ఇది ఇండియన్ జురాసిక్ పార్కు: ఈమె రాక్షస బల్లుల 'రాకుమారి'
స్టీవెన్ స్పీల్‌బర్గ్ వెండితెర మీద జూరాసిక్ పార్కు పేరుతో డైనోసార్ల ప్రపంచాన్ని సృష్టిస్తే.. ఈ గుజరాతీ రాకుమార్తె మాత్రం నిజంగానే అలాంటి డైనోసార్ల ప్రపంచాన్ని సంరక్షిస్తోంది. తన స్వస్థలానికి ప్రపంచంలోనే ఓ గుర్తింపు తెచ్చింది.
గుజరాత్‌లోని బాలసినోర్ ఒకప్పటి రాజసంస్థానం.
అంతేకాదు డైనోసార్ శిలాజ పార్కుగా కూడా ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
7 జాతుల డైనోసార్లకు ఇది ఒకప్పుడు నిలయంగా ఉండేదని శిలాజ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇక్కడ దొరికిన డైనోసార్ల శిలాజగుడ్లను పరిశీలించిన వారు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద డైనోసార్ల ఉత్పత్తి కేంద్రంగా బాలసినోర్‌ను గుర్తించారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)