‘నువ్వొక బాంబర్‌వి’ అంటూ ఆ యువకుడికి వచ్చిన మెసేజ్‌తో విమానం ఆరుగంటలు ఆగిపోయింది...

ఇండిగో విమానం

ఫొటో సోర్స్, Facebook/Indigo

ఒక అమ్మాయి... అబ్బాయి... మధ్యలో ఓ వాట్సాప్ మెసేజ్...

ఫలితంగా ఒక విమానం, అందులోని ప్రయాణికులు గంటల కొద్దీ ఎదురు చూడాల్సి వచ్చింది.

ది హిందూ, హిందుస్తాన్ టైమ్స్, పీటీఐ వంటి వార్తా సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం...

ఆదివారం ఒక అబ్బాయి, ఒక అమ్మాయి మంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు.

ఇద్దరిదీ ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజియాబాద్

మణిపాల్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న ఆ యువకుడు రెండు రోజుల కిందట యువతితో కలిసి మంగళూరుకు వచ్చారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఇద్దరు మంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు.

వాట్సాప్ చాట్

ఫొటో సోర్స్, Getty Images

యువకుడు ముంబయి వెళ్లే విమానం ఎక్కగా బెంగళూరు వెళ్లాల్సిన యువతి తన విమానం కోసం ఎయిర్‌పోర్టులో ఎదురు చూస్తున్నారు. ముంబయి విమానం ఎక్కిన ఆ యువకుడు, ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఉన్న ఆ యువతితో వాట్సాప్‌లో చాట్ చేస్తున్నారు.

'నువ్వొక బాంబర్...' అంటూ ఆమె మేసేజ్ చేశారు

యువకుడి వెనుక సీట్లో కూర్చొని ఉన్న ఓ మహిళ ఆ మెసేజ్‌ని చూశారు. దాని గురించి ఆమె ఆ యువకుడితో గొడవపడ్డారు. ఆ తరువాత విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు.

ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదును విమానాశ్రయంలోని సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్)కు అందించారు విమాన సిబ్బంది.

దాంతో మరి కొద్ది నిమిషాల్లో టేకాఫ్ కావాల్సిన విమానాన్ని ఆపి, పూర్తిగా తనిఖీ చేసింది సీఐఎస్‌ఎఫ్. దాంతో సుమారు 6 గంటలు ఆలస్యంగా విమానం బయలుదేరింది.

ఇండిగో ఎయిర్‌లైన్స్ మంగళూరు మేనేజర్ చేసిన ఫిర్యాదు ప్రకారం ఆ అమ్మాయి, అబ్బాయి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

వీడియో క్యాప్షన్, కళ్ళు ఎందుకు అదురుతాయి? కళ్ళు చెప్పే ఆరోగ్య రహస్యాలివే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)