2023 DW: భూమి వైపు దూసుకొస్తున్న గ్రహ శకలం.. 2046 'వాలెంటైన్స్ డే నాడు భూమిని తాకవచ్చు'

గ్రహ శకలం - ఆస్టెరాయిడ్

ఫొటో సోర్స్, NASA

    • రచయిత, బ్రాండన్ డ్రెనాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఓ కొత్త గ్రహ శకలం (ఆస్టరాయిడ్) భూమి వైపు దూసుకొస్తోందని నాసా తెలిపింది.

ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ సైజులో ఉన్న ఈ గ్రహ శకలం 2046 వాలెంటైన్స్ డే నాడు భూమిని తాకవచ్చని అంచనా వేసింది.

అయితే, భూమిపై దీని ప్రభావం అంతగా ఉండబోదని నాసా మంగళవారం ట్వీట్ చేసింది.

ఈ గ్రహశకలం భూమికి సుమారు 18 లక్షల కిమీ చేరువగా రావచ్చని నాసా చెబుతోంది.

పరిశోధకులు మరింత డాటా సేకరిస్తున్నారు. కొత్త సమాచారం తెలుస్తున్న కొద్దీ అంచనాలు మారవచ్చు.

ఈ గ్రహ శకలాన్ని 2023 DWగా పిలుస్తున్నారు. ఇది భూమిని ఢీకొనే అవకాశం 560 లో 1 గా ఉందని నాసా తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

నాసా రిస్క్ లిస్ట్‌లో ఉన్న ఏకైక స్పేస్ రాక్ ఇది. టొరినో ఇంపాక్ట్ హజార్డ్ స్కేల్‌పై 1వ స్థానంలో ఉంది.

ఈ స్కేలుపై 0 నుంచి 10 వరకు అంకెలు ఉంటాయి. స్పేస్ రాక్ భూమిని తాకే అవకాశాలకు ఈ స్కేలు కొలప్రమాణం.

స్కేలుపై 0 వస్తే, భూమికి ఏ ముప్పూ లేదని అర్థం.

స్కేలుపై 1 వస్తే భూమిని ఢీకొట్టే అవకాశాలు చాలా తక్కువ. కంగారుపడాల్సి న అవసరం లేదని నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (జేపీఎల్) తెలిపింది.

"ఈ గ్రహ శకలం గురించి ఆందోళన అవసరం లేదు" అని జేపీఎల్ నావిగేషన్ ఇంజినీర్ డేవిడ్ ఫర్నోచియా సీఎన్ఎన్‌తో చెప్పారు.

2023 డీడబ్ల్యూ భూమిని తాకినా పెద్దగా ప్రమాదం ఉండదని చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, సూర్యుడు నవ్వుతున్నట్టుగా ఎలా, ఎందుకు కనిపించాడు?

సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం ఆకాశం నుంచి దూసూకొచ్చిన గ్రహ శకలం భూమిని తాకినపుడు డైనోసార్లు అంతమైపోయాయి. ఆ ఆస్టెరాయిడ్ భూమికి 12 కిమీ దగ్గరకు వచ్చినప్పుడు 2023 డీడబ్ల్యూ కన్నా చాలా పెద్దగా ఉందని సైంటిఫిక్ అమెరికన్ తెలిపింది.

అయితే, 2023 డీడబ్ల్యూ భూమిపై ఏదైనా ప్రధాన నగరాన్ని లేదా జనాభా ఎక్కువ గల ప్రాంతాన్ని తాకితే ప్రమాదం సంభవించవచ్చు.

2023 డీడబ్ల్యూలో సగం కన్నా తక్కువ పరిమాణంలో ఉన్న ఒక ఉల్కాపాతం 10 సంవత్సరాల క్రితం రష్యాలోని చెల్యాబిన్స్క్‌ ప్రాంతాన్ని వేగంగా తాకింది.

దీని ప్రభావం 200 చదరపు మైళ్ల దూరం వరకు విస్తరించింది. అక్కడున్న ఇళ్ల కిటీకీలన్నీ పగిలిపోయాయి. సుమారు 1,500 మంది గాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, బ్లాక్ హోల్ నుంచి వచ్చే శబ్దం ఎలా ఉందో విన్నారా?

అయితే, 2023 డీడబ్ల్యూ ఆస్టెరాయిడ్ భూమిని తాకకుండా పక్క నుంచి వెళ్లిపోవచ్చని చెబుతున్నారు.

కాగా, ఎప్పుడైనా ఏదైనా గ్రహ శకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని ఊహిస్తున్న సైంటిస్టులు, దాన్ని ఎదుర్కొనేందుకు చాలా కాలం నుంచి సన్నాహాలు చేస్తున్నారు.

గత అక్టోబర్‌లో నాసా చేపట్టిన డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) ప్రయోగం విజయవంతమైందని ఆ సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా ఒక స్పేస్‌క్రాఫ్ట్‌ను గాల్లోకి పంపి, భూమి వైపు వస్తున్న ఓ చిన్న ఆస్టెరాయిడ్ మార్గాన్ని తప్పించారు.

"ఇలాంటిది జరుగుతుందని ఊహించే మేం ఆ ప్రయోగం చేశాం. అది గొప్ప విజయం సాధించింది" అని ఫర్నోచియా చెప్పారు.

ఇవి కూడా చదవండి: