పార్వతీపురం: ఫిట్స్ వచ్చిన కూతురిని రక్షించుకోవడానికి ప్రాణాలకు తెగించి నది దాటిన తల్లిదండ్రులు

వీడియో క్యాప్షన్, కూతురి ప్రాణాలు కాపాడడానికి ఈ తల్లిదండ్రులు ప్రాణాలకు తెగించి నది దాటారు

అనారోగ్యానికి గురైన ఏడేళ్ల కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్లేడానికి తల్లిదండ్రులు పడిన కష్టం ఇది.

ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం జిల్లా రెబ్బ గ్రామానికి చెందిన ఏడేళ్ల మరియమ్మకు ఫిట్స్ రావడంతో..

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నాగావళి నదిలో ప్రమాదకరంగా వెదురుకర్రలపై తీసుకెళ్లాల్సి వచ్చింది ఆమెను.

రెబ్బ గ్రామం నుంచి 20 కి.మీ. దూరంలోని ఒడిశాలోని రాయగడ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి వీరు ప్రమాదానికి ఎదురీదాల్సి వచ్చింది.

అప్పటికప్పుడు వెదురు కర్రలను తెప్పలా కట్టి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిని రోగితో కలిసి దాటారు.

శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వెదురుకర్రలపై నది దాటుతున్న దృశ్యం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)