జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన చిత్రాలను విడుదల చేసిన నాసా.. విశ్లేషిస్తున్న శాస్త్రవేత్తలు

స్పైరల్ గెలాక్సీ

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, జేడబ్ల్యూఎస్‌టీలోని ఇన్‌ఫ్రారెడ్ పరికరాల వల్ల గ్యాస్, ధూళి నారింజ, ఎరుపు రంగుల్లో కనిపిస్తాయి.
    • రచయిత, గాల్యా దిమిత్రోవా
    • హోదా, బీబీసీ న్యూస్

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (జేడబ్ల్యూఎస్‌టీ) తీసిన19 స్పైరల్ గెలాక్సీలకు సంబంధించిన ఫోటోలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) విడుదల చేసింది.

ఈ ఫొటోలను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

రెండేళ్ల క్రితమే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను అంతరిక్షంలోకి పంపారు.

గతంలో హబుల్ టెలిస్కోప్ ద్వారా సేకరించే ఫొటోల కన్నా కూడా మరింత స్పష్టంగా, ఎక్కువ దూరంలో ఉన్న వాటిని కూడా స్పష్టంగా చిత్రాల్లో బంధించే సామర్థ్యం జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌కు ఉంది.

గెలాక్సీ

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, జేడబ్ల్యూఎస్‌టీ టెలిస్కోప్ ఇప్పటికే లక్షల కొద్దీ నక్షత్రాల చిత్రాలను క్యాప్చర్ చేసింది.

ఆ ఫోటోలు అత్యద్భుతంగా ఉన్నాయని, ఖగోళ పరిశోధకులు, ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలకు ఇవి కొత్త సవాల్‌ను విసురుతున్నాయని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తెలిపింది.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన పరిశోధకులు థామస్ విలియమ్స్ నేతృత్వంలో నాసా విడుదల చేసిన ఫోటోల నుంచి డేటాను సేకరిస్తున్నారు.

కొత్త చిత్రాల్లోని సమాచారం అపారమని అన్నారు థామస్ విలియమ్స్.

“నక్షత్రాలు, గెలాక్సీల పరిణామ క్రమం పట్ల ఇప్పటివరకు తెలుసుకున్న సమాచారం నుంచి తలెత్తిన ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు, మరింత సమాచారం తెలుసుకునేందుకు మార్గం దొరికింది” అన్నారు.

స్పైరల్ గెలాక్సీ

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, ఎన్‌జీసీ 4254 చిత్రంలో స్పైరల్ గెలాక్సీ చిత్రాన్ని చూడొచ్చు.

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అందిస్తోన్న సమాచారాన్ని విశ్లేషించే వీలు కలగడం ప్రత్యేకంగా ఉందని, అదే సమయంలో సమాచార విశ్లేషణ సవాళ్లతో కూడుకున్నదని అన్నారు.

“ఈ చిత్రాలను చూస్తుంటే, అవి వాటి గురించి చెప్పుకుంటున్నట్లే అనిపిస్తోంది” అన్నారు.

ఫిజిక్స్ ఎట్ హై యాంగ్యులర్ రిజల్యూషన్ ఇన్ నియర్‌ బై గెలాక్సీస్ (పీహెచ్ఏఎన్‌జీఎస్) ప్రాజెక్టులో భాగమైన శాస్త్రవేత్తలు ఈ చిత్రాలను పోస్ట్ చేశారు.

అంతరిక్షం

ఫొటో సోర్స్, NASA

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)