బడ్జెట్ 2023: నిర్మల సీతారామన్ పద్దులో 10 ముఖ్యాంశాలు ఇవే...

కేంద్ర బడ్జెట్

ఫొటో సోర్స్, ANI

భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 కేంద్ర బడ్జెట్‌ను బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

ఆమె బడ్జెట్ ప్రసంగం ఒక గంట 27 నిమిషాల పాటు సాగింది.

నిర్మల సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం ప్రారంభిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో వెళ్తోందని అన్నారు.

కోవిడ్ సమయంలో ఒక్కరు కూడా ఆకలితో పడుకోరాదనే లక్ష్యంతో 80 కోట్ల మందికి కేంద్రం ఉచితంగా ఆహార ధాన్యాలు ఇచ్చిందని, ఇలా 28 నెలల పాటు ఇచ్చిందని నిర్మల చెప్పారు.

ప్రపంచమంతా సవాళ్లు ఎదుర్కొంటున్న ఈ సమయంలో జీ20 సమావేశాలకు అధ్యక్షత వహించడమనేది ప్రపంచ ఆర్థిక క్రమంలో భారత్ మరింత బలపడేందుకు దోహదపడుతుందని ఆమె అన్నారు.

ఇవీ ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

1. అమృతకాలంలో తొలి బడ్జెట్

ఇది అమృతకాలంలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ అంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సప్త రుషుల తరహాలో ఏడు అంశాలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు.

భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచం ప్రకాశవంతమైన తారగా గుర్తించిందని.. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నింటి కంటే ఎక్కువగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి రేటును అంచనా వేస్తున్నామని ఆమె చెప్పారు.

సప్తర్షుల్లా ఏడు ప్రాధాన్యాంశాలు ఉన్నాయన్నారు.

1) సమీకృత అభివృద్ధి

2) అట్టడుగు వరకూ చేరుకోవడం

3) మౌలిక వసతులు, పెట్టుబడులు

4) సామర్థ్యాలను ఆవిష్కరించడం

5) గ్రీన్ గ్రోత్

6) యువశక్తి

7) ఆర్థిక రంగం

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

2. కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలు

దేశంలో 2014 నుంచి ఏర్పాటైన 157 మెడికల్ కళాశాలలకు అనుబంధంగా కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలను ప్రారంభిస్తామని ప్రకటించారు.

ఐసీఎంఆర్ ప్రయోగ శాలల విస్తృతిని పెంచడంతో పాటు ఫార్మా రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని అన్నారు.

అధ్యాపకుల శిక్షణకు డిజిటల్ విద్యావిధానం, జాతీయ లైబ్రరీ తీసుకొస్తామని తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

3. వ్యవసాయ వృద్ధి నిధి, విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ ప్యాకేజీ

ఇక, వ్యవసాయ రంగంలో స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు.

గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఔత్సాహిక యువత వ్యవసాయ స్టార్టప్‌లు ఏర్పాటుచేస్తే సహకరించేందుకు వ్యవసాయ వృద్ధి నిధి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేలా కొత్త ఆలోచనలో ముందుకొచ్చే యువ పారిశ్రామికవేత్తలకు సహకారం అందుతుందని చెప్పారు.

ప్రకృతి వ్యవసాయం చేసేందుకు వీలుగా కోటిమంది రైతులకు సాయం.

అధిక విలువైన ఉద్యాన పంటల కోసం రూ. 2,200 కోట్లతో ఆత్మనిర్బర్ క్లీన్ ప్లాంట్ ప్రొగ్రామ్‌కు రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు.

రూ. 2,516 కోట్లతో 63,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కంప్యూటరీకరణ చేపట్టనున్నట్లు చెప్పారు.

పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ ప్యాకేజ్‌లో భాగంగా సంప్రదాయ చేతివృత్తులవారు తమ ఉత్పత్తుల నాణ్యత పెంచుకునేలా, ఉత్పత్తి పెంచేలా సహకరిస్తామన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

4. చిరుధాన్యాల హబ్‌గా భారత్

శ్రీ అన్న’(చిరుధాన్యాలు) ఉత్పత్తిలో భారత్ ప్రథమ స్థానంలో, ఎగుమతిలో ద్వితీయ స్థానంలో ఉందని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.

‘శ్రీ అన్న’ గ్లోబల్ హబ్‌గా భారత్‌ను నిలిపేందుకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పన, అందరికీ అందించేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్’ పనిచేస్తుందని, కేంద్రం నుంచి ఈ సంస్థకు సహకారం అందుతుందని ఆమె వెల్లడించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 5

5. రైల్వేల అభివృద్ధికి రూ. 2.4 లక్షల కోట్లు

రైల్వేల అభివృద్ధికి బడ్జెట్‌లో రూ. 2.4 లక్షల కోట్లు కేటాయించారు.

కొత్త లైన్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. మౌలిక వసతుల అభివృద్ధికి 33 శాతం అధికంగా నిధులు కేటాయిస్తున్నామన్నారు.

రాష్ట్రాలలో ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు 50 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు, హెలిప్యాడ్స్, వాటర్ ఏరో డ్రోన్స్ అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.

ముఖ్యమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ. 75 వేల కోట్లు కేటాయించారు. రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం కోసం రూ. 13.7 లక్షల కోట్లు కేటాయించారు.

కాలుష్య కారక వాహనాల తొలగింపులో భాగంగా వాహన తుక్కు విధానాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 6

సభలో నవ్వులు...

ఈ ప్రకటన సందర్భంగా ఒక సరదా ఘటన చోటు చేసుకుంది.

తుక్కు విధానం గురించి ప్రకటిస్తూ ‘‘పొల్యూటెడ్ వెహికల్’’ అనబోయి నిర్మలా సీతారామన్ ‘‘పొలిటికల్ వెహికల్’’ అని పలకడంతో అందరూ ఒక్కసారిగా నవ్వారు.

తర్వాత నిర్మలా సీతారామన్ సైతం నవ్వుతూ తప్పును సవరించుకొని ప్రసంగాన్ని కొనసాగించారు.

నిర్మలా సీతారామన్

6. ప్రయోగ శాలలో వజ్రాల తయారీకి ప్రత్యేక నిధులు

జాతీయ సహకార డేటా బేస్‌కు రూ. 2,516 కోట్లు, ఫిన్‌టెక్ సర్వీసుల కోసం డిజిలాకర్ కేవైసీ మరింత సరళీకరణ, ప్రయోగశాలల్లో వజ్రాల తయారీకి ఐఐటీకీ ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు.

ఈ-కోర్టుల ఏర్పాటుకు రూ. 7 వేల కోట్లు, పట్టణ మౌలిక వసతుల కల్పనకు రూ. 10 వేల కోట్లు కేటాయించారు.

పర్యటక రంగ అభివృద్ధి కోసం దేశంలోని 50 ప్రాంతాలను ఎంపిక చేసి అభివృద్ధి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు.

నేషనల్ హైడ్రోజన్ మిషన్ కోసం ఈ బడ్జెట్‌లో రూ. 19,700 కోట్లు కేటాయించారు. 2030 నాటికి 5 లక్షల టన్నుల హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

బీబీసీ

7. గృహ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

పీఎం ఆవాస్ యోజన పథకానికి ఈసారి బడ్జెట్‌లో నిధులు పెంచింది.

గత బడ్జెట్‌లో పీఎం ఆవాస్ యోజనకు 48 వేల కోట్ల రూపాయలు ఉండగా, ఈ ఏడాది ఆ మొత్తాన్ని 79 వేల కోట్లకు పెంచినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

వడ్డీ రేట్లు పెరిగిన ఈ సమయంలో గృహ కొనుగోలు దారులకు ఇది ఊరట కల్పించే విషయం.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 7

8. జీడీపీలో 5.9 శాతం ద్రవ్యలోటు

సవరించిన అంచనాల ప్రకారం 2023-24లో ద్రవ్యలోటు జీడీపీలో 5.9 శాతమని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు.

2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలో 4.5 శాతానికి తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 8

9. మహిళలు 7.5 శాతం వడ్డీతో ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం

ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మహిళల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.

మహిళల కోసం ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్’ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. రెండేళ్ల కాళానికి ఈ పథకం అందుబాటులో ఉంటుందని, ఈ పథకంలో ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఇస్తారని వెల్లడించారు.

ఇందులో గరిష్ఠంగా రూ. 2 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. అలాగే సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో భాగంగా డిపాజిట్ పరిమితిని రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు పెంచుతున్నట్లు చెప్పారు.

నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, PIB

10. కొత్త ఆదాయ పన్ను విధానం ఎంచుకున్నవారికి రూ. 7 లక్షల వరకు రిబేట్

కొత్త ఆదాయ పన్ను విధానం ఎంచుకున్నవారికి రూ. 7 లక్షల వరకు రిబేట్ కల్పిస్తున్నట్లు నిర్మల సీతాారామన్ ప్రకటించారు.

ఈ పరిమితి ఇంతకుముందు రూ. 5 లక్షలుగా ఉండేది.

వ్యక్తిగత ఆదాయపన్ను కొత్త ట్యాక్స్ శ్లాబ్‌లు

  • 0 నుంచి రూ. 3 లక్షల వరకు – పన్ను లేదు
  • రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు – 5 శాతం పన్ను
  • రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు – 10 శాతం పన్ను
  • రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు – 15 శాతం పన్ను
  • రూ. 12 లక్షలు నుంచి రూ. 15 లక్షలు – 20 శాతం పన్ను
  • రూ. 15 లక్షలు దాటితే – 30 శాతం పన్ను
పోస్ట్‌ X స్కిప్ చేయండి, 9
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 9

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)