రాజస్థాన్ ఆరోగ్య హక్కు బిల్లులో ఏముంది?
ఆరోగ్య హక్కు చట్టం, ప్రస్తుతం రాజస్థాన్‌ను కుదిపేస్తోంది.
ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలని చెబుతోన్న ఆరోగ్య హక్కు చట్టాన్ని ప్రైవేట్ వైద్యులు, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆపగలవా?
రాజస్థాన్‌లోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య హక్కులను కల్పిస్తుంది ఈ బిల్లు. ఉచిత వైద్య సేవలను పౌరుల హక్కుగా అందిస్తుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి - ప్రభుత్వ ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాల్లోనూ, ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలు ఉచితం.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలతో పాటు మందులు, డయాగ్నోస్టిక్ సేవలు, వైద్య పరీక్షలు ఉచితం.
ఇక ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ– ్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు ఉచితం.
అంటే ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. పోలీసుల క్లియరెన్సులు అవసరం లేదు. వైద్యానికయ్యే ఖర్చులు, వైద్య పరీక్షల ఖర్చులూ ఏమీ ఉండవు.
ఆసుపత్రులకు వెళ్లేందుకు వచ్చేందుకు కూడా ఉచితంగానే ట్రాన్స్‌పోర్ట్ సేవలు అందించాలి.
ఇలాంటి ఉచిత వైద్య సేవలను ప్రజల హక్కుగా మారుస్తూ ఆరోగ్య హక్కు బిల్లుని మార్చి 21న రాజస్థాన్ అసెంబ్లీ ఆమోదించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- ‘అందరిలా నాకు కన్నీళ్లు రావు.. ఏడవలేను కూడా’.. ఏమిటీ సమస్య
- ఏటీఎం జాక్‌పాటింగ్: సినిమాలో పాత్ర అంటూ ప్రజలను పంపించి రూ. 115 కోట్లు డ్రా చేయించారు, అయిదేళ్ల కిందట పుణె బ్యాంకును ఎలా కొల్లగొట్టారంటే..
- డోనల్డ్ ట్రంప్: అమెరికా మాజీ అధ్యక్షుడిపై కేసులో ఏడు ప్రశ్నలు, సమాధానాలు
- బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులు బీజేపీలో చేరారా..? ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎందుకు కనిపించారు?
- రిలయన్స్, అదానీ, టాటా వంటి పెద్ద సంస్థలతో నష్టం కూడా ఉందా?













