గోబీ ఎడారిలో రెండు గోళ్ల డైనోసార్లు

గోబీ ఎడారి, డైనోసార్, మంగోలియా

ఫొటో సోర్స్, Artist's impression by Masato Hattori

ఫొటో క్యాప్షన్, మంగోలియాలో డైనోసార్ నమూనా
    • రచయిత, టిమ్ డాడ్
    • హోదా, క్లైమేట్ అండ్ సైన్స్ రిపోర్టర్

మంగోలియాలోని గోబీ ఎడారిలో శాస్త్రవేత్తలు రెండు గోళ్ల డైనోసార్ జాతిని కనుగొన్నారు.

డ్యుయోనైకస్ సొబాటరీగా పిలిచే ఈ జాతి థెరిజినోసార్స్‌గా పిలిచే డైనోసార్ల గ్రూపులో ప్రత్యేకమైనది.

ఇవి వాటి వెనుక కాళ్లపై నిలబడతాయి. సాధారణంగా వీటికి మూడు గోళ్లుంటాయి.

పరిమాణంలో ఇవి మరీ పెద్దగా కాకుండా ఒక మోస్తరు పరిమాణంలో ఉంటాయి. ఇవి సుమారు 260 కిలోల బరువు ఉంటాయి.

పొడవైన, వంపు తిరిగిన గోళ్లు, వాటిని బలంగా వంచగల సామర్థ్యంతో ఈ జాతి డైనోసార్లు వృక్షసంపదను బాగా ఆరగించి ఉండేవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

థెరిజినోసార్‌లు 14.5 కోట్ల సంవత్సరాల కిందట మొదలై 6.6 కోట్ల ఏళ్ల కిందట ముగిసిన క్రటేషస్ కాలంలో ఆసియా, ఉత్తర అమెరికాలో నివసించిన శాకాహార, సర్వభక్షక థెరోపాడ్ డైనోసార్ల సమూహం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గోబీ ఎడారి, డైనోసార్, మంగోలియా

ఫొటో సోర్స్, Yoshi Kobayashi, Hokkaido University

ఫొటో క్యాప్షన్, ఈ డైనోసార్ 260 కేజీల బరువుంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.

జురాసిక్ పార్కులో కనిపించిన డైనోసార్లలాంటివే

జురాసిక్ వరల్డ్ డొమినియన్ చిత్రంలో ఇలాంటివే భారీ, పొడవైన గోళ్లు కలిగిన థెరిజినోసార్లను చూపించారని అధ్యయనకర్తల్లో ఒకరైన కాల్గరీ విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డార్లా జెలెనిస్కీ అన్నారు.

మంగోలియా గోబీ ఎడారిలోని బయాన్‌షైరీ నుంచి ఈ జాతి నమూనా స్వాధీనం చేసుకున్నారు. ఇది చివరి క్రటేషస్ కాలం(100.5 నుంచి 6.6 కోట్ల సంవత్సరాల క్రితం)నాటిది.

గోబీ ఎడారి, డైనోసార్, మంగోలియా

ఫొటో సోర్స్, Kobayashi et al

ఫొటో క్యాప్షన్, ఈ డైనోసార్లు తమ వాడి గోళ్లనే ఆయుధాలుగా ఉపయోగించేవి

డైనోసార్ల ఎడారి

మంగోలియా గోబీ ఎడారి ప్రపంచంలోనే అతిపెద్ద డైనోసార్ శిలాజ రిజర్వాయర్‌ అని యునెస్కో పేర్కొంది.

డైనోసార్ యుగం ప్రధాన మూడు కాలాలలో చివరి కాలం నాటి శిలాజాలకు ఈ ప్రాంతం నెలవు. క్రటేషస్ కాలం డైనోసార్ల పరిణామం చివరి దశను సూచిస్తుంది.

దాదాపు ఒక అడుగు పొడవున్న ఈ డైనోసార్ల గోళ్లు వాటి లోపలి ఎముకల కంటే చాలా పెద్దవిగా ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం)