రిపబ్లిక్ డే - ఫోటో ఫీచర్: పరేడ్‌ను తొలిసారిగా ముందుండి నడిపించిన మహిళలు

రిపబ్లిక్ డే పరేడ్

ఫొటో సోర్స్, AFP

దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం జరిగిన 75వ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

దిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకల సందర్భంగా పరేడ్ నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, దేశ ప్రధాని నరేంద్ర మోదీలు ఈ పరేడ్‌ను నిర్వహించారు.

తొలిసారిగా పరేడ్‌లో భారత త్రివిధ దళాలు, పారామిలటరీ దళాలను మహిళా సైనికులే ముందుండి నడిపించారు.

ఫ్రాన్స్ అధ్యక్షులు మేక్రాన్‌

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఫ్రాన్స్ అధ్యక్షులు మేక్రాన్‌ గుర్రపు బగ్గీలో వచ్చారు.
నరేంద్రమోదీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పరేడ్‌కు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ

మొదటిసారి భారత ఆర్మీ, వైమానిక, నౌకా దళాలకు చెందిన మహిళా సైనికుల బృందాలే పరేడ్‌లో పాల్గొన్నాయి.

రిపబ్లిక్ డే పరేడ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తొలిసారిగా పరేడ్‌లో భారత త్రివిధ దళాలు, పారామిలటరీ ట్రూప్స్‌కు మహిళా సైనికులే నేతృత్వం వహించారు.
రిపబ్లిక్ డే పరేడ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్యామెల్ రెజిమెంట్‌ క్యాడెట్లు
గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పరేడ్‌లో మహిళా సైనికుల విన్యాసాలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది దిల్లీలో జరిగే పరేడ్‌లో భారత వైమానిక దళం, నావికా దళం, భారత ఆర్మీ, పారామిలటరీ దళాలు పరేడ్‌లో పాల్గొంటాయి. ఈసారి ఫ్రెంచ్ సైన్యం కూడా పాల్గొంది.

గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న ఫ్రెంచ్ సైన్యం

ఈ ఏడాది పరేడ్‌ ప్రదర్శనలు 'వికసిత్ భారత్', 'భారత్- లోక్‌తంత్ర కీ మాతృక' అనే థీమ్‌ను అనుసరించి జరిగాయి.

గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఉత్తరప్రదేశ్‌ శకటం అయోధ్య రామాలయ నమూనాతో పరేడ్‌లో కనిపించింది.
గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పరేడ్‌లో సంప్రదాయ నృత్య ప్రదర్శన
వీడియో క్యాప్షన్, Soldiers Dairy: ‘నా కథ ఎలా ముగుస్తుందో తెలియదు, నేను ఓడిపోయానని మాత్రం అనుకోవద్దు’

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)