హైదరాబాద్‌లో కార్ రేసులు: స్ట్రీట్ రేసింగ్, ఫార్ములా ఈ రేస్..

ఫొటో సోర్స్, RPPL
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ చుట్టూ రేసింగ్ కార్లు హల్ చల్ చేశాయి.
శని, ఆదివారాలు రెండు రోజులూ ఇక్కడ దేశంలోనే మొదటి స్ట్రీట్ సర్క్యూట్ రేస్ జరిగింది.
రెండో రోజు ఆదివారం చివర్లో జరగాల్సిన కొన్ని పోటీలను సాంకేతిక కారణలతో జరపలేకపోయినట్టు నిర్వాహకులు బీబీసీకి చెప్పారు. మిగిలినవన్నీ సక్రమంగానే జరిగినట్టు చెప్పారు. కొన్ని ప్రమాదాలు, చీకటి పడడం - రెండవ రోజు చివరి షెడ్యూల్ జరపలేకపోవడానికి కారణాలుగా తెలుస్తోంది.
ఇండియన్ మోటార్ స్పోర్ట్స్ కంపెనీ, రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో దేశ విదేశాలకు చెందిన 24 మంది రేసర్లు పాల్గొన్నారు. ఆడ, మగ రేసర్లు కలసి ఇందులో పాల్గొన్నారు.
ఈ నవంబర్, డిసెంబరుల్లో చెన్నైలో ఇంకో రెండు రౌండ్లు జరిగిన తరువాత, స్ట్రీట్ రేసింగ్ ఫైనల్స్ డిసెంబర్ 10, 11 తేదీల్లో హైదరాబాద్లో జరుగుతాయి.
హైదరాబాద్, దిల్లీ, బెంగళూరు, చెన్నై, కొచ్చి, గోవా రేసర్లు కూడా ఇందులో పాల్గొన్నారు.
ఈ రేస్ కోసం హైదరాబాద్ రోడ్లను ప్రత్యేకంగా సిద్ధం చేశారు.
హైదరాబాద్ లో ఇలా స్ట్రీట్ రేస్ లో పాల్గొనడం బావుందని మీడియాతో చెప్పారు నగరానికి చెందిన రేసర్ అనిందిత్ రెడ్డి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
హైదరాబాద్‌లో రేస్ ట్రాక్ ఎక్కడంటే..
భారతదేశంలో రేసింగ్ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది.
ఈ క్రమంలో హైదరాబాద్లో నిర్వహిస్తోన్న ఈవెంట్ కి ప్రేక్షకుల నుంచి స్పందన బాగా వచ్చింది. బుక్ మై షోలో పెద్ద ఎత్తున టికెట్లు కూడా అమ్ముడయ్యాయి.
ఈవెంట్లో రెండు చిన్న కార్ ప్రమాదాలు జరిగాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
శని ఆదివారాల్లో హైదరాబాద్లో జరిగింది ఫ్యూయల్ కార్ రేస్.
ఇందులో ఇప్పుడు మొత్తం 6 టీములు, 12 కార్లు, 24 మంది రైడర్లు పాల్గొన్నారు.
ఇందులో ఐపీఎల్ తరహాలోనే దేశ, విదేశ డ్రైవర్లు కలిపి ఉన్నారు.
చూడటానికి పెద్ద సంఖ్యలో యువత వచ్చారు.
ఫిబ్రవరిలో జరగబోయే ప్రధాన ఈవెంటికి టెస్టింగ్ లాగా ఈ ఈవెంట్ ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెప్పారు.
దీనికోసం హుస్సేన్ సాగర్ చుట్టూ పెద్ద ఎత్తున పనులు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం.
కొత్త రోడ్లు కావల్సిన ప్రమాణాలతో వేశారు. 320 కిమీ వేగంతో కారు వెళ్లేలా రోడ్లు వేశారు. చెట్లను తొలగించారు.
ఈ రేసింగ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ - సచివాలయం - ఎన్టీఆర్ ఘాట్- ఐమాక్స్, యూటర్న్, ఎన్టీఆర్ మార్గ్ - లుంబినీ – మీదుగా సాగింది.
పాల్గొన్న వారికీ, ప్రేక్షకులకీ, సిబ్బందికీ ఏమీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచారు.
ఈ కథనంలో Facebook అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Facebook కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Facebook ముగిసింది
ఫిబ్రవరిలో మెయిన్ ఫార్ములా ఈ రేస్
నిజానికి ప్రస్తుతం జరుగుతోన్న రేస్ ఇండియన్ రేస్ లీగ్ ఆధ్వర్యంలోనిది.
అంతర్జాతీయ ప్రధాన ఫార్ములా ఈ వాల్డ్ చాంపియన్షిప్ ఈ ప్రిక్స్ ఫిబ్రవరిలో జరగనుంది.
ఫిబ్రవరి 11న జరగబోయే ఈ ఈవెంట్ భారతదేశంలోనే మొదటిది.
దీని ఏర్పాట్లు ఇండియన్ రేసింగ్ లీగ్, తెలంగాణ ప్రభుత్వం తరపున హెచ్ఎండీఎలు చూస్తున్నాయి.
ప్రధాన ఈవెంట్ ని ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ నిర్వహిస్తుంది. గ్రీన్ కో కంపెనీ కూడా ఈ ఈవెంటులో భాగస్వామిగా ఉంటోంది.
2022 జనవరిలోనే దీనికి సంబంధించి ఒప్పందం జరిగింది.
భారతదేశంలో గతంలో 2011-13 మధ్య నోయిడాలో ఫార్ములా వన్ రేసింగ్ జరగ్గా, ఈ సారి ఎలక్ట్రిక్ కార్లతో ఫార్ములా ఈ రేసింగ్ జరగబోతోంది.
దీనికోసం ఐమాక్స్ దగ్గర 11 ఎకరాల ప్రత్యేక స్థలం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు 200 చెట్లను తొలగించారు.
ప్రధాన రేస్ లో గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్లు రేసులో పాల్గొంటాయి.
ప్రపంచవ్యాప్తంగా క్వాలిఫై అయిన డ్రైవర్లు దీనిలో పాల్గొంటారు.
ఇందుకోసం నక్లెస్ రోడ్లోని 2.37 కిలోమీటర్ల రోడ్డును ప్రత్యేకంగా సిద్ధం చేశారు.
వివిధ దేశాలకు చెందిన 11 టీములకు చెందిన 22 మంది డ్రైవర్లు ఈ రేసులో పాల్గొంటారు.
ఈవెంట్ కోసం మంత్రి కేటీఆర్, మహీంద్ర గ్రూపు అధినేత ఆనంద్ మహీంద్ర వంటి వారు స్వయంగా సభ్యులుగా కమిటీలు ఏర్పడి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఫార్ములా వన్ vs ఫార్ములా ఈ
కార్ రేసింగ్ అందరికీ తెలిసిందే.
ఫార్ములా వన్ పేరుతో అంతర్జాతీయంగా కార్ రేస్ పోటీలు జరుగుతూ ఉంటాయి.
అయితే పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాలు కాకుండా కరెంటుతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలతో రేస్ చేయడమే ఫార్ములా ఈ ప్రత్యేకత.
అటు రేసింగ్ తో పాటూ ఇటు ఎలక్ట్రిక్ కార్ల ద్వారా సుస్థిర రవాణాను ప్రోత్సహించడం వీటి ఉద్దేశం.
2014 బీజింగ్ ఒలంపిక్స్ గ్రౌండ్ దగ్గర మొట్టమొదటి ఫార్ములా ఈ జరిగింది.
ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ సంస్థ ఫార్ములా ఈ కి కూడా వాల్డ్ ఛాంపియన్షిప్ హోదా ఇచ్చింది.
భారతదేశానికి చెందిన మహీంద్రా ఆటోమొబైల్స్ సంస్థ ఫార్ములా ఈ ప్రారంభం అయినప్పటి నుంచీ తన టీమ్ ని రంగంలోకి దించుతోంది.
వాస్తవానికి దిరియా, మొక్సికో సిటీ, బెర్లిన్, మొనాకో, రోమ్, లండన్, జకార్తా, సియోల్ వంటి నగారాల్లో ఈ పోటీ ఏటా జరుగుతాయి.
2023లో కొత్తగా భారతదేశం నుంచి హైదరాబాద్, బ్రెజిల్ నుంచి సావో పాలో నగరాలు ఈ జాబితాలో చేరే ప్రయత్నంలో ఉన్నాయి.
ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ నగరం మధ్యలో ఉన్న హుస్సేన్ సాగర్ దగ్గర ఈవెంట్ నిర్వహించడంతో ట్రాపిక్ ఆంక్షలు పెట్టారు.
సాగర్ చుట్టూ ఉన్న రోడ్లపై వాహనాలు అనుమతించలేదు.
దీంతో ఆ ప్రభావం దాదాపు ఐదారు కిలోమీటర్ల వరకూ కనిపించింది.
సాగర్ చుట్టూ ఐదారు కిలోమీటర్ల పరిధిలోని రోడ్లపై భారీ ట్రాఫిక్ జాం జరిగింది.
ఇటువంటి ఈవెంట్లు నగర శివార్లలో నిర్వహిస్తే బావుంటుందని పలువురు సోషల్ మీడియాలో అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- సూర్యకుమార్ యాదవ్ ‘వీడియో గేమ్ ఇన్నింగ్స్’.. అంతర్జాతీయ టీ20ల్లో రెండో సెంచరీ
- పాడైపోయిన అవయవాలు మళ్లీ పుట్టుకొచ్చాయి.. కుష్టువ్యాధి బ్యాక్టీరియాతో..
- ‘మనుషులు చంద్రుడి మీద జీవిస్తారు.. మరో 10 సంవత్సరాల్లోనే ఇది సాధ్యమవుతుంది’
- జ్ఞాపకశక్తి: ఏం తింటే పెరుగుతుంది, ఎలాంటి ఆహారాలతో దెబ్బతింటుంది?
- ‘నా ఉద్యోగం పోయింది, ఇప్పుడు నేనేం చేయాలి’-అమెరికాలో జాబ్ కోల్పోయిన భారతీయ టెక్కీల ఆవేదన
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














