుగుల భారీ తేడాతో గెలుపొందాల్సి ఉంది. ఈ టోర్నీలో పాకిస్తాన్ ప్రదర్శన చూసినవారికెవరికైనా ఇది అసాధ్యమని ఇట్టే తెలిసిపోతుంది.

అయితే వన్డే మ్యాచ్‌లలో ఎప్పడు ఏం జరుగుతుందో తెలియదు కనుక చివరివరకు చూడాల్సిన అవసరం వచ్చింది.

కానీ, ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగానే పాకిస్తాన్ సెమీస్ చేరలేదనే విషయం కన్ఫామ్ అయిపోయింది.

మరోపక్క పాకిస్తాన్ అప్ఘానిస్తాన్ చేతిలో ఓడినప్పటి నుంచే స్వదేశంలో ఆ జట్టుకు నిరసన సెగ మొదలైంది. మాజీలు బాబర్ సేను ఆడేసుకోవడం మొదలుపెట్టారు.

వసీమ్ అక్రమ్, షోయబ్ అక్తర్ తదితర మాజీ క్రికెటర్లు పాకిస్తాన్ టీమ్ వైఫల్యాన్ని ఎండగట్టారు.

భారత్, న్యూజీలాండ్ సెమీస్

ఫొటో సోర్స్, Getty Images

ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్‌కు తాళం వేయండి: అక్రమ్

పాకిస్తాన్ జట్టు సెమీస్ కు చేరాలంటే ఓ చిట్కా ఉందని పాకిస్తాన్ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్ చెప్పినట్టు పాకిస్తాన్‌కు చెందిన ఏ స్పోర్ట్స్ టీవీ తెలిపింది.

పాకిస్తాన్ సెమీస్ చేరుకోవడానికి ఉన్నదారులపై జరిగిన చర్చలో వసీమ్ అక్రమ్, మరో ముగ్గురు క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు.

ఈ చర్చకు ముందు పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసి తాను ఎన్ని పరుగులు చేయగలదో అన్ని పరుగులు చేయాలని, తరువాత ఇంగ్లండ్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్ దగ్గరకు వెళ్ళి ఆ జట్టు బ్యాట్స్‌మెన్లు బయటకు రాకుండా తాళం వేయాలని, 20 నిమిషాల పాటు తాళం తీయకపోతే టైమ్ అవుట్ అయి పాకిస్తాన్ గెలుస్తుందని చెప్పినట్టు ప్రజెంటర్ గుర్తు చేశారు.

ఈ మాట అన్నది వసీమే కదా అని ఆ ప్రజెంటర్ ప్రశ్నించగా, అవునని మిగతావారు చెపితే తనకు గుర్తులేదన్నట్టుగా వసీమ్ చూశారు. తాను కొన్ని విషయాలు మాత్రమే గుర్తు పెట్టుకుంటానని తెలిపారు.

భారత్, న్యూజీలాండ్ సెమీస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వీరేంద్ర సెహ్వాగ్

బై బై పాకిస్తాన్ అంటూ సెహ్వాగ్ ట్వీట్

ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ శుక్రవారమే బైబై పాకిస్తాన్ అంటూ ట్వీట్ చేశారు. పాకిస్తాన్ సెమీస్ చేరడం అసాధ్యమని తేలిపోవడంతో సెహ్వాగ్ ఈ ట్వీట్ చేశారు.

ఇక శనివారం నాడు సెహ్వాగ్ మరో ట్వీట్ చేశారు.

21వ శతాబ్దంలో మొత్తం 6 ప్రపంచకప్‌లు జరిగాయి. వీటన్నింటిలో 2007లో మాత్రమే భారత్ సెమీస్ క్వాలిఫై కాలేదు. మిగిలిన ఐదు ప్రపంచకప్పులలోనూ సెమీస్‌కు అర్హత సాధించింది.

కానీ ఈ ఆరు ప్రపంచకప్పులలో పాకిస్తాన్ 2011లో మాత్రమే సెమీస్‌కు అర్హత సాధించింది. అప్పుడు వారు పిచ్‌లు, బంతులు మార్చారంటూ ఐసీసీ, బీసీసీఐపై ఆరోపణలు చేశారు.

పాకిస్తాన్‌ను ఓడించిన విషయాన్ని మరిచిపోయి వారి ప్రధాని ఇండియా జట్టు మరో జట్టు పై ఓడిపోతే ఎగతాళి చేశారు.

పాకిస్తాన్ టీమ్ ఇక్కడకు చేరుకున్నాకా హైదరాబాద్‌లో టీ సేవిస్తూ మన సైనికుడిని ఎగతాళి చేసేలా పోస్టులు పెడతారు.

ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ అయితే కెమెరా ముందే మన దేశాన్ని దుష్మన్ ముల్క్ అంటారు. కానీ తమ ద్వేషానికి బదులుగా వారు మన నుంచి ప్రేమను ఆశిస్తారు.

మనతో మంచిగా ఉండేవాళ్ళతో మనం మంచిగానే ఉంటాం.

కానీ ఇంకోరకంగా వ్యవహరిస్తే తగినట్టే సమాధానం చెప్పడం నా మార్గం.

అది మైదానంలోనైనా, మైదానం బయట అయినా సరే అంటూ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

న్యూజీలాండ్‌తో భారత్ పోరులో గెలుపెవరిది?

ఇక భారత జట్టు ముంబయి వాంఖడే స్టేడియంలో న్యూజీలాండ్‌తో తలపడుతుండగా, ఇరు జట్లలో గెలుపు ఎవరిదన్న దానిపై ఎవరి అంచనాలు వాళ్లు వేస్తున్నారు.

ఓవరాల్‌గా వన్డేల్లో భారత్‌పై న్యూజీలాండ్ మంచి విన్నింగ్ ట్రాక్ రికార్డు ఉందని న్యూజీలాండ్ సపోర్టర్లు అంటుండగా, ఈ వరల్డ్ కప్‌‌ జరిగిన మ్యాచ్‌లో జట్టు పోరాట పటిమను గుర్తు చేస్తూ భారత్‌దే పైచేయిగా చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, షబ్నమ్: అండర్ 19 మహిళల ప్రపంచకప్ టోర్నీలో తెలుగమ్మాయి ప్రతిభ

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)