ట్రంప్, పుతిన్‌ ఫోన్ కాల్‌తో యుక్రెయిన్ యుద్ధం ఆగుతుందా?

రష్యా, యుక్రెయిన్

ఫొటో సోర్స్, EPA/Russian presidential office

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ యుద్ధంపై అమెరికాతో చర్చలకు సుముఖంగా ఉన్న పుతిన్
    • రచయిత, స్టీవ్ రోజన్‌బర్గ్
    • హోదా, రష్యా ఎడిటర్

యుక్రెయిన్ యుద్ధం ఒక్క ఫోన్‌కాల్‌తో ముగియదు.

చర్చలు ఇప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. యుద్ధం కచ్చితంగా ఎప్పుడు ఎలా ముగుస్తుందనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.

రష్యా అధ్యక్షుడు పుతిన్.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్ సంభాషణ తరువాత కొంతమేర దౌత్యపరమైన విజయం సాధించారు.

మూడేళ్ల కిందట ఆయన ఇలాంటి పరిస్థితుల్లో లేరు. రాజకీయంగా అందరికీ దూరమయ్యారు.

యుక్రెయిన్‌‌ను పూర్తిస్థాయిలో ఆక్రమించుకోవాలన్న పుతిన్ నిర్ణయం ఆయన్ను ఏకాకిగా మార్చింది.

యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ భారీ మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

అంతర్జాతీయంగా రష్యాపై అనేక ఆంక్షలు విధించారు. తర్వాతి సంవత్సరం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్‌పై అరెస్టు వారెంట్ జారీ చేసింది.

పుతిన్‌పై అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ''హంతక నియంత, దుండగుడు'' అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధాన్ని రష్యా ప్రారంభించిన తర్వాత పుతిన్, బైడన్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణలూ జరగలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటో)

2025లో..

అమెరికా అధ్యక్షుడు మారడంతో ఆ దేశ వైఖరిలో మార్పు వచ్చింది. భాషలో మార్పు తెచ్చింది.. అసలు రష్యా విషయంలో అమెరికా విధానం పూర్తిగా మారిపోయింది.

యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నానని ట్రంప్ చెప్పారు.

ట్రంప్ రష్యాలో.. పుతిన్ అమెరికాలో పర్యటించే అవకాశం ఉందన్న ఆశాభావం వ్యక్తంచేశారు.

ట్రంప్‌ను రష్యాకు ఆహ్వానించారు పుతిన్.

ఈ పర్యటన జరిగితే అమెరికా-రష్యా సంబంధాల్లో భారీ మార్పు వస్తుంది. అమెరికా అధ్యక్షుడు ఒకరు రష్యాలో పర్యటించక దశాబ్ద కాలం దాటిపోయింది.

రష్యా యుక్రెయిన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మూడేళ్లుగా సాగుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధం

రష్యా అల్టిమేమ్...?

చాలా రకాలుగా పుతిన్ ఇప్పటికే తాను కోరుకున్నది పొందారు. కీవ్, యూరప్ నేతలతో కాకుండా యుక్రెయిన్‌పై అమెరికాతో నేరుగా చర్చలు జరిపే అవకాశం లభించింది. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో తాను అగ్రభాగాన ఉండే అవకాశం కల్పించింది.

అయితే రాజీపడడానికి పుతిన్ ఎంత మేర సిద్ధంగా ఉన్నారనేదానిపై స్పష్టత లేదు.

చర్చలకు మాస్కో ఎప్పుడూ సిద్ధంగా ఉందని రష్యా అధికారులు చెబుతుంటారు. కానీ ఎప్పుడూ పుతిన్ శాంతి ప్రతిపాదన 2024 జూన్ గురించి మాట్లాడుతుంటారు. అది అల్టిమేటమ్ కన్నా ఎక్కువ అన్నట్టు భావిస్తుంటారు.

ఈ ప్రణాళిక ప్రకారం తాను స్వాధీనం చేసుకున్న ప్రాంతాలన్నింటినీ రష్యా తన నియంత్రణలోనే ఉంచుకుంటుంది. దీంతో పాటు ఇప్పుడు యుక్రెయిన్ నియంత్రణలో ఉన్న కొంత భూమి కూడా కావాలంటోంది.

దీంతోపాటు యుక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోకూడదు. రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలి.

'రష్యా చర్చలకు సిద్ధంగా ఉంది. కానీ షరతులు వర్తిస్తాయి'' అని ఈ వారం ప్రారంభంలో రష్యా న్యూస్‌పేపర్ ఒకటి తెలిపింది.

‘దౌత్యపరమైన భాష పక్కనపెడితే, దాన్ని కచ్చితంగా అల్టిమేటమ్ అనే అంటారు’ అని ఆ పత్రిక పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి).