గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గూడ్స్ రైలును ఢీకొన్న భాగమతి ఎక్స్‌ప్రెస్, అసలేం జరిగింది?

భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

తమిళనాడులోని చెన్నైకి సమీపంలో కవరైపెట్టై రైల్వే స్టేషన్‌ దగ్గర జరిగిన రైలు ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులకు గాయాలైనట్లు సదరన్ రైల్వే తెలిపింది.

కర్ణాటకలోని మైసూర్ నుంచి బిహార్‌లోని దర్భంగాకు వెళ్తున్న భాగమతి ఎక్స్‌ప్రెస్, ఆగి ఉన్న గూడ్స్‌ రైలును ఢీకొంది.

ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో జరిగినట్లు రైల్వే శాఖ తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ప్రమాదంలో భాగమతి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 12-13 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో, ఏడుగురు ప్రయాణికులకు గాయాలు కాగా, వారిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని సదరన్ రైల్వే తెలిపింది.

తక్షణమే సహాయక చర్యలను చేపట్టి, రైలులోని ప్రయాణికులందర్నీ సురక్షితంగా కాపాడామని అధికారులు చెప్పారు.

స్వల్ప గాయాలైన వారికి పొన్నేరిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు.

తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్టాన్లీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

ప్రమాదం ఎలా జరిగింది?

మైసూర్ నుంచి దర్భంగా వెళ్తున్న భాగమతి ఎక్స్‌ప్రెస్ (రైలు నెంబర్. 12578) రాత్రి 8.27 గంటలకు పొన్నేరి స్టేషన్‌ను దాటింది.

మెయిన్‌లైన్ మీదుగా ఆ తర్వాత స్టేషన్ కవరైపెట్టైను దాటేందుకు ఈ ప్రయాణికుల రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కేవీపీ స్టేషన్‌లోకి ప్రవేశించేటప్పుడు, రైలు భారీ కుదుపులకు లోనైనట్లు రైలు సిబ్బంది గమనించారు. ఆ తర్వాత ఆ రైలు మెయిన్ లైన్‌కు బదులు, గంటకు 75 కిలోమీటర్ల వేగంతో లూప్ లైన్‌లోకి వెళ్లింది. ఆ సమయంలో లూప్‌ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఈ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది.

ఈ ప్రమాదం జరగడంతో, ఆ మార్గంలో వెళ్లే పలు రైలు సర్వీసులను నిలిపివేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు.

భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు

ఫొటో సోర్స్, Getty Images

తిరువళ్లూరు కలెక్టర్ ఏం చెప్పారు?

‘‘ప్రయాణికుల రైలు గూడ్స్ రైలును ఢీకొంది. ఆ సమయంలో 1,360 మంది ప్రయాణికులు రైలులో ఉన్నారు. ప్రమాద సమాచారం అందగానే మేం ఘటనా స్థలానికి వెళ్లాం. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశించారు. ప్రయాణికులందర్నీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చాం’’ అని తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ టీ ప్రభుశంకర్ చెప్పారు.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కలెక్టర్ తెలిపారు.

గాయపడ్డ వారిని పరామర్శించిన ఉదయనిధి స్టాలిన్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, గాయపడ్డవారిని పరామర్శించిన ఉదయనిధి స్టాలిన్

గాయపడ్డ వారిని పరామర్శించిన ఉదయనిధి స్టాలిన్

చెన్నైలోని గవర్నమెంట్ స్టాన్లీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రయాణికులను తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పరామర్శించారు.

ఇవాళ(శనివారం) తెల్లవారుజామున ప్రత్యేక రైలులో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు పంపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)