అమరావతి ఫార్ములా వన్ రేసింగ్: విజేత అబుదాబి జట్టు

- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణానదిలో ఫార్ములా వన్ బోట్ రేసింగ్ పోటీలు ముగిశాయి.
ఈ ఫార్ములా వన్ హెచ్2ఓ రేస్‌లో అబుదాబి రేసర్ షాన్ టెరెంటో విజేతగా నిలిచారు.
రెండో స్థానంలో స్ట్రోమెయి ఎరిక్, మూడో స్థానంలో ఎరిక్ స్టార్క్ నిలిచారు.
అమరావతి జట్టు తరఫున పోటీలో నిలిచిన స్వీడన్‌కు చెందిన రేసర్ జోనస్ ఆండర్సన్ చివరివరకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ 33వ రౌండ్‌లో ఆయన బోటు సాంకేతిక కారణాలతో నిలిచిపోవడంతో ఆయన పోరాటం ముగిసింది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
రెండో రోజు పోటీలు ప్రిలిమినరీ రౌండ్లతో ప్రారంభం కాగా అమరావతి టీమ్ దూకుడుచూపింది.
క్వాలిఫైడ్ రౌండ్లలో తొలి పోటీలో అమరావతి టీం రేసర్ జోనస్ ఆండర్సన్ మొదటి స్థానంలో నిలిచారు.
రెండో పోటీలో జోనస్ ఆండర్సన్ ఆరో స్థానంతో సరిపెట్టుకున్నారు.
తుది పోటీల్లో సాంకేతిక కారణాలతో బోటు నిలిచిపోవడంతో రేస్ పూర్తి చేయలేకపోయారు.
రేస్‌లో మొత్తం 19 బోట్‌లు పాలుపంచుకున్నాయి. అమరావతి టీంకు చెందిన జోనస్ ఆండర్సన్, ఎడిన్ ఎరిక్‌లు 5, 19వ స్థానాల్లో నిలిచారు.
అబుదాబిలో జరిగే ఫైనల్‌లో విజయం సాధించడమే తన లక్ష్యమని అమరావతి ఫార్ములా వన్ రేసింగ్ విజేత షాన్ టెరొంటో అన్నారు. ఈ ఏడాది జరిగిన రేస్‌లలో మూడుసార్లు షాన్ మొదటి స్థానంలో నిలిచారు.
కాగా, తొలి మూడు స్థానాల్లో రెండు అబుదాబి రేసర్లకు దక్కాయి. నార్వేకి చెందిన మహిళా రేసర్ స్ట్రోమెయి ఎరిక్ రెండో స్థానంలో నిలిచి అందరినీ ఆకట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి.
- విశ్లేషణ: 2019 ఎన్నికలపై కర్ణాటక ప్రభావమెంత?
- నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇస్తున్న సంకేతాలేంటి?
- కర్ణాటక ఫలితాలపై మోదీ, రాహుల్ ఇద్దరూ పరేషాన్.. ఎందుకు?
- చైనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
- ఆంధ్రా, తెలంగాణ, తృతీయ ఫ్రంట్లపై కర్ణాటక ఫలితాల ప్రభావం ఎంత?
- దీపావళి హరిత టపాసులు: ‘ధర తక్కువ.. మోత ఎక్కువ.. పైగా కాలుష్యం లేకుండా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








