ఆర్మీని ‘అవమానించి’ సారీ చెప్పిన రిచా చద్దా... ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, నిఖిల్ ఏమన్నారు

రిచా చద్దా

ఫొటో సోర్స్, RICHA CHADDHA

ఫొటో క్యాప్షన్, రిచా చద్దా

బాలీవుడ్ నటి రిచా చద్దా తాను గల్వాన్ ప్రస్తావన తెస్తూ చేసిన ట్వీట్ విషయంలో క్షమాపణ చెప్పారు.

అయ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా సామాజిక మాధ్యమాల్లో రిచా చద్దాపై ఆగ్రహం తగ్గడం లేదు.

ట్విటర్‌లో ఆమెపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆమె నటించిన ‘ఫుక్రే 3’ సినిమాను చూడొద్దంటూ యూజర్లు ట్వీట్లు చేస్తున్నారు.

‘‘బాయ్‌కాట్ ఫుక్రే 3’’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

మరోవైపు కొంతమంది ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

గల్వాన్‌పై రిచా చేసిన ట్వీట్‌ను ఖండిస్తూ బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, కె.కె మీనన్, రణ్‌వీర్ శౌరీ ట్వీట్ చేశారు.

తెలుగు హీరోలు నిఖిల్ సిద్ధార్థ, మంచు విష్ణు కూడా రిచా చద్దా ట్వీట్‌ను ఖండించారు.

అయితే ప్రకాశ్ రాజ్ వంటి కొందరు నటులు మాత్రం ఆమెకు అండగా నిలిచారు.

రిచాపై మండిపడ్డ మంచు విష్ణు, నిఖిల్, బాలీవుడ్ సెలబ్రిటీలు

రిచా ట్వీట్‌పై తెలుగు హీరో మంచు విష్ణు స్పందిస్తూ ‘ఈమెకు ఏమైంది? ఇలాంటి ఆలోచన మీకు ఎందుకొస్తుంది? సాయుధ దళాలు ఈ దేశానికి చేసిన సేవకు గాను ప్రతి ఒక్కరూ వారిని పూజించాలి. కానీ, ఇలాంటి కృతజ్ఞత లేని భారతీయులను చూస్తుంటే బాధగా ఉంది’ అంటూ ఆయన ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

మరో తెలుగు హీరో నిఖిల్ కూడా రిచా తీరును తప్పుపట్టారు.

‘మనల్ని, మన దేశాన్ని రక్షించే క్రమంలో 20 మంది ధైర్యవంతులైన భారతీయ జవాన్లు గల్వాన్‌లో వారి ప్రాణాలు అర్పించారు. వారి త్యాగం గురించి చదువుతుంటే ఇప్పటికీ కళ్లలో నీళ్లొస్తాయి. రాజకీయాలు వద్దు. మన సైన్యం, సాయుధ బలగాలను ఏ రోజూ కించపరచొద్దు, వారికి ఎప్పుడూ గౌరవమే దక్కాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.

ప్లీజ్ రిచా చద్దా అంటూ నిఖిల్ ఆమెను ట్యాగ్ చేశారు కూడా.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

రిచా ట్వీట్‌పై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

‘‘దేశం గురించి తప్పుగా మాట్లాడుతూ పాపులర్ అయ్యేందుకు ప్రయత్నించడం పిరికివారు చేసే పని. ముఖ్యంగా సైన్యం గౌరవాన్ని పణంగా పెట్టడం కంటే సిగ్గుచేటు పని ఇంకేం ఉంటుంది’’ అని అనుపమ్ ఖేర్ తన ట్వీట్‌లో రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

అనుపమ్ ఖేర్ కంటే ముందు అక్షయ్ కుమార్ కూడా ట్వీట్ చేస్తూ రిచా చద్దాను విమర్శించారు.

‘‘ఇది చూడటం చాలా బాధాకరంగా ఉంది. సాయుధ బలగాల పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. అమర్యాదకరంగా ప్రవర్తించకూడదు. వారు ఉన్నారు కాబట్టే ఈరోజు మనం బతకగలుగుతున్నాం’’ అని రిచా ట్వీట్‌కు అక్షయ్ కుమార్ బదులిచ్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

కె.కె మీనన్ ట్వీట్ చేస్తూ... ‘‘సైన్యం మన రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెడుతోంది. మనం వారిపట్ల కనీసం హృదయపూర్వకంగా విధేయంగా, గౌరవంగా ఉండలేమా? వందే మాతరం’’ అని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 5

రణ్‌వీర్ శౌరీ కూడా ఈ అంశంపై ట్విటర్ ద్వారా స్పందించారు.

‘‘బహిష్కృతులైన రాజకీయ నాయకులు మెప్పు పొందడం కోసం లేదా వారి మేథావర్గానికి చెందిన గ్రూపుల్లో స్థానం సంపాదించడం కోసం మన సైన్యం చేసిన త్యాగాల గురించి ఎగతాళిగా మాట్లాడిన తెలివితక్కువ వారు చేసే పని. సైన్యానికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని’’ అంటూ రణ్‌వీర్ శౌరీ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 6

సినీ నిర్మాత వివేక్ అగ్నిహోత్రి ఇలా రాశారు.

‘‘ఈ వైఖరి నాకు ఆశ్చర్యం కలిగించలేదు. వారు నిజంగా భారత్‌కు వ్యతిరేకులు. మనసులో ఉన్నమాటే మాటల ద్వారా బయటకు వస్తుంది’’ అని ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 7

‘ఫుక్రె 3’ సినిమా బాయ్‌కాట్ చేయాలంటూ విజ్ఞప్తులు

రిచా చేసిన ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కొంతమంది ట్విటర్ యూజర్లు ఆమె నటించిన ‘ఫుక్రె 3’ చిత్రాన్ని బహిష్కరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

‘‘మన సైన్యం ధైర్యసాహసాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసిస్తుంటారు. కానీ కొందరికి ఇది అర్థం కాదు. ‘బాయ్‌కాట్ ఫుక్రె 3’’ అంటూ ఒక ఖాతాదారు ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 8

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 9
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 9

శివాంగి సింగ్ అనే మరో ఖాతాదారు ట్వీట్ చేస్తూ... ‘‘కాస్త సంయమనం పాటించండి. ఫుక్రె 3 సినిమా త్వరలోనే విడుదల అవుతుంది. ఖాళీ థియేటర్లు రిచా చద్దాకు ‘హాయ్’ చెబుతాయి. రిచా చద్దా గ్యాంగ్‌కు గుణపాఠం చెప్పాలి. ఫుక్రె 3ని బహిష్కరించడం కంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు’’ అని రాసుకొచ్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 10
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 10

రిచాకు మద్దతుగా ప్రకాశ్ రాజ్

దక్షిణాది నటుడు ప్రకాశ్ రాజ్ సహా మరికొందరు రిచా చద్దాకు మద్దతుగా నిలిచారు. రిచాను విమర్శించిన అక్షయ్ కుమార్ లక్ష్యంగా ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.

‘‘మీ నుంచి ఇలాంటి స్పందన ఊహించలేదు. దేశానికి మీకంటే కూడా రిచా చద్దాయే ఎక్కువ అవసరం’’ అని అక్షయ్ కుమార్‌ను ఉద్దేశిస్తూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 11
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 11

దీనికంటే ముందు కూడా గల్వాన్ ట్వీట్‌ పట్ల రిచాకు ప్రకాశ్ రాజ్ అండగా నిలిచారు.

‘‘రిచా చద్దా మేం మీతోనే ఉన్నాం. మీ మాటల్లోని అర్థమేంటో మాకు తెలుసు’’ అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.

అసలు ఈ వివాదం ఎలా మొదలైంది?

నిజానికి భారత సైన్యం నార్తర్న్ కమాండ్‌కు చెందిన కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చేసిన ఒక ప్రకటనకు రిచా చద్దా స్పందన వివాదాస్పదం అయింది.

పీఓకేను తిరిగి హస్తగతం చేసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను పాటించడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఉపేంద్ర ద్వివేది అన్నారు.

ఈ ట్వీట్‌కు రిచా చద్దా స్పందిస్తూ ‘‘గల్వాన్ హాయ్ చెబుతుంది’’ అని ట్వీట్ చేశారు. రిచా ఈ ట్వీట్‌లో గల్వాన్ ఘర్షణల్లో భారత సైనికులు చనిపోవడాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించినట్లయింది.

‘పీఓకేలో చేసిన పనికి పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’ అని కొన్నిరోజుల క్రితమే భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)