నీరజ్ చోప్రా: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయుడు

నీరజ్ చోప్రా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా.. ఇక ఇప్పుడు జావెలిన్ త్రో ప్రపంచ ఛాంపియన్

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2023లో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు.

బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్ 2023లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు.

దీంతో ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు.

పురుషుల జావెలిన్ త్రోలో 88.17 మీటర్ల త్రో వేసిన నీరజ్ చోప్రా మునపటి ఏడాది రజత పతకాన్ని, ఈ ఏడాది స్వర్ణ పతకంతో అప్‌గ్రేడ్ చేశాడు.

ఈ ఛాంపియన్‌షిప్స్‌లో రెండో ప్రయత్నంలో నీరజ్ చోప్రా 88.17 మీటర్ల త్రో వేశాడు.

టోక్యో ఒలింపిక్ గేమ్స్‌లో కూడా నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని గెలచుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

‘ఇక 90 మీటర్లు అందుకోవడమే మిగిలింది’

“అందరూ ఈ మెడల్ ఒక్కటే మిగిలింది అనేవాళ్లు. అది కూడా ఈరోజు పూర్తి చేశా. ఇక 90 మీటర్లు అందుకోవడమే మిగిలింది. పర్వాలేదు. ఈరోజు పూర్తవుతుందనే అనుకున్నా. కానీ గోల్డ్ మెడల్ కూడా చాలా ముఖ్యమే. ఇప్పుడు ఇది మన దగ్గరకు వచ్చింది. ఇంకా చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి. ఇంకా చాలా టైమ్ ఉంది. ఇంకా కష్టపడతా...” అని స్వర్ణ పతకం గెలుచుకున్న తర్వాత నీరజ్ చోప్రా అన్నాడు.

నీరజ్ చోప్రా

ఫొటో సోర్స్, Getty images

ఫొటో క్యాప్షన్, ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ 2023లో స్వర్ణం గెలుచుకున్న నీరజ్ చోప్రా

నీరజ్ చోప్రాకు అభినందనలు వెల్లువ

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్ మెన్స్ జావెలిన్‌ త్రోలో బంగార పతకం సాధించిన నీరజ్ చోప్రాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

నీరజ్ చోప్రా మరోసారి మనల్ని గర్వపడేలా చేశారని భారతీయ ఆర్మీ ట్వీట్ చేసింది.

బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2023‌లో పురుషుల జావెలిన్ త్రోలో బంగారం పతకం సాధించిన్నందుకు సుబేదార్ నీరజ్ చోప్రాకు అభినందనలని తెలిపింది.

కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా నీరజ్ చోప్రాను అభినందించారు.

ఈ ఛాంపియన్‌షిప్స్‌లో నీరజ్ చోప్రా తర్వాత రెండో స్థానంలో పాకిస్తాన్ అర్షద్ నదీమ్ నిలిచారు. ఆయన రజత పతకాన్ని గెలుచుకున్నాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

గత ఏడాది రజత పతకాన్ని గెలుచుకున్న తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో నీరజ్ చోప్రా సాధించిన రెండో పతకం ఇది.

ఆ ఏడాది నీరజ్ గెలుచుకున్న రజత పతకంతో 19 ఏళ్ల తరువాత మళ్లీ భారతీయుడికి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పతకం లభించినట్లు అయింది. ఈ ఏడాది ఏకంగా స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు నీరజ్ చోప్రా.

అంతకుముందు, 2003లో మహిళల లాంగ్ జంప్‌లో అంజు బాబీ జార్జ్ కాంస్య పతకాన్ని సాధించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

నీరజ్ చోప్రా

ఫొటో సోర్స్, GETTY IMAGES

పతకాల వేటలో నీరజ్ చోప్రా

భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా 2021 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న సంగతి తెలిసిందే.

2022లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో కూడా చోప్రా రజతం గెలుచుకున్నాడు.

ఈ ఏడాది ఏకంగా స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు.

ఇలా వరుసగా అంతర్జాతీయ పతకాల పరంపర కొనసాగిస్తున్నాడు నీరజ్ చోప్రా.

ప్రతి గెలుపుతో, చోప్రా ఎంతో ఉన్నతంగా మారుతున్నాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తాను సాధించిన దానితోనే సంతృప్తి పడకుండా, మరో గేమ్‌లో మరింత మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఒలింపిక్ గేమ్స్ తర్వాత తన ఆటను మరింత మెరుగుపర్చుకున్నాడు. తన కెరీర్‌లో పది సార్లు 88 మీటర్ల దూరాన్ని అతను క్రాస్ చేశాడు. నీరజ్ చోప్రా బెస్ట్ ప్రదర్శనగా 89.94 మీటర్లు నిలిచింది. ఇప్పటి వరకు నీరజ్ చోప్రా 90 మీటర్లను క్రాస్ చేయలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)