నేపాల్ భూకంపంలో 150 దాటిన మృతుల సంఖ్య

ఫొటో సోర్స్, RSS
నేపాల్ పశ్చిమ ప్రాంతంలో శుక్రవారం రాత్రి 6.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన ఘటనతో మృతుల సంఖ్య 150కు పెరిగింది. 140 మందికి పైగా గాయపడినట్లు నేపాల్ అధికారులు ఈ విషయం తెలిపారు.
కర్నాలీ రాష్ట్రంలోని జాజర్‌కోట్, రుకుమ్ వెస్ట్ జిల్లాల్లో భూకంపం ప్రభావం అత్యధికంగా ఉందని నేపాల్ పోలీసు ప్రతినిధి కుబర్ కదాయత్ బీబీసీతో చెప్పారు. ఇక్కడ చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి.
శుక్రవారం రాత్రి 11:47 గంటలప్పుడు ఈ భూకంపం సంభవించిందని, భూకంప కేంద్రం జాజర్‌కోట్‌లో ఉందని నేషనల్ సెస్మలాజికల్ సెంటర్ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
నేపాల్‌లో భూకంపం వల్ల సంభవించిన నష్టంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు.
నేపాల్ ప్రజలకు భారత్ సాయం అందించడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు.


ఫొటో సోర్స్, Getty Images
శనివారం ఉదయం వరకున్న సమాచారం ప్రకారం- జాజర్‌కోట్ జిల్లాలో 95 మంది చనిపోయారని నేపాల్ సైన్యం ప్రతినిధి భండారీ చెప్పారు.
రుకుమ్ వెస్ట్ జిల్లాలో 38 మంది మరణించినట్లు ప్రజలు సమాచారం ఇచ్చారని జిల్లా ఎస్‌పీ నామ్‌రాజ్ భట్టారీ తెలిపారు.
నాల్గడ్ మున్సిపాలిటీలో చనిపోయినవారిలో డిప్యూటీ మేయర్ సరితా సింగ్ కూడా ఉన్నట్లు ఆ మున్సిపాలిటీ చైర్మన్ బద్రీ పంత్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భూపంక కేంద్రం జుమ్లాకు దక్షిణాన 42 కిలోమీటర్ల దూరంలో ఉందని, భూకంప తీవ్రత 5.6 అని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(యూఎస్‌జీఎస్) తెలిపింది.
నేపాల్లో 2015 నాటి భూకంపం తర్వాత ఇదే తీవ్రమైన భూకంపం.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలోప్రకంపనలు
భూకంపంతో నేపాల్‌లోని చాలా ప్రాంతాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.
నేపాల్ పోలీసు అధికారులు, నేపాల్ సైన్యం, సాయుధ పోలీసులు సహాయ చర్యలు చేపడుతున్నారు.
నేపాల్‌లోని వివిధ ప్రాంతాలతోపాటు దిల్లీ, భారత్‌లోని మరికొన్ని చోట్ల ప్రకంపనలు వచ్చాయి.


ఫొటో సోర్స్, BISHNU KHADKA

ఫొటో సోర్స్, BISHNU KHADKA
ఇవి కూడా చదవండి:
- బిగ్‌బాస్ విన్నర్, యూట్యూబర్ ఎల్వీష్ యాదవ్... రేవ్ పార్టీలకు పాము విషాన్ని సప్లయ్ చేశారా?
- మొహమ్మద్ షమీ: మా బౌలింగ్ తుపానుకు కారణమదే
- అఫ్గానిస్తాన్: అంతర్యుద్ధం, పేదరికంతో అల్లాడుతున్న తాలిబాన్ల పాలనలో క్రికెట్ ఎలా వికసించింది?
- చిత్తూరు: భార్యతో ఉన్నప్పుడు పురుషుడు.. బాయ్‌ఫ్రెండ్‌ను కలిస్తే మహిళ
- ఐఫోన్ హ్యాకింగ్ ఆరోపణలు: యాపిల్ వివరణపై కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














