బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది? ఇప్పుడు కొనడం మంచిదా, అమ్మడం మంచిదా?

గోల్డ్ రేట్స్

ఫొటో సోర్స్, GETTY IMAGES

బంగారం ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం గ్రాము బంగారం ధర 7 వేల పైమాటే. ఈ సమయంలో బంగారం కొనడం మంచిదా, అమ్మడం మంచిదా? బంగారాన్ని నగల రూపంలో కొనడం బెటరా, లేదంటే బాండ్స్ కొనడం ఉత్తమమా? బంగారం ధరలు పెరుగుతూనే ఉండటానికి కారణమేంటి, ధరలు ఎప్పుడు తగ్గుతాయి?

భారత్‌లో బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావిస్తుంటారు.

బంగారం కొనుగోలులో సామాజిక, సాంస్కృతిక కారణాలు ఇమిడి ఉన్నా అంతిమంగా దానిని పెట్టుబడిగానే చూస్తారు.

ఇటీవల కాలంలో బంగారం ధరలు ఆకాన్నంటుతున్నాయి.

ధర పెరుగుదలతో పోల్చుకున్నప్పుడు, ధర తగ్గడం స్వల్పంగా ఉంది.

ఆర్థిక అనిశ్చితి, స్టాక్‌మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా ఇప్పుడు ముదుపర్లందరూ బంగారాన్ని భద్రమైన పెట్టబుడి సాధనంగా చూస్తున్నారు.

బంగారం ధరలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?

మద్రాస్ గోల్డ్ జ్యుయలర్ అండ్ డైమండ్ మర్చంట్స్అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సనత్ కుమార్ బంగారం ధరల పెరగుదలకు కారణాలను వివరించారు.

ధరల పెరుగుదల వెనుక అంతర్జాతీయ పరిణామాలు దాగి ఉంటాయి.

ప్రపంచ ప్రధాన మార్కెట్లతో లండన్ బులియన్ మార్కెట్ ఒకటి.

బంగారం ధరలను నిర్ణయించేది ఈ మార్కెట్టే.

పెద్ద పెద్ద మైనింగ్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు ఈ సంస్థలో ఉన్నారు.

ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుతోంది.

ఇక్కడ ఓ ట్రాయ్ ఔన్స్ బంగారం 31.1 గ్రాముకు సమానం.

దీని ధర డాలర్లలో నిర్ణయిస్తారు.

ఒక ట్రాయ్ ఔన్స్ బంగారం 1,800 డాలర్ల నుంచి 1900 మధ్యన ఉంటుంది.

ప్రస్తుతం ఈ ధర 2,256 డాలర్ల వద్ద ఉంది.

ఇది డిసెంబర్ 2023 నాటి గరిష్ఠ ధర 2,135 డాలర్లతో పోల్చుకుంటే 8శాతం ఎక్కువ.

అమెరికన్ డాలర్ విలువ భారతీయ కరెన్సీలో 83 రూపాయల 40 పైసలు.

భారత్‌లో బంగారం ధరలు పెరగడానికి ఇది కూడా ఒక కారణం.

దీంతోపాటు దిగుమతి సుంకం, యుద్ధ వాతావరణం కూడా కారణాలు.

ఏటా భారత్ 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది.

స్విజ్జర్లాండ్, దక్షిణాఫ్రికా, దుబాయ్ మొదలైన దేశాల నుంచి బంగారం దిగుమతి అవుతుంది.

అమెరికాలో ఆర్థిక సంక్షోభం కూడా ధరల పెరుగుదలకు మరో కారణం.

అక్కడి ఉపాధి సూచీ నేలచూపులు చూస్తోంది.

స్థిరాస్థి వ్యాపారం చతికిలపడుతోంది.

స్టాక్ మార్కెట్‌లో అభివృద్ధి కనిపించడం లేదు.

అక్కడ ద్రవ్యోల్బణం ఉంది.

ఇలా బంగారం ధర పెరుగుదలకు అనేక కారణాలు ముడిపడి ఉన్నాయి.

గోల్డ్ రేట్స్

ఫొటో సోర్స్, GETTY IMAGES

బంగారం అంటే ఆస్తి

చేతిలో డబ్బులు ఉన్నప్పుడు బంగారం కొనేయమని చెబుతుంటారు.

అయితే స్వల్పకాలిక పెట్టుబడి కింద బంగారాన్ని కొనుగోలుచేయడం అంత మంచి ఆలోచన కాదు.

దీర్ఘకాలిక అవసరాల కోసం ధరలు పెరుగుతున్నా బంగారం కొనడమం మంచిదే.

భారతీయులు అంతకంతకూ బంగారాన్ని కొంటూనే ఉంటారు.

బ్యాంకులో చేసే పొదుపుపై వడ్డీరేట్లు తక్కువగా ఉంటున్నాయి.

చాలామంది బంగారంలో పెట్టుబడి పెట్టడానికి కారణం అది సురక్షితమైనదని భావించడమే.

దీనివల్ల బంగారానికి డిమాండ్ పెరిగి, దాని ధర పెరుగుతోంది.

గోల్డ్ ధరల పెరుగుదలకు సంబంధించి అనేక ప్రశ్నలకు పెట్టుబడి సలహాలు ఇచ్చే సతీష్‌కుమార్ సమాధానమిచ్చారు.

‘‘అమెరికాలో ద్రవ్యోల్బణం బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం. జనవరిలో విడుదలైన నివేదిక మేరకు అమెరికా ద్రవ్యోల్బణం రేటు 3.1 శాతం. అమెరికా ఫెడరల్ రిజర్స్ లక్ష్యమైన 2 శాతం కంటే ఇది ఇంకా ఎక్కువగానే ది. బంగారం రేట్లు పెరగడానికి ఇదో ముఖ్య కారణం’’ అని చెప్పారు సతీష్ కుమార్.

ధరలు పెరుగుతున్నా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి కారణమేంటనే ప్రశ్నకు బంగారమనేది ఓ సురక్షితమైన పెట్టుబడి మార్గంగా రుజువైంది.

భారత్ సహా ఆసియా దేశాలలో బంగారాన్ని ఆస్తిగా చూస్తారు.

కానీ మిగిలిన ఇతర దేశాలలో బంగారాన్ని పెట్టుబడిగా చూస్తారు.

గోల్డ్ రేట్స్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ధరలు పెరిగినప్పుడు బంగారం అమ్మొచ్చా?

ధరలు పెరుగుతున్నప్పుడు చాలామంది బంగారం అమ్మొచ్చా అనే ప్రశ్న అడుగుతుంటారు. కానీ ఇది మంచి పని కాదు.

స్టాక్ మార్కెట్‌లో షేర్ల ధరలు పెరిగినప్పుడు వాటిని అమ్మేస్తాం.

కానీ బంగారాన్ని అలా చూడలేం.

మరికొంత కాలం వేచి చూడటమనేది మంచి ఫలితాలను ఇస్తుంది.

బంగారం ధరల పెరుగుదల కొనసాగుతుందా?

గత 20 ఏళ్ళ కాలాన్ని గమనిస్తే బంగారం ధరలు క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి.

దీనికి కారణం దాని డిమాండ్ కూడా పెరుగుతుండటమే.

అమెరికా ఫెడరల్ రిజర్వ్స్ వడ్డీ రేట్లు పెంచుతామని ప్రకటించింది.

చాలామంది ఫెడరల్ రిజర్వ్స్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని భావించారు.

అమెరికాలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది.

డోనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఊహిస్తున్నారు.

ఇలాంటి రాజకీయ పరమైన మార్పులు కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమవుతాయి.

అలాగే ద్రవ్యోల్బణం కొనసాగి, గోల్డ్ రేట్ల పెరుగుదలకు కారణమవుతోంది.

బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది?

బంగారం ధరల పెరుగుదల 2025 వరకు కొనసాగుతుందని జేపీ మోర్గాన్ లాంటి అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థలు అంచనా వేస్తున్నాయి.

ఏ రూపంలో పెట్టుబడి ఉత్తమం?

గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడి ఉత్తమం.

మీరు నగలు లేదా, బంగారు నాణాలు కొనుగోలు చేస్తే, మొత్తం ధరలో తరుగు, కమిషన్ కింద 20శాతం పోతుంది.

అంటే మీరు 100 రూపాయల బంగారాన్ని కొనుగోలుచేస్తే దాని అసలు విలువ 80 రూపాయలేనన్నమాట.

అదే మీరు గోల్డ్ బాండ్ కోనుగోలు చేస్తే నెలానెలా వడ్డీ కూడా వస్తుంది.

దీనికితోడు బంగారు నగలను కాపాడుకోవడం కూడా కష్టం.

అదే గోల్డ్ బాండ్స్ అయితే పోతాయనే భయం ఉండదు.

ఎవరైనా గరిష్ఠంగా నాలుగు కేజీల విలువైన గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు.

పైగా ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.

గోల్డ్ బాండ్స్ కింద లభించే బంగారం 24 కారెట్ల నాణ్యతతో ఉంటుంది.

మీరు బంగారానికి బదులుగా బాండ్స్ కొనుగోలుచేస్తే మీరు గ్రాముకు 50 రూపాయల చొప్పున తక్కువ ఖర్చు చేసిన వారవుతారు.

వీడియో క్యాప్షన్, బంగారం ఇప్పుడు కొనడం మంచిదా, అమ్మడం మంచిదా?

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)