ప్రపంచంలోనే అత్యంత పురాతన శిలాజ అడవి గురించి శాస్త్రవేత్తలు ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, NEIL DAVIES
ప్రపంచంలోనే మొట్టమొదటి శిలాజ అడవిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంగ్లండ్‌కు నైరుతి దిక్కున తీరప్రాంతంలోని కొండచరియలలో వీటిని కనుగొన్నారు.
సోమర్సెట్‌లోని బట్లిన్ హాలిడే క్యాంప్‌కు సమీపంలో మైన్‌హెడ్‌లో ఉన్న ఇసుకరాతి కొండచరియలలో వీటి జాడను కనిపెట్టారు.
ఇక్కడ కనుగొన్న చెట్ల శిలాజాలు బ్రిటిన్‌లోనే అత్యంతపురాతనమైనవని, భూమ్మీద ఏర్పడిన అత్యంత ప్రాచీన అడవికి సంబంధించినవని కేంబ్రిడ్జి, కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు.
కాలమోఫైటాన్ అని పిలిచే ఈ చెట్లు తాటిచెట్లను పోలి ఉంటాయి. ప్రస్తుత చెట్లకు మూలరూపం ఇవేనని భావిస్తున్నారు. ఇవి రెండు నుంచి నాలుగు మీటర్ల వరకు పెరుగుతాయి.
శాస్త్రవేత్తలు చెట్ల శిలాజాలను, వాటి చెత్తతోపాటు దుంగలను, వాటి వేర్లను కూడా కనుగొన్నారు.
ఏం తెలుస్తుంది?

ఫొటో సోర్స్, CHRIS BERRY
లక్షలాది సంవత్సరాల కిందట మైదాన ప్రాంతాలు, నదీతీరాలు, తీరప్రాంతాలు స్థిరంగా ఒక రూపాన్ని సంతరించుకోవడానికి ఈ పురాతన చెట్లు ఎలా ఉపయుక్తమయ్యాయో ఈ శిలాజాల ద్వారా తెలుస్తుంది.
‘‘నేనీ చెట్ల కాండం చూడగానే అదేమేటో నాకు తెలిసిపోయింది. ముప్పైఏళ్ళుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇలాంటి చెట్ల గురించి నేను అధ్యయనం చేస్తున్నాను’’ అని కార్డిఫ్స్ స్కూల్ ఆఫ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్‌కు చెందిన డాక్టర్ క్రిస్టోఫర్ బెర్రీ చెప్పారు.
‘‘ఇంటికి సమీపంలోనే వాటిని చూడటం చాలా అద్భుతంగా ఉంది. పైగా అవెక్కడ పెరిగాయో అక్కడే వాటి అవశేషాలు కనపడటం వల్ల మరింత లోతైన అధ్యయనం చేయడానికి వీలవుతుంది’’ అని అన్నారు.
నేచురల్ హిస్టరీ మ్యూజియంలో వృక్ష శిలాజ నిపుణుడిగా పనిచేస్తున్న డాక్టర్ పౌల్ కెన్రిక్ ఈ అధ్యయనంలో పాల్గొనలేదు. కానీ ఇటువంటి శిలాజాల జాడలు ఆ సమయంలో చెట్లు ఎలా పెరిగాయో తెలుసుకోవడానికి చాలా చాలా అవసరం అని చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
40 లక్షల సంవత్సరాల ప్రాచీనం
శాస్త్రవేత్తలు ప్రస్తుతం కనుగొన్న అడవి 40 లక్షల సంవత్సరాల ప్రాచీనమైనది. దీంతో ఇప్పటిదాకా న్యూయార్క్‌లోని కైరో ప్రాంతంలో కనుగొన్న అడవి కంటే ఇది మరింత ప్రాచీనమైనదిగా గుర్తించారు.
భూమ్మీద జీవరాశి పెద్ద ఎత్తున విస్తరిస్తున్న సమయంలో 419 నుంచి 358 లక్షల సంవత్సరాల కిందటి డేవోనియన్ కాలంలో డేవాన్, సోమర్సెట్ తీర ప్రాంతాలతోపాటు హాంగ్‌మాన్ ఇసుకరాళ్ళు ఏర్పడ్డాయని కనుగొన్నారు.
ఈ ప్రాంతం అప్పట్లో పాక్షిక మైదాన ప్రాంతంగా ఉండేది. కానీఅప్పట్లో ఇది ఇంగ్లండ్‌లో భాగంగా లేదు. బెల్జియం, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలకు చెందినదిగా ఉంది. అక్కడ వీటి అవశేషాలు కూడా కనుగొన్నారు.
‘‘ఈ అడవి ప్రస్తుతం మనకు తెలిసిన అడవి లాంటిది కాదు.’’ అని కేంబ్రిడ్జి యూనివర్సిటీలోని ఎర్త్ సైన్సెస్ కు చెందిన ప్రొఫెసర్ నెయిల్ డేవీస్ చెప్పారు. ఈ అధ్యయన మొదటి రచయిత ఈయనే. ఈ చెట్లు భూమిపై పెద్ద ప్రభావాన్నే చూపాయని ఆయన తెలిపారు.
ఈ చెట్లు ఇప్పుడు మనం చూసే చెట్లకన్నా చాలా భిన్నమైనవి. కానీ ప్రస్తుతం బ్రిటన్‌లో అలంకారప్రాయంగా వాడుతున్న మొక్కలు, ఆస్ట్రలేసియాలోని డిక్సోనియా అంటార్కిటికా లాంటి మొక్కలు వీటికి అత్యంత ఆధునిక ప్రతిరూపాలని నేచరల్ హిస్టరీ మ్యూజియంకు చెందిన డాక్టర్ కెన్రిక్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















