కే-పాప్ వర్చువల్ గర్ల్స్: ఆడతారు, పాడతారు, అభిమానులతో ముచ్చటిస్తారు.. కానీ, అసలైన అమ్మాయిలు కారు

వర్చ్యువల్ గర్ల్ బ్యాండ్‌లు
    • రచయిత, జూలీ యోన్యుంగ్ లీ, అమెలియా హెంఫిల్
    • హోదా, బీబీసీ 100 ఉమెన్

2021లో సింగిల్ ఐయామ్ రియల్‌ విడుదైనప్పటి నుంచి కే-పాప్ గర్ల్ గ్రూప్ ఎటర్నిటీకి ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. ఆన్‌లైన్‌లో లక్షలాది మంది ప్రజలు దీన్ని వీక్షించారు.

ఇతర బ్యాండ్‌ల మాదిరిగానే ఈ కే-పాప్ గర్ల్ గ్రూప్‌కు చెందిన వారు కూడా ఆడతారు, పాడతారు, తమ అభిమానులతో కలిసి ముచ్చటిస్తారు.

అయితే, వీరికి, ఇతర పాప్ గ్రూప్‌కు మాత్రం చాలా తేడా ఉంటుంది. అదేమిటంటే, కే-పాప్ గ్రూప్‌లో ఉన్న 11 మంది కూడా సభ్యులు వర్చ్యువల్‌ క్యారెక్టర్లే. మనిషిలాగానే కనిపిస్తారు, కానీ మనుషులు కాదు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందిన సరికొత్త హైపర్ రియల్ అవతార్‌లు వీరు.

‘ఎటర్నిటీతో మేం ప్రారంభించిన ఈ వ్యాపారం సరికొత్తది. నూతన కళగా నేను దీన్ని భావిస్తున్నా’’ అంటూ ఎటర్నిటీ గ్రూప్‌ వెనుకున్న పార్క్ జియాన్ అన్నారు.

అయితే వర్చ్యువల్‌గా నటించే ఆర్టిస్టులతో ఉన్న ప్రయోజనం ఏంటంటే.. కే-పాప్ స్టార్లకున్న పరిమితులు వీరికి ఉండవు.. మానసిక క్షోభ భరించాల్సి ఉండదు. వీటన్నింటి నుంచి ఈ వర్చ్యువల్ ఆర్టిస్టులకు విముక్తి ఉంటుంది.

గత దశాబ్ద కాలంగా కొరియన్ పాప్ కల్చర్ మల్టిబిలియన్-డాలర్ ఇండస్ట్రీగా అవతరించింది. ఆకట్టుకునే ట్యూన్లు, అత్యాధునాత ప్రొడక్షన్ టెక్నాలజీ, స్లింకీ డ్యాన్స్‌లతో కే-పాప్ ప్రస్తుతం ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది.

దక్షిణ కొరియాలో అత్యంత ప్రభావితమైన ఎగుమతులతో ఒకటిగా ఈ ఇండస్ట్రీ నిలుస్తోంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డీప్‌ఫేక్, అవతార్ టెక్నాలజీల రాకతో.. ఈ పాప్ ఐడల్స్‌ ప్రస్తుతం తమ గుర్తింపును సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

ఎటర్నిటీ గ్రూప్‌ సభ్యుల వర్చ్యువల్ ముఖాలను.. డీప్ లెర్నింగ్ టెక్ కంపెనీ పల్స్-9 రూపొందించింది. ఈ కంపెనీ సీఈవోనే పార్క్ జియాన్.

తొలుత ఈ కంపెనీ 101 ఫాంటసీ ముఖాలను తయారు చేసింది. ఆ ముఖాలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరించింది. క్యూట్, సెక్సీ, ఇనోసెంట్, ఇంటెలిజెంట్ రూపాలలో రూపొందించింది పల్స్-9 కంపెనీ.

వర్చ్యువల్ గర్ల్ బ్యాండ్‌లు

ఫొటో సోర్స్, YG ENTERTAINMENT

తమకు నచ్చిన వర్చ్యువల్ ముఖాలకు ఓటు వేయాలని అభిమానులను కూడా కంపెనీ కోరింది.

అభిమానుల కోరిక మేరకు వారికి నప్పే రీతిలో వర్చ్యువల్ క్యారెక్టర్లను కంపెనీ డిజైనర్లు రూపొందిస్తున్నారు.

లైవ్ చాట్‌లు, వీడియోలు, ఆన్‌లైన్‌లో అభిమానులతో ముచ్చటించేందుకు.. ఈ అవతార్ ముఖాలను వారికి తెలిసిన గాయకులు, నటులు, డ్యానర్లు మాదిరిగా కూడా పల్స్-9 కంపెనీ చూపిస్తుంది.

డీప్‌ఫేస్ ఫిల్టర్ మాదిరిగా ఈ టెక్నాలజీ పనిచేస్తూ.. నిజ జీవితంలోకి ఈ క్యారెక్టర్లను తీసుకొస్తుంది. ‘‘వర్చ్యువల్ క్యారెక్టర్లు సరియైనవి. ఇవి మనుషులను మించినవి కూడా కావొచ్చు’’ అంటూ బీబీసీ 100 మహిళలకు పార్క్ జియాన్ చెప్పారు.

డీప్‌ఫేక్ టెక్నాలజీ ప్రస్తుతం ప్రధాన స్రవంతిలోకి వచ్చేస్తుంది. అయితే ఇది ప్రధాన విభాగంలోకి వస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రజల అనుమతి లేకుండా వారి ఫోటోలను దీని ద్వారా దుర్వినియోగపరడానికి వీలుంటుందని, దీనివల్ల అత్యంత ప్రమాదకరమైన తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా మహిళలకు ఇది మరింత ప్రమాదకరంగా మారుతోంది. తమ ముఖాలు పోర్నోగ్రాఫిక్ ఫిల్మ్స్‌లో వస్తున్నాయని మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు.

అంతేకాక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలియెన్‌స్కీ‌ల డీప్‌ఫేక్‌లు కూడా సోషల్ మీడియా సైట్లలో షేర్ అయ్యాయి. ‘‘అయితే, ఇవన్ని పూర్తిగా కల్పిత పాత్రలేనని నేను స్పష్టం చేయడానికి ప్రయత్నిస్తున్నాను’’ అని పల్స్-9 కంపెనీ సీఈవో తెలిపారు. ఈ అవతార్లను రూపొందించే క్రమంలో పల్స్9 కంపెనీ యూరోపియన్ యూనియన్ డ్రాఫ్ట్ ఎథికల్ ఏఐ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తుందని సీఈవో చెప్పారు.

వర్చ్యువల్ గర్ల్ బ్యాండ్‌లు

ఫొటో సోర్స్, PULSE9

ఈ కొత్త టెక్నాలజీలను మంచికే ఉపయోగించేందుకు తీసుకొచ్చామని.. ఇండస్ట్రీ డిమాండ్లను అందుకోలేక ఒత్తిడికి గురవుతున్న కే-పాప్ ఆర్టిస్టులకు ఉపశమనం కల్పించేందుకు ఉపయోగపడతాయని పార్క్ జియాన్ నమ్ముతున్నారు.

గత కొన్నేళ్లుగా, డేటింగ్ గాసిప్స్ నుంచి ఆన్‌లైన్ ట్రోలింగ్, ఫ్యాక్ట్ షేమింగ్, డైటింగ్ వరకు పలు రకాల సామాజిక విషయాల్లో కే-పాప్ ఆర్టిస్టులు ప్రధానాంశంగా నిలుస్తున్నారు.

వారి మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది. యువ కే-పాప్ స్టార్లు కూడా అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు.

2019లో గాయని, నటీమణి అయిన 25 ఏళ్ల సులీ తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.

తప్పుడు, నిరాధార రూమర్లతో విసుగెత్తిపోయిన సులీ, మానసికంగా, శారీరకంగా తీవ్ర క్షోభకు గురయ్యారు.

ఆ తర్వాత వినోద పరిశ్రమ నుంచి తప్పుకొంది. తర్వాత కొన్ని రోజులకు ఆమె తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె సన్నిహితురాలు, కే-పాప్ ఆర్టిస్టు గూ హరా కూడా సియోల్‌లోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

తన బాయ్‌ఫ్రెండ్ రహస్యంగా తనని చిత్రీకరించి, దాన్ని ఆన్‌లైన్‌లో పోస్టు చేసి వేధింపులకు గురి చేయడంపై న్యాయం కోసం పోరాడిన గూ హరా ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు.

24 గంటల పాటు కే-పాప్ స్టార్లు తీరిక లేకుండా పనిచేయాల్సి వస్తుంది. అంతేకాక, అభిమానులతో సంభాషించాల్సి ఉంటుంది. ఇంత ఒత్తిడిని భరిస్తున్న ఈ స్టార్లకు, వర్చ్యువల్ ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన అవతార్ అసిస్టెన్స్ కాస్త ఊరటనివ్వనుంది. కే-పాప్ స్టార్ కావడం రాత్రికి రాత్రి జరిగిపోదు. ప్రతి ఏడాది ఎన్నో కొత్త గ్రూప్‌లు తెరపైకి వస్తుంటాయి. ఇన్ని గ్రూప్‌లలో నిలదొక్కుకుని నిల్చోవడం చాలా కష్టం. ‘‘ ప్రతి రోజూ ఉదయాన్నే పది గంటలకు నేను పనిచేయడానికి వెళ్తాను. గంట పాటు నేను వోకల్ వామ్-అప్స్ చేస్తాను. ఆ తర్వాత రెండు నుంచి మూడు గంటల పాటు పాటలు పాడాలి. ఆ తర్వాత మూడు నుంచి నాలుగు గంటల పాటు డ్యాన్స్ చేస్తాను. మరో రెండు గంటలు వర్కవుట్ చేస్తాను’’అని దక్షిణ కొరియాలో యెస్ ఐఎం ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో కొత్తగా లాంచ్ అయిన గర్ల్ గ్రూప్ మిమీరోజ్ లీడ్ వోకలిస్ట్ హాన్ యెవాన్ చెప్పింది.

మొత్తంగా రోజులో 12 గంటలకు పైగా సాధన చేయాల్సి వస్తుందని, అయినప్పటికీ అది సరిపోవడం లేదన్నారు. మరింత సమయం పాటు దీనిపై వెచ్చించాల్సి వస్తుందని చెప్పింది.

ఈ సమయంలో పరిశ్రమలోకి వచ్చిన వర్చ్యువల్ అవతార్లు, తమకు ఆందోళనకరంగా నిలుస్తున్నాయని హాన్ యెవాన్ పేర్కొంది. హ్యుమన్ ఐడల్స్ స్థానాన్ని ఈ వర్చ్యువల్ క్యారెక్టర్లు తన్నుకుపోతాయేమోనని భయమేస్తున్నట్టు తెలిపింది.

వర్చ్యువల్ గర్ల్ బ్యాండ్‌లు

అయితే, ఇతర కే-పాప్ గ్రూప్‌లు చాలా వేగంగా ఈ కొత్త అవతార్ టెక్నాలజీలను అందిపుచ్చుకుంటున్నాయి. వారి వ్యాపారాలు కూడా స్థిరంగా పెరుగుతాయని అంచనాలున్నాయి. డిజిటల్ హ్యుమన్, అవతార్ మార్కెట్ సైజు 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 527.58 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని మార్కెట్ కన్సల్టింగ్ కంపెనీ ఎమర్జెన్ రీసెర్చ్ అంచనావేసింది.

కే-పాప్‌లోని అతిపెద్ద నాలుగు ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ తమ స్టార్ల వర్చ్యువల్ రూపాలపై పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నాయి. ఎలాంటి భాషాపరమైన ఇబ్బందులు లేకుండా, ఇతర ప్రాంతాలన్నింటికి అన్ని వేళల్లో తమ అభిమానులను చేరుకునేందుకు కే-పాప్ స్టార్లు కూడా తమ వర్చ్యువల్ కాపీలకు అనుమతిస్తున్నాయి.

ఉదాహరణకు గర్ల్ బ్యాండ్ ఎస్పా నలుగురు సింగర్లను, డ్యానర్లను కలిగి ఉండటంతో పాటు, వారి నాలుగు వర్చ్యువల్ రూపాలను కూడా తయారు చేసింది.

చార్ట్స్‌లో ముందంజలో ఉండే గర్ల్ బ్యాండ్ బ్లాక్‌పింక్ కూడా తన వర్చ్యువల్ ట్విన్స్‌ సాయంతో చరిత్రను సృష్టించింది. 2022లో బెస్ట్ మెటావర్స్ ప్రదర్శనకు తొలిసారి ఎంటీవీ అవార్డును పొందింది.

రియల్ టైమ్‌లో అవతార్ల గ్రూప్ ప్రదర్శనను చూసేందుకు పాపులర్ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ పబ్‌జీపైకి ప్రపంచవ్యాప్తంగా కోటిన్నరకు పైగా ప్రజలు వచ్చారు.

వర్చ్యువల్ గర్ల్ బ్యాండ్‌లు

ఫొటో సోర్స్, SM ENTERTAINMENT

కరోనా సమయంలో మూన్ సువా, ఆమె కే-పాప్ గ్రూప్ బిల్లీ తమ లైవ్ ప్రదర్శనలను, అభిమానుల సమావేశాలను రద్దు చేసింది. దానికి బదులు, బ్యాండ్ సభ్యుల వర్చ్యువల్ కాపీలను ఆ బ్యాండ్ మేనేజ్‌మెంట్ గ్రూప్ క్రియేట్ చేసింది. వర్చ్యువల్ ప్రపంచంలోనే అభిమానులతో సంప్రదింపులు చేపట్టింది.

‘‘తొలుత మేము కాస్త గందరగోళానికి గురయ్యాం. కానీ ఆ తర్వాత, మెల్లమెల్లగా మేము దాన్ని అందిపుచ్చుకున్నాం. వర్చ్యువల్ ప్రపంచాన్ని అందిపుచ్చుకుంటూనే అభిమానులతో మాట్లాడాం. మేము చాలా మంచి సమయాన్ని కలిగి ఉన్నాం. ’’ అని సువా అన్నారు.

‘‘ఇవి మాకు ప్రమాదకరంగా మారతాయని మేము భావించడం లేదు. వారిని చూస్తూ మేం స్కిల్స్ నేర్చుకోవచ్చేమో. మమ్మల్ని ఇవి రీప్లేస్ చేసి మాకు ప్రమాదకరంగా మారతాయని నేను అనుకోవడం లేదు’’ బ్యాండ్ ప్రధాన ర్యాపర్ అన్నారు.

వర్చ్యువల్ గర్ల్ బ్యాండ్‌లు

ఫొటో సోర్స్, MYSTIC STORY

అయితే ప్రస్తుతమున్న అవతార్ టెక్నాలజీలలో కొన్ని నైతిక, కాపీరైట్ సమస్యలు ఉన్నాయి. ‘‘మెటావెర్స్‌లో ఆర్టిస్టులు, వర్చ్యువల్ వెర్షన్లు, వారి ఐకాన్లు ఏది ఏమైనా చాలా వరకు తెలియనవే ఉంటున్నాయి’’ అని బీబీసీ 100 ఉమెన్‌‌కి బిల్‌బోర్డ్స్ కే-పాప్ కాలమిస్ట్ జెఫ్ బెంజమిన్ తెలిపారు.

అంతేకాక ఆర్టిస్టులు తమ ఇమేజ్‌పై పూర్తి నియంత్రణ కోల్పోతారు. దీని వల్ల ప్రమాదానికి గురయ్యే అవకాశం కూడా ఉంది.

కే-పాప్ స్టార్లకు, అభిమానులకు వర్చ్యువల్ ప్రపంచం స్వాగతించదగ్గది కాదు. సైబర్ బెదిరింపులు లేదా వేధింపులను నిరోధించే నియంత్రణ లోపించింది. సక్సెస్ స్టార్టకు ఆన్‌లైన్‌ వేధింపులు పెరుగుతాయి.

అలాగే ఈ వర్చ్యువల్ టెక్నాలజీ, పెరుగుతున్న ఏఐ క్యారక్టర్లు ఎలా యువతపై ప్రభావం చూపుతాయో త్వరలోనే తెలిసిపోతుందని పిల్లల వైద్య నిపుణురాలు జియోంగ్ యు కిమ్ తెలిపారు. ఈ వర్చ్యువల్ ప్రపంచంలో ఒకరికి ఒకరు చూసుకోరని, అదే అసలైన సమస్యని జియోంగ్ యు అన్నారు.

వర్చ్యువల్ ప్రపంచంలో బయట చేయలేని ఎన్నో పనులను చేసుకునే స్వేచ్ఛ దక్కుతుందని, మీరు మరో వ్యక్తి కూడా కావొచ్చని చెప్పారు.

ఇతర వినోద పరిశ్రమ లాగానే, దీనికి కూడా చాలా రకాల ఒత్తిళ్లు ఉన్నాయని జెఫ్ బెంజమిన్ అన్నారు. మంచి ఇమేజ్‌ కోసమే ఆర్టిస్టులు పనిచేస్తూ ఉంటారని, వారి అభిమానులకు ఒక ఉదాహరణలాగా వారు ఉండాలనుకుంటారని చెప్పారు.

ఈ మార్పు స్టార్లపై ఉన్న తీవ్ర పని భారాన్ని తగ్గించి, వారి మానసిక ఆరోగ్యానికి కావాల్సిన సేవలను అందిస్తుంది.

వేగంగా మారుతున్న కే-పాప్ ఇండస్ట్రీలో.. ఈ వర్చ్యువల్ ఐడల్స్ స్వల్ప కాలికమేనా? లేదా మ్యూజిక్ పరిశ్రమకు భవిష్యత్ ఇవేనా? అన్నది త్వరలోనే తెలియ రానుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)