Siachen-IndianArmy: హిమాలయాల్లో గల్లంతైన భారత సైనికుడి మృతదేహం 38 ఏళ్ల తర్వాత దొరికింది.

సియాచిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సియాచిన్

హిమాలయాల్లోని సియాచిన్‌లో 1984లో గల్లంతైన భారత జవాన్‌ చంద్రశేఖర్‌ హర్బోలా ఆచూకీని 38 సంవత్సరాల తరువాత గుర్తించినట్లు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌లో 1984లో చంద్రశేఖర్ సహా 20 మంది సైనికులు ఆపరేషన్ మేఘదూత్‌లో పాల్గొన్నారు.

భారత-పాకిస్తాన్ బోర్డర్‌లోని ఈ ప్రాంతంలో మే 29న ఏర్పడిన హిమపాతం (అవలాంచ్)లో భారత సైనికులు చిక్కుకున్నారు. వారిలో 15 మంది మృతదేహాలను వెలికితీశారు. అయిదుగురి ఆచూకీ తెలియలేదు. వారిలో చంద్రశేఖర్ ఒకరు.

అయితే, తాజాగా సియాచిన్‌లో పహారా కాస్తున్న సైనికులు ఒక పాత బంకర్‌లో చంద్రశేఖర్‌ మృతదేహాన్ని గుర్తించారు. మరొక మృతదేహం కూడా లభ్యమైంది కానీ, దాన్ని ఇంకా గుర్తించవలసి ఉందని పీటీఐ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఐడెంటిఫికేషన్ డిస్క్‌పై ఉన్న ఆర్మీ నెంబర్‌ ఆధారంగా ఆ మృతదేహం చంద్రశేఖర్‌దేనని తేల్చారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన చంద్రశేఖర్‌కు నార్తర్న్ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఇతర అధికారులు నివాళులు అర్పించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

చంద్రశేఖర్ మృతదేహం దొరకడంతో తమ వేదనకు ఒక ముగింపు వచ్చినట్టు భావిస్తున్నామని ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ జిల్లాలో నివసిస్తున్న హర్బోలా కుటుంబం తెలిపింది.

చంద్రశేఖర్ స్వగ్రామంలో పూర్తి సైనిక లాంఛనాలతో ఆయన మ‌ృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఇలా ఎన్నో సంవత్సరాల తరువాత సైనికుల మృతదేహాలు లభించడం ఇదే మొదటిసారి. 2014లో, 21 సంవత్సరాల క్రితం గల్లంతైన తుకారాం వి పాటిల్ మృతదేహాన్ని భారత ఆర్మీ యూనిట్ హిమనీనదాల్లో కనుగొంది.

సియాచిన్..భారత్, పాకిస్తాన్ మధ్య వివాదాస్పద ప్రాంతం. ఈ ప్రాంతాన్ని నిస్సైనికీకరణ చేయాలని చర్చలు జరిగినా, ఫలితం దక్కలేదు.

1984 ఏప్రిల్ లో ఇరు దేశాలు సియాచిన్‌లో తలపడ్డాయి. ఇప్పటికీ ఆ ప్రాంతంలో రెండు దేశాల సైనికులు పహారా కాస్తున్నారు.

2012లో సియాచిన్‌లో మంచు తుపాను కారణంగా కనీసం 129 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. ఈ ఘటన తరువాత, సియాచిన్‌లో సైన్యాన్ని తొలగించాలని ఇరుదేశాలకూ విజ్ఞప్తులు వచ్చాయి. కానీ, అది జరగలేదు.

2016లో హిమపాతంలో చిక్కుకుని కనీసం 10 మంది భారత సైనికులు మరణించారు. 2019లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)