ఆంధ్రప్రదేశ్: మారేడుమిల్లి సమీపంలో బస్సు ప్రమాదం, 9 మంది మృతి

ఫొటో సోర్స్, UGC
- రచయిత, లక్కోజు శ్రీనివాస్, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి దగ్గర ఓ బస్సు ప్రమాదవశాత్తు ఎత్తయిన రోడ్డు నుంచి కింద పడిపోయింది.
బస్సు అరకు నుంచి భద్రాచలం వెళ్తుండగా 5 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నక్వాల్ బీబీసీ కి తెలిపారు
బస్సు గేర్ బాక్స్ పని చేయక పోవడం వల్ల మలుపులో బస్సును అదుపు చేయలేక పోయానని డ్రైవర్ చెబుతున్నారని సబ్ కలెక్టర్ వెల్లడించారు.
ఈ ఘటనలో 9 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారని చింతూరు ఐటీడీఏ పీఓ స్మరణ్ రాజ్ బీబీసీకి ధ్రువీకరించారు. 22 మంది ప్రయాణికులు తీవ్రగాయపడ్డారు.
చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులు ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు.
ఈ బస్సులో ఇద్దరు డ్రైవర్లు సహా 37 మంది ఉన్నట్లు చెబుతున్నారు. తులసిపాకలకు 9 కిలోమీటర్ల దూరంలో ఘాట్‌రోడ్‌లో వెళుతూ బస్సు ప్రమాదానికి గురైంది.
ఐదు 108 వాహనాలను సంఘటనా స్థలానికి తరలించామని అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా 108 కోఆర్డినేటర్ శామ్యూల్ బీబీసీతో చెప్పారు.
(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది)
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, UGC


ఫొటో సోర్స్, UGC
ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారిని భద్రాచలం తరలించి చికిత్స అందిస్తున్నామని, మృతుల్లో చిన్నపిల్లలు లేరని ఐటీడీఏ పీఓ స్మరణ్ రాజ్ వెల్లడించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














