దిల్లీ మద్యం కేసు: కవితను 9 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ.. 16న మళ్లీ విచారణకు పిలుపు

కల్వకుంట్ల కవిత

ఫొటో సోర్స్, ANI

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం 9 గంటల పాటు విచారించింది.

శనివారం ఉదయం 11 గంటలకు మొదలైన రాత్రి 8 తరువాత ముగిసింది.

మార్చ్ 16న మరోసారి విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు ఇచ్చినట్లు చెప్తున్నారు.

దిల్లీ మద్యం విధానంలో అవకతవకల కేసులో భాగంగా దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఆమెను విచారించారు.

kavitha

ఫొటో సోర్స్, Getty Images

కవిత విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్దసంఖ్యలో దిల్లీ చేరుకున్నారు.

కవిత సోదరుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్.. మరో మంత్రి, సమీప బంధువు అయిన హరీశ్ రావు, మరికొందరు బీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు దిల్లీ వచ్చారు.

ఆమె విచారణకు వెళ్లడానికి ముందే శనివారం ఉదయం నుంచే దిల్లీలోని కేసీఆర్ నివాసం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు చేరారు.

దీంతో పరిస్థితులు అదుపుతప్పకుండా కేంద్ర బలగాలు అక్కడ కట్టుదిట్టమైన భద్రత చేపట్టాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

మరోవైపు కవితను కేంద్రంలోని బీజేపీ వేధిస్తోందని.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు బీజేపీలో చేరిన తరువాత వారిపై కేసులు మాఫీ అయిపోయాయన్న అర్థంలో హైదరబాద్ నగరంలో పోస్టర్లు ఏర్పాటుచేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు.

నారాయణ్ రాణె, హిమంత బిశ్వ శర్మ, జ్యోతిరాదిత్య సింథియా, సుజన చౌదరి వంటివారి ఫొటోలతో ఈ పోస్టర్లు ఏర్పాటు చేసి అందులో కవిత ఫొటో కూడా పెట్టి ‘ట్రూ కలర్స్ నెవర్ ఫేడ్’ అంటూ రాశారు.

మనీశ్ సిసోడియా

ఫొటో సోర్స్, Getty Images

కాగా దిల్లీ మద్యం విధానం కేసులో ఇప్పటికే ఆప్ నేత మనీశ్ సిసోడియాను ఈడీ విచారించడంతో పాటు అరెస్ట్ చేసింది.

అప్పటికి దిల్లీ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా, వివిధ శాఖలకు మంత్రిగా ఉన్న ఆయన ఆ తరువాత వాటన్నిటికీ రాజీనామా చేశారు.

కవితను విచారించడానికి ముందు మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైను సోమవారం రాత్రి ఈడీ అరెస్ట్ చేసింది. శనివారం కవితను విచారించినప్పుడు అరుణ్ రామచంద్ర పిళ్లైనూ విచారించారు.

ఈ మొత్తం కుంభకోణంలో అరుణ్ రామచంద్ర పిళ్లై కీలక పాత్ర పోషించారని.. సౌత్ గ్రూప్ బృందం ఏర్పాటు చేయడంలో, ముడుపులు చెల్లించడంలో ఆయనే కీలకమని ఈడీ ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ చెప్పింది.

ఈ సౌత్ గ్రూప్‌లో ఎమ్మెల్సీ కవిత, అరబిందో గ్రూప్ ప్రమోటర్ శరత్ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మరికొందరు ఉన్నారని ఈడీ చెప్తోంది. ఈ సౌత్ గ్రూప్‌ను అరుణ్ రామచంద్రపిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు ప్రతినిధులుని ఈడీ తెలిపింది.

సౌత్ గ్రూప్‌గా పేర్కొంటున్న ఈ బృందంలోని నాయకులు, ఇతర వ్యక్తులకు.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఒక నాయకుడికి మధ్య సమన్వయం చేసే పనంతా అరుణ్ పిళ్లై చూశారని ఈడీ అభియోగాలలో ఉంది. దిల్లీలో సౌత్ గ్రూప్ మద్యం వ్యాపారం చేయడానికి వీలుగా డబ్బులు చెల్లించడంలోనూ పిళ్లై కీలకంగా వ్యవహరించారని ఈడీ విచారణలో వెల్లడైనట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్లు ముడుపులు అందాయని ఈడీ చెప్పింది.

అరుణ్ రామచంద్ర పిళ్లై

ఫొటో సోర్స్, PC: Twitter/@pillaiarp

దిల్లీ మద్యం వ్యాపారంలో ఎల్1 లైసెన్స్ పొందిన ఇండో స్పిరిట్స్ కంపెనీలో పిళ్లైకు 32.5 శాతం వాటా ఉంది.

ఈ కంపెనీలో ప్రేమ్ రాహుల్‌కు 32.5 శాతం, ఇండో స్పిరిట్స్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ కంపెనీకి 35 శాతం వాటాలున్నాయి.

ఇండోస్పిరిట్స్‌లో వాటాలున్న అరుణ్ పిళ్లై, ప్రేమ్ రాహుల్‌లు కవిత, మాగుంట శ్రీనివాసులరెడ్డిలకు బినామీలన్నది అభియోగం.

ఈ కేసులో సీబీఐ కొద్దినెలల కిందట 2022 డిసెంబరులో కవితను విచారించింది.

ఈ కేసుకు కారణమైన దిల్లీ మద్యం అమ్మకాల విధానాన్ని 2021లో దిల్లీ అసెంబ్లీ ఆమోదించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

ఈ మద్యం విధానంలో అక్రమాలు జరిగాయని ప్రస్తావిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు సిఫారసు చేశారు.. దీంతో సీబీఐ 2022లో కేసు నమోదు చేసింది.

అనంతరం ఆప్ ప్రభుత్వం ఈ పాలసీని ఉపసంహరించుకుంది.

ఎక్సైజ్ శాఖ అధికారులు, మద్యం కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు, డీలర్లు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు, ఆప్ నేత మనీశ్ సిసోడియాపైనా సీబీఐ కేసు పెట్టింది.

అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కుంభకోణంపై దర్యాప్తు ప్రారంభించింది. అందులో భాగంగానే ఒక్కొక్కరినీ విచారిస్తూ వస్తోంది. ఇప్పటికే మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లైలను అరెస్ట్ చేసిన ఈడీ తాజాగా కవితను సుదీర్ఘంగా విచారిస్తోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

మరోవైపు కవితను ఈడీ విచారిస్తుండడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహిస్తున్నారు. సీబీఐ, ఈడీలు ప్రధాని మోదీ జేబు సంస్థలుగా మారి పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

కవిత విషయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపైనా బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. సంజయ్‌ను అరెస్ట్ చేయాలంటూ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయ, ఇతర మహిళా నాయకులు రాజ్‌భవన్ వద్ద నిరసన తెలిపారు.

బండి సంజయ్ వ్యాఖ్యలపై గవర్నరుకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే అపాయింటుమెంట్ ఇవ్వలేదని ఆరోపిస్తూ రాజ్‌భవన్ వద్ద నిరసన తెలిపారు.

పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడున్న బారికేడ్లకు వినతిపత్రాలు అతికించి వెళ్లారు.

బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు పెడుతున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 504, 509 ప్రకారం కేసు పెట్టారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు పెడుతున్నారు.

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 504, 509 ప్రకారం కేసు పెట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)