పీఎఫ్ 100 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చా? 4 ప్రశ్నలు, సమాధానాలు

మనీ, పీఎఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకోవడానికి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) నియమాలను మరింత సరళం చేసింది.

ఈపీఎఫ్‌ఓలో ప్రస్తుతం 7 కోట్లకు పైగా సభ్యులు ఉన్నారు. ఈ ఖాతాదారులు అవసరమైన సమయాల్లో సద్వినియోగం చేసుకోవడానికి ఈ కొత్త మార్పులు తోడ్పడతాయి.

కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఈపీఎఫ్‌ఓకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు ఈపీఎఫ్‌ఓ సభ్యులు ప్రావిడెంట్ ఫండ్‌లో ఉన్న డబ్బు మొత్తాన్ని విత్ డ్రా చేసుకోసుకోవచ్చు. అయితే, మినిమం బ్యాలెన్స్ షరతు వర్తిస్తుంది.

కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటన ప్రకారం, పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి ఉన్న 13 వేర్వేరు నిబంధనలను మూడు కేటగిరీలుగా విభజించింది సీబీటీ .

  • ముఖ్యమైన అవసరాలు (అనారోగ్యం, విద్య, వివాహం)
  • గృహ అవసరాలు
  • ప్రత్యేక పరిస్థితులు.
ఈపీఎఫ్‌ఓ , కొత్త నిబంధనలు

ఫొటో సోర్స్, @ShobhaBJP

ఫొటో క్యాప్షన్, కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈపీఎఫ్‌ఓకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.
పీఎఫ్

కొత్త నిబంధనల ప్రకారం, ఈపీఎఫ్‌ఓ సభ్యులు ఇప్పుడు వారి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేసిన మొత్తంలోని అర్హమైన బ్యాలెన్స్‌లో 100 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. ఇందులో ఉద్యోగి, యజమాని ఇద్దరి వాటా ఉంటుంది.

అయితే, ఖాతాలో కనీస బ్యాలెన్స్ 25 శాతం ఉండాల్సిందే. అంటే మీ ఖాతాలో రూ.4 లక్షలు ఉంటే, రూ.3 లక్షల(అర్హమైన బ్యాలెన్స్‌)ను తీసుకోవచ్చు. మీ ఖాతాలో రూ. 1 లక్ష బ్యాలెన్స్ ఉంచాలి.

ఉద్యోగులు తమ డిపాజిట్లపై 8.25 శాతం రేటుతో వడ్డీని పొందడానికి ఈ నిబంధన ఉంచారు. మిగిలిన బ్యాలెన్స్‌ను భవిష్యత్తు లేదా పదవీ విరమణ తర్వాత అవసరాలకు ఉపయోగించవచ్చు.

ఈపీఎఫ్‌ 3.0 కింద, ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకునే పరిమితిని కూడా సరళంగా మార్చారు. డబ్బును ఉపసంహరించుకోవడానికి ఉద్యోగి 'మినిమమ్ సర్వీస్' కాల పరిమితిని 12 నెలలకు తగ్గించారు.

దీని అర్థం ఇప్పుడు, పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకోవాలనుకుంటే మీరు ఏడాది పనిచేసినా చాలు లేదా మీ పీఎఫ్ ఖాతా సంవత్సరం కాల పరిమితిదై ఉండాలి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఈపీఎఫ్‌ఓ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈపీఎఫ్‌ఓలో 7 కోట్లకు పైగా సభ్యులు ఉన్నారు (ఫైల్ ఫోటో)
పీఎఫ్

'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్' అనేది ఉద్యోగుల భవిష్యత్ అవసరాలను తీర్చడానికి ఉద్దేశించినది.

ఉద్యోగులకు వివాహం, పిల్లల విద్య, ఇల్లు కొనడం లేదా ఏదైనా వ్యాధి చికిత్స కోసం డబ్బు అవసరం ఉంటుంది.

కొత్త సడలింపులతో పీఎఫ్ సభ్యులు ఇప్పుడు చదువుల కోసం 10 సార్లు, వివాహం కోసం 5 సార్ల వరకు డబ్బును ఉపసంహరించుకోవచ్చు. గతంలో విద్య, వివాహం కోసం మూడుసార్లు ఉపసంహరణలనే అనుమతించారు. దీనర్థం ఈపీఎఫ్ ఖాతాదారులు ఇప్పుడు వారి అవసరాలను బట్టి మరిన్ని సందర్భాలలో తమ డిపాజిట్లను విత్ డ్రా చేసుకోవచ్చు.

తాజాగా దీనిని డిజిటల్‌గా మార్చారు. అంటే మీరు డిపాజిట్ చేసిన మొత్తాన్ని పాక్షికంగా ఉపసంహరించుకోవడానికి ఎలాంటి పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. ఇది క్లెయిమ్‌ల పరిష్కారాన్ని సులభతరం చేస్తుంది. సభ్యులకు చాలా ఉపయోగకరంగా ఉండనుంది.

మనీ, పీఎఫ్

ఫొటో సోర్స్, Getty Images

పీఎఫ్

గతంలో ఏదైనా విపత్తు, అంటువ్యాధి, ప్రత్యేక పరిస్థితులు (ప్రకృతి వైపరీత్యం, నిరుద్యోగం, మహమ్మారి వంటివి) సంభవించినప్పుడు విత్ డ్రా ఆప్షన్ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో తరచుగా క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యేవి.

ఇప్పుడు ఈ సమస్యకు చెక్ పెట్టారు.

సభ్యులు ఎటువంటి కారణం లేకుండా కొన్ని పరిస్థితులలో నిధులను ఉపసంహరించుకోవచ్చు.

పీఎఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
పీఎఫ్

ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఏ ఉద్యోగికైనా పీఎఫ్ ఖాతా ఉంటుంది. ఆ ఉద్యోగి ప్రాథమిక జీతంలో 12 శాతం ఈ ఖాతాలో జమ చేస్తారు. వారి కంపెనీ కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తుంది. ఈపీఎఫ్ఓ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది.

కాగా, కంపెనీ జమ చేసిన ఈ 12 శాతంలో 8.33 శాతం పెన్షన్ ఫండ్‌లో జమ అవుతుంది, మిగిలిన 3.67 శాతం ప్రావిడెంట్ ఫండ్‌లో జమ అవుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)