పాకిస్తాన్:ట్రాన్స్‌జెండర్లు ప్రభుత్వంపై ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు?
పాకిస్తాన్:ట్రాన్స్‌జెండర్లు ప్రభుత్వంపై ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు?
పాకిస్తాన్ పార్లమెంటు 2018లో ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణా చట్టాన్ని ఆమోదించింది.
ట్రాన్స్‌జెండర్లకు చట్టబద్ద సమానత్వం, వారి హక్కులకు రక్షణ కల్పించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.
కానీ కొన్ని అతివాద మతతత్వ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఈ చట్టం ద్వారా స్వలింగ సంపర్కానికి మద్దతిస్తూ పాకిస్తాన్ సంస్కృతీ సంప్రదాయాల్లోకి పశ్చిమ దేశాల విలువలను జొప్పిస్తున్నారనేది వాళ్ల వాదన.
దాంతో ఈ చట్టం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ట్రాన్స్ వ్యక్తులు పాకిస్తాన్ వీధుల్లోకొచ్చి నిరసనలు చేస్తున్నారు. హక్కుల కోసం పోరాడుతున్నారు.
కరాచి నుంచి బీబీసీ ప్రతినిధి షుమైలా ఖాన్ అందిస్తోన్న రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:
- సూపర్‌మార్కెట్ షాపింగ్‌లో ఖర్చు తగ్గించుకోవడం ఎలా? ఈ 5 చిట్కాలు పాటించండి
- బ్రిటన్ ప్రజలు కొత్త బట్టల కంటే సెకండ్ హ్యాండ్ బట్టలు కొనేందుకే మొగ్గు చూపుతున్నారు. ఎందుకు?
- Cost of living: ధరల పెరుగుదలతో ఆంధ్రప్రదేశ్‌లోని చిరు వ్యాపారులపై ఎలాంటి ప్రభావం పడుతోంది
- ధరలు పెరుగుతుంటే గృహిణులు ఇల్లు గడపడానికి ఎలాంటి అవస్థలు పడుతున్నారు?









