తిరగబడరా సామీ రివ్యూ: రాజ్ తరుణ్ సినిమా ఎలా ఉంది?

తిరగబడరా సామీ

ఫొటో సోర్స్, AS RAVIKUMAR CHOWDARY/X

    • రచయిత, శృంగవరపు రచన
    • హోదా, బీబీసీ కోసం

రాజ్ తరుణ్ వరుస సినిమాల్లో కనిపిస్తున్నారు. జనవరిలో నా సామిరంగలో నాగార్జున, అల్లరి నరేష్‌లతో కనిపించిన ఆయన ఇటీవలే పురుషోత్తముడు సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. తాజాగా తిరగబడరా సామీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా..

తమ వారి నుంచి తప్పిపోయిన వారిని, కనిపించకుండా పోయిన వారిని వారి కుటుంబాలతో కలపడమే గిరి (రాజ్‌తరుణ్) వృత్తి.

అనాథ అయిన గిరి , మరో అనాథ అయిన శైలజను పెళ్ళి చేసుకుంటాడు.

ఆ శైలజ ఎవరు? ఆమెను వెంటాడిన ప్రమాదం ఏంటి?

ఆమెను గిరి ఎలా కాపాడాడు? అన్నదే తిరగబడరా సామీ కథ.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఎవరు ఎలా నటించారంటే..

గిరి పాత్రలో క్లాసీనెస్‌ను, అమాయకత్వాన్ని రాజ్ తరుణ్ చక్కగా పోషించాడు. శైలజ పాత్రలో మల్వి మల్హోత్రా ఫుల్‌జోష్‌తో కనిపించింది. వీరిద్దరి నటన స్క్రీన్ మీద బాగా పండింది.

ఈ సినిమాలో విలన్ గా కొండారెడ్డి పాత్రలో మకరంద్ దేశ్‌పాండే నటించారు.

ఈ విలన్ కేరెక్టర్‌ను 'రాధాబాయ్' అనే పాత్ర ఎలివేట్ చేస్తుంది.

కానీ కొండారెడ్డి డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ప్రతినాయక బలానికి తగ్గ స్థాయిలో లేదు.

సన్నివేశాలు బావున్నా ఎందుకో ఈ పాత్రమకరంద్ దేశ్ పాండే‌కి నప్పినట్టు అనిపించదు.

రాధాబాయ్ పాత్రలో నటించిన మన్నారా చోప్రా ఆకట్టుకున్నారు.

ఇక రఘు బాబు నటన పర్లేదనిపించింది.

సంగీతం:

లవ్ -యాక్షన్ ప్యాక్‌డ్ సినిమాగా వచ్చిన 'తిరగబడరా సామీ'కి జె.బి చక్కటి సంగీతం అందించారు.

‘ఒక పూల మేఘమే', 'చాలా బావుందే ', సెలబ్రేషన్ సాంగ్ పర్లేదనిపించాయి.

రాధా బాయ్ పాట ఎనర్జెటిక్ గా ఉంది.

తిరగబడరా సామీ

ఫొటో సోర్స్, Aditya Music/FB

బలాలు,బలహీనతలు

ప్లస్సులు

హీరో పాత్ర వృత్తి రీత్యా మంచి ఎమోషన్ ను ఎస్టాబ్లిష్ చేయడం ప్లస్ పాయింట్.

రాజ్ తరుణ్, మల్వి మల్హోత్రా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ప్లస్ పాయింట్.

రఘుబాబు బృందం కామెడీ కూడా పర్లేదనిపించేలా ఉంది.

క్లైమాక్స్ లో కొంత ఫాస్ట్ పేసింగ్ లో యాక్షన్ తో కథ నడవటం ఒక ప్లస్ పాయింట్.

మైనస్సులు:

థ్రిల్లింగ్ శైలిలో ఓపెన్ అయిన సినిమా ఇంటర్వెల్ వచ్చేసరికి ప్రేక్షకులకు కథ అర్ధమైపోవడం మైనస్ పాయింట్.

విలన్ పాత్ర బలంగా లేకపోవడం మరో మైనస్ పాయింట్.

సెకండ్ హాఫ్‌లో లాగింగ్ ఎక్కువకావడం. స్క్రీన్‌ప్లే బలహీనంగా ఉండటం.

స్ట్రాంగ్ కేరెక్టర్స్ అన్ని హాస్య పాత్రలుగా మారిపోవడం .

సినిమాటోగ్రఫీ :

లవ్ -యాక్షన్ జోనర్ లో వచ్చిన ఈ సినిమాకు చక్కటి కలర్‌ఫుల్ స్క్రీన్ స్పేస్ ఇవ్వడంతో సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యింది.

టైటిల్ కి జస్టిఫికేషన్ జరిగిందా?

భార్య కోసం పిరికివాడిగా ఉన్న గిరి (రాజ్ తరుణ్) తన కేరెక్టర్ కు భిన్నంగా ధైర్యవంతుడుగా బలవంతుడైన విలన్ మీద తిరగబడటమే ఈ టైటిల్ థీమ్.

కానీ గిరి పాత్రలో అలాంటి మార్పు ఏదీ కనిపించకపోవడం వల్ల టైటిల్ కి తగ్గ పవర్ సినిమాలో కనిపించదు.

గిరి పాత్రలానే కొండారెడ్డి పాత్ర కూడా సెకండ్ హాఫ్‌లో తేలిపోయింది.

హీరో -విలన్ ఇద్దరూ పవర్‌ఫుల్‌గా ఉండకపోవడంతో టైటిల్‌కి తగ్గ పవర్ సినిమాలో కనిపించదు. ఇది కూడా సినిమాకు మైనస్ పాయింట్ అయ్యింది.

మొత్తం మీద ఈ సినిమా ఫస్ట్ హాఫ్ పర్లేదనిపించింది. కానీ సెకండ్ హాఫ్‌లో కొంత వెకిలి హాస్యంతో క్యారెక్టర్స్ బలహీనమై, కథతో సంబంధం లేని ఎలిమెంట్స్ కూడా కలిసి కలగాపులగమైపోయాయి.

సాధారణ స్టోరీ లైన్ కు కొత్త ఎలిమెంట్‌ను, యాక్షన్ ఎలిమెంట్‌ను జోడించి వచ్చినా బలహీనమైన పాత్రలు-స్క్రీన్ ప్లే వల్ల ‘‘తిరగబడరా సామీ’’ ప్రేక్షకులను నిరాశపరిచింది.

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)