హనుమాన్‌కైండ్: ఇండియాలో పుట్టి ప్రపంచ సంగీతాభిమానులకు నచ్చిన ఈ ర్యాపర్ ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మనీష్ పాండే
- హోదా, బీబీసీ న్యూస్‌బీట్
హనుమాన్‌కైండ్ బిగ్ డాగ్స్ పాటకు 40 కోట్లకుపైగా స్పాటిఫై స్ట్రీమ్స్ ఉన్నాయి.
ఆయన తాజాగా విడుదల చేసిన పాట మిలియన్ల కొద్దీ స్ట్రీమ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయింది.
కాలిఫోర్నియాలోని ‘కోచెల్లా మ్యూజిక్ ఫెస్టివల్’లో త్వరలోనే ప్రదర్శన ఇవ్వనున్నారు రాపర్ హనుమాన్‌కైండ్.
ఆయన తొలి సక్సెస్‌ను అందించింది బిగ్ డాగ్స్ పాట.
ఇప్పుడు ఆయన కొత్త పాట ‘రన్ ఇట్ అప్’ వరుసగా మూడవ వారం ఆసియా మ్యూజిక్ చార్ట్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
ఇది స్పాటిఫై టాప్ 50లో ఉంది. ఒక దశలో కేండ్రిక్ లామర్.. నాట్ లైక్ అజ్ పాటను కూడా ఇది అధిగమించింది.
"ఇలాంటి రోజులు వస్తాయని నేను ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఇప్పుడు చూస్తున్నాను" అని హనుమాన్‌కైండ్ బీబీసీతో అన్నారు.
ఈ ప్రయాణం "రోలర్ కోస్టర్ రైడ్" లాంటిదేనని ఆయన అన్నారు.
రాపర్ హనుమాన్‌కైండ్ అసలు పేరు సూరజ్ చెరుకట్.
కేరళలో జన్మించిన 33 ఏళ్ల హనుమాన్‌కైండ్ ఫ్రాన్స్, నైజీరియా, ఈజిప్ట్, దుబయి, బ్రిటన్, అమెరికాలో వంటి దేశాలలో నివసించారు.
బిజినెస్ డిగ్రీ చదివి కార్పొరేట్ ప్రపంచంలో పనిచేసిన తర్వాత, చివరికి అది తనకు తగిన పని కాదని తన అభిరుచి వేరే ఉందని గుర్తించారు.

ఇది తాను పనిచేసిన వ్యాపార ప్రపంచంలాంటిది కాదని. తనకు తాను జవాబుదారీగా ఉంటానని హనుమాన్‌కైండ్ అంటున్నారు.
"రాత్రికిరాత్రే నాకు ఈ సక్సెస్ రాలేదు" అని ఆయన చెప్పారు.
"నేను ఇప్పుడు చేస్తున్నదే ఇప్పటివరకు నేను చేసిన అత్యంత కష్టతరమైన పని అని ఆయన అన్నారు.
"మనం ఎలా జీవించాలి అన్నదానికి బ్లూప్రింట్‌లాంటిదేమీ లేదు. మన స్వేచ్ఛ పరిమితులు తెలుసుకుని వ్యవహరించాలి" అని ఆయన చెప్పారు.
అయితే, ఆ స్వేచ్ఛనే తన సంగీతంలో చూపిస్తారాయన.

ఫొటో సోర్స్, Getty Images
హనుమాన్‌కైండ్ పాటలు ఇంగ్లిష్‌లో ఉంటాయి కానీ ఆయన తన దక్షిణాసియా మూలాలకు కట్టుబడి ఉండాలని కోరుకుంటారు.
"అలా జరిగిపోతుంటుంది. నేను నాకు ఏదనిపిస్తే అది చేయడానికి ప్రయత్నిస్తాను. సరిహద్దులనేవి ఉండకూడదు అని నేను అనుకుంటాను" అని ఆయన చెప్పారు.
హనుమాన్‌కైండ్ 2021లో భారత దేశానికి తిరిగి వచ్చారు.
తాజాగా ఆయన రూపొందించిన రన్ ఇట్ అప్ మ్యూజిక్ వీడియో భారతదేశంలోని విభిన్న సంస్కృతులను ఒక్కచోటకు చేర్చింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














