పెళ్లిలో గన్‌తో కాల్పులు జరిపి పారిపోయిన పెళ్లికూతురు

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తరప్రదేశ్ పోలీసులు ఒక పెళ్లి కూతురు కోసం గాలిస్తున్నారు.
ఆమె తన పెళ్లిలో తుపాకీ కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాతి నుంచి కనిపించకుండా పోయారు.
పెళ్లికూతురు, వరుడి పక్కన కూర్చొని గాల్లోకి నాలుగు రౌండ్ల పాటు కాల్పులు జరుపుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో కనిపించింది.
తుపాకీతో కాల్పులు జరిపిన మహిళపై కేసును నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు చెప్పారు. అప్పటి నుంచి ఆ మహిళ కనిపించట్లేదని తెలిపారు.
ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో వివాహ వేడుకల్లో తుపాకీతో గాల్లోకి కాల్పులు జరుపుతూ సంబరాలు చేసుకుంటారు. అయితే, ఈ తరహా వేడుకలు ప్రమాదవశాత్తు మరణాలు, గాయాలకు కారణం అవుతాయి.
భారతీయ చట్టాల ప్రకారం, ఎవరైనా తుపాకీని నిర్లక్ష్యంగా లేదా వేడుకల్లో సంబరాల రూపంలో కాల్చుతూ ఇతరులను ప్రమాదంలోకి నెడితే వారికి జైలు శిక్ష, జరిమానా లేదా ఈ రెండింటినీ విధించవచ్చు.
సెలెబ్రేటరీ ఫైరింగ్ (వేడుకల కాల్పులు)కు సంబంధించిన ప్రతీ కేసును పోలీసు ఫిర్యాదుతో సంబంధం లేకుండా దర్యాప్తు చేయవచ్చని 2016లో లక్నోకు చెందిన ఒక కోర్టు ఆదేశించింది.
బంధువుల్లో ఒకరు పెళ్లికూతురు, గన్‌ను కాల్చుతున్న వీడియోను రికార్డు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా పత్రిక పేర్కొంది.
అరెస్ట్ చేస్తారనే భయంతో ఆమె పోలీసులకు దొరకకుండా పారిపోయారని టైమ్స్ ఆఫ్ ఇండియాకు పోలీసులు తెలిపారు.
వివాహ ఫొటోల కోసం వధూవరులు పోజులిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు వధువు ముఖంపై గన్ పేలిన ఘటన గత వారం మహారాష్ట్రలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇవి కూడా చదవండి:
- 18మంది మహిళలపై 2 రోజులపాటు అత్యాచారం...30ఏళ్లకు పైగా సాగిన విచారణ
- ఆర్ఈఈ: చైనాలో ఈ ఖనిజం ఉత్పత్తి నిలిచిపోతే అనంతపురం, చిత్తూరు జిల్లాలే కీలకం అవుతాయా?
- 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు
- దెబ్బ తగిలిన ప్రతిసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలా, అసలు ఎప్పుడు అవసరం?
- సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ ఏంటి, టికెట్ ధర ఎంత, ఎక్కడెక్కడ ఆగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















