పాకిస్తాన్: 'అమ్మాయిలు సైకిల్ తొక్కడం ‘అశ్లీలం’, మత సంప్రదాయాలకు విరుద్ధం, ఇస్లాం ప్రమాదంలో పడుతోంది'

ఫొటో సోర్స్, @SKHANATHLETE
- రచయిత, ఒమర్ సలిమీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాకిస్తాన్‌లో ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని లిండీ కోటల్ జిల్లాలో బాలికల కోసం మొదటిసారి సైకిల్ క్యాంపు నిర్వహించారు. దీనిపై దుమారం చెలరేగింది. లిండీ కోటల్ ఒకప్పుడు గిరిజన జిల్లాగా ఉండేది.
ఈ క్యాంపులో పదిహేను మంది బాలికలు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. అయితే, ఇది స్థానిక గిరిజన సంప్రదాయాలకు వ్యతిరేకమని చెబుతూ పలువురు విమర్శించారు.
శుక్రవారం పాకిస్తాన్ సైక్లిస్ట్ సమర్ ఖాన్, సామాజిక కార్యకర్త జెమీమా అఫ్రిది కలిసి అమెరికన్ సంస్థ గ్లోబల్ స్పోర్ట్స్ మెంటరింగ్ సహాయంతో లిండీ కోటల్‌లో బాలికల కోసం సైకిలింగ్ శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో పదిహేను మంది బాలికలు పాల్గొన్నారు.
బాలికల కుటుంబాల నుంచి అనుమతి తీసుకున్నామని, కొంతమంది తల్లిదండ్రులు కూడా శిబిరానికి హాజరయ్యారని నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
చాలా మంది అమ్మాయిలు హిజాబ్‌లు ధరించి, స్థానిక దుస్తులను ధరించి సైకిల్ తొక్కారని, కొంతమందికి మాత్రం ఈ క్యాంప్ 'సిగ్గుమాలిన పని'గా తోచిందని సమర్ ఖాన్ సోషల్ మీడియాలో రాశారు.
"అత్యాచారం, హత్య, యాసిడ్ దాడి, న్యాయం జరగకపోవడంపై నిరసనలు ఎందుకు రావు? మనల్ని నాశనం చేయడానికి ఏ అంతర్జాతీయ ఎజెండా అవసరం లేదు. మన అజ్ఞానమే చాలు" అని సమర్ ఖాన్ అన్నారు.

ఫొటో సోర్స్, @SKHANATHLETE
సైకిల్ క్యాంప్‌పై నిరసనలు
ఈ సైకిల్ క్యాంప్‌పై ఆదివారం జమాత్-ఎ-ఇస్లామీ లిండీ కోటల్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఇందులో చాలామంది పాల్గొన్నారు.
"అశ్లీలత, నగ్నత్వం నిషేధం", "మాకు నీరు, విద్యుత్ ఇవ్వండి, సైకిళ్లు కాదు" అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని ఆందోళనకారులు నిరసనలు తెలిపారు.
ఈ సైకిల్ క్యాంపు ఇస్లాం సంప్రదాయాలకు విరుద్ధమని నిరసనలో పాల్గొన్న కార్యకర్తలు, స్థానిక నాయకులు అన్నారు.
మహిళా సైకిల్ క్యాంపు సాకుతో ఆ ప్రాంతంలో సిగ్గుమాలినతనాన్ని ప్రచారం చేస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు.
అశ్లీలతను నిలువరించడానికి, ఇమ్రాన్ అఫ్రిదీ విడుదల కోసం ఈ నిరసన ప్రదర్శన నిర్వహించినట్లు లిండీ కోటల్‌లోని జమాత్-ఎ-ఇస్లామీ నాయకుడు మురాద్ హుస్సేన్ సోషల్ మీడియాలో తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
'కరాచీలో అమ్మాయిలకు మద్దతు ప్రచారం, లిండీ కోటల్‌లో సైకిల్ తొక్కడంపై నిరసనలు '
మరికొందరు అమ్మాయిలు సైకిల్ తొక్కడాన్ని సమర్థించారు. జమాత్-ఎ-ఇస్లామీని తీవ్రంగా విమర్శించారు.
జమాత్-ఎ-ఇస్లామీ కార్యకర్తలు లిండీ కోటల్‌లో ఒకలాగ, కరాచీలో ఒకలాగ ప్రవర్తిస్తున్నారని ఇమ్రాన్ అనే యూజర్ ట్విట్టర్‌లో రాశారు.
"కరాచీలో మేయర్ పదవికి మహిళ ఉండాలని, మహిళా సాధికారత తమ లక్ష్యమని జమాత్-ఎ-ఇస్లామీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. కానీ, లిండి కోటల్‌లో అమ్మాయిలు సైకిల్ తొక్కడాన్ని సహించలేకపోతున్నారు" అని ఇమ్రాన్ అన్నారు.
"10-15 మంది అమ్మాయిలు లిండీ కోటల్‌లో చిన్న సైకిల్ రైడ్ చేశారు. దానికే జమాత్-ఎ-ఇస్లామీ నిరసనలు తెలిపింది. దురుసుగా ప్రవర్తించింది. వీరి చేష్టల వల్ల నిజంగానే ఇస్లాం ప్రమాదంలో పడింది" అని మరో యూజర్ ఫాతిమా అన్నారు.

ఫొటో సోర్స్, @SKHANATHLETE
జమాత్-ఎ-ఇస్లామీ నిరసనలను వ్యతిరేకిస్తూ పలువురు మహిళలు సోషల్ మీడియాలో గొంతు విప్పారు.
"అమ్మాయిలు సైకిల్ తొక్కడాన్ని గిరిజన ప్రజలు లేదా తీవ్రవాదులు వ్యతిరేకించలేదు కానీ, జమాత్-ఎ-ఇస్లామీ వ్యతిరేకించింది. జమాత్-ఎ-ఇస్లామీ అరాచకాలను లేదా తీవ్రవాదాన్ని వ్యతిరేకించడం ఎన్నడూ చూడలేదు. నిర్వాహకులు కూడా బాలికలకు భద్రత కల్పించాలి" అని జర్నలిస్ట్ మరియన్ బాబర్ ట్వీట్ చేశారు.
"మహిళలు బహిరంగ ప్రదేశాలను వినియోగించుకుంటే తప్పేమిటో జమాత్-ఎ-ఇస్లామీ చెప్పాలి. దేశంలో ప్రతిరోజూ మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటిపై మీరు నిరసన తెలుపడంలేదు ఎందుకు? మహిళలు సమాజంలో తమ స్థానాన్ని పొందడానికి ప్రయత్నించినప్పుడే మీకు అశ్లీలత కనిపిస్తుందా?" అంటూ సామాజిక కార్యకర్త నిఘత్ దాద్ ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"రోడ్డు మీద అమ్మాయిలు సైకిల్ తొక్కడం మీకు అశ్లీలంగా కనిపించిందంటే, సమస్య మీలో ఉన్నట్టు" అని జవేరియా వసీం అనే యూజర్ రాశారు.
కొన్ని రాజకీయ వర్గాలు కూడా అమ్మాయిల సైకిల్ ర్యాలీని సమర్థించాయి.
జాతీయ అసెంబ్లీ మాజీ సభ్యుడు బుష్రా గోహర్ మాట్లాడుతూ, పష్తూన్ మహిళలు వెనక్కి ఉండిపోరని, ముందుకు వెళతారని అన్నారు.
శిబిరంలో పాల్గొన్న బాలికలను ఆయన అభినందించారు.
ఇవి కూడా చదవండి:
- ఫిఫా ప్రపంచ కప్: పోర్చుగల్‌పై మొరాకో విజయాన్ని ఇస్లాంతో ముడిపెడుతున్నారు ఎందుకు?
- భారత్ ప్రపంచానికి నాయకత్వం వహించవచ్చు అని రష్యా ఎందుకు అంటోంది?
- పార్లమెంటుపై దాడికి 21 ఏళ్లు: మిలిటెంట్ల దాడి నుంచి భారత ప్రధాని, ఎంపీలు ఎలా బయటపడ్డారంటే
- అఫ్గాన్ మహిళల రహస్య కథలు: ‘కొన్ని కలలు కనడానికి, ఆలోచించడానికి కూడా మాకు అనుమతి ఉండదు’
- పని కోసం ఖతార్ వెళ్తే తిరిగి రావడం కష్టమా, పని మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి















