బల్లార్షా: రైల్వేస్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలి ప్రయాణికులకు గాయాలు

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా బల్లార్షా రైల్వేస్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలి ప్రయాణికులు గాయపడ్డారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కొంత భాగం ఒక్కసారిగా కూలిపోవడంతో దానిపై వెళ్తున్నవారు కిందపడిపోయారు.
9 మంది ప్రయాణికులు గాయపడ్డారని రైల్వే పోలీసులు చెప్పారు.

కాగా ఈ ప్రమాదంలో గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని.. వారిని చంద్రపూర్ స్టీల్ హాస్పిటల్‌కు తరలించామని రైల్వే పోలీసులు చెప్పారు.
ఒకటో నంబర్ ప్లాట్ ఫాం నుంచి రెండో నంబర్ ప్లాట్ ఫాంకు వెళ్లే మార్గంలో బ్రిడ్జ్ శ్లాబ్ కూలడంతో దిగువన పట్టాలపై పడిపోయారు కొందరు ప్రయాణికులు.
అయితే, ప్లాట్‌ఫాంపై ఉన్నవారు వెంటనే స్పందించి పట్టాలపై దూకి వారిని కాపాడారు.
ఇలాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మొత్తం 9 మంది వంతెన పైనుంచి కిందపడిపోగా వారిలో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
మరో ఏడుగురు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- హాయిగా నిద్ర పట్టాలంటే ఇంట్లో ఎలాంటి మార్పులు చేయాలి?
- ఈ భారీ బిలాల రహస్యం ఏమిటి, హఠాత్తుగా భూమి ఎందుకు విస్ఫోటం చెందుతోంది?
- వర్గీస్ కురియన్: ‘అమూల్ సీక్రెట్ తెలుసుకోవడానికే ప్రధాని లాల్ బహాదుర్ శాస్త్రి ఆ ఊళ్లో రాత్రి బస చేశారు..’
- ‘లావుగా ఉన్నావని గేలి చేశారు’ అంటూ కేరళ మంత్రి పోస్ట్, ‘బాడీ షేమింగ్’పై స్కూళ్ళలో పాఠాలు చేర్చాలనే ఆలోచనలో ప్రభుత్వం
- 28 ఏళ్ల పాటు పురుషుడిగా జీవించి, మహిళగా మారిన ఒక టీచర్ కథ..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











