జమ్ముకశ్మీర్‌లో యాత్రికుల బస్సుపై తీవ్రవాదుల దాడి, 10 మంది మృతి

జమ్ము కశ్మీర్

ఫొటో సోర్స్, ANI

జమ్మూకశ్మీర్‌లోని రియాసిలో యాత్రికుల బస్సుపై తీవ్రవాదులు దాడి చేశారు. తీవ్రవాదుల కాల్పుల కారణంగా బస్సు లోయలో పడిపోవడంతో 10 మంది యాత్రికులు మృతి చనిపోయారని, 33 మంది గాయపడ్డారని పోలీసులు చెప్పారు.

యాత్రికులతో వెళ్తున్న బస్సుపై తీవ్రవాదులు మెరుపుదాడి చేశారని రియాసీ ఎస్పీ మోహిత శర్మ తెలిపారు.

"ప్రాథమిక సమాచారం ప్రకారం, తీవ్రవాదులు మెరుపుదాడి చేశారు. శివఖోరి నుంచి కాట్రా వైపు వెళ్తున్న బస్సుపై కాల్పులు జరిపారు. దాంతో, డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయారు. బస్సు లోయలో పడిపోయింది. ఇప్పటివరకు 10 మంది మరణించారు. 33 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు పూర్తయ్యాయి" అని మోహిత శర్మ చెప్పారు.

బస్సులో ప్రయాణిస్తున్న యాత్రికులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు అని ప్రాథమికంగా తెలిసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

తీవ్రవాద దాడిని ఖండించిన మల్లిఖార్జున్ ఖర్గే

జమ్మూకశ్మీర్‌లో జరిగిన తీవ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఘర్గే అన్నారు.

‘‘దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రివర్గం ప్రమాణస్వీకారం జరుగుతున్న వేళ, పలు దేశాల అధినేతలు ఇక్కడ ఉన్న సమయంలో, జమ్మూకశ్మీర్‌లో యాత్రికుల బస్సుపై తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 10 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధితులకు అధికారులు తక్షణమే సాయం చేయాలి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పలుచోట్ల దాడులు జరిగాయి. శాంతిని నెలకొల్పామని మోదీ ప్రభుత్వం చెప్పిందంతా బూటకం. తీవ్రవాదానికి వ్యతిరేకంగా దేశం నిలబడుతుంది’’ అని ‘ఎక్స్‌’లో ఖర్గే పోస్ట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

జమ్మూకశ్మీర్‌లో యాత్రికుల బస్సుపై తీవ్రవాదులు జరిపిన దాడి చాలా బాధాకరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.

జమ్మూకశ్మీర్‌లో ఆందోళనకరంగా ఉన్న భద్రతా లోపాలను ఈ ఘటన తెలియజేస్తోందని ఆయన అన్నారు.

‘‘మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. తీవ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకతాటిపై నిలబడుతుంది’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)