క్రిస్మస్ ట్రీ ఎన్ని రోజులు ఉంచాలి? ఎప్పుడు తీసేయాలి.. క్రిస్మస్ రోజున టర్కీ కోడిని ఎందుకు తింటారు

ఫొటో సోర్స్, Getty Images
క్రిస్మస్ వచ్చిందంటే చాలు, చాలామంది చాలా ప్రశ్నలతో గూగుల్‌లో వెతికేస్తుంటారు.
అలాంటి కొన్ని ప్రశ్నలకు మేం ఇక్కడ సమాధానాలు ఇచ్చాం.
మీ సందేహాలకూ ఈ సమాధానాలు చదవండి
క్రిస్మస్ సమయంలో టర్కీ కోడిని ఎందుకు తింటారు?
టర్కీ కోళ్లు శరదృతువు అంటే ఆకురాలే కాలం (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) నాటికి పెద్దవిగా పెరుగుతాయి.
ఇవి శీతాకాలంలో తినడానికి బాగుంటాయని చెప్తారు.
సాధారణ కోళ్లు, బాతుల కంటే టర్కీ కోళ్లు పెద్దగా ఉంటాయి.
డైనింగ్ టేబుల్‌పై కూడా నిండుగా, నోరూరించేలా కనిపిస్తాయి.
పాప్ సంస్కృతిలో టర్కీ కోళ్ల ప్రస్తావన ప్రాధాన్యం పెరగడానికి ముందు వరకు బ్రిటన్‌లో క్రిస్మస్ సందర్భంలో బీఫ్ వాడకం ఎక్కువగా ఉండేది. చార్లెస్ డికెన్స్ టర్కీ కోడిని ఇష్టపడేవారు. తన పుస్తకం ''ఎ క్రిస్మస్ కరోల్''లో 1843లో బ్రిటిష్ క్రిస్మస్‌లో భాగంగా టర్కీ గురించి రాశారు. తర్వాత అమెరికన్ టీవీ తన ప్రతి థాంక్స్ గివింగ్ ఎపిసోడ్‌లో దీన్ని రుచికరమైన వంటకంగా చెప్పేది.

ఫొటో సోర్స్, Getty Images
క్రిస్మస్ డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకొంటారు?
ఏసు పుట్టిన రోజు వేడుకగా క్రిస్మస్ నిర్వహిస్తారు. ప్రపంచ సృష్టి జరిగి... దానికి వార్షికోత్సవం జరిగిన 9 నెలల తరువాత ఏసు జన్మించినట్లు ఒక చర్చి చరిత్రకారుడు భావించారు. (దీనిని ఆయన మార్చి 25గా లెక్కించారు) రోమన్లు ఆ వారంలో వింటర్ సన్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. దాన్ని అంతకుముందు ఉన్న క్రైస్తవులు మార్చి ఉండవచ్చు. 1,600 ఏళ్ల క్రితం డిసెంబర్ 25ని అధికారిక రోజుగా చర్చి నిర్ణయించింది. అదే కొనసాగుతోంది.
క్రిస్మస్ 12 రోజులు ఎప్పుడొస్తాయి?
‘క్రిస్మస్ మొదటి రోజు" ఎప్పుడో తెలియదు. ట్వెల్వ్‌టైడ్ లేదా క్రిస్మస్ టైడ్ అని పిలిచే పురాతన క్రైస్తవ సంప్రదాయంపై ఇది ఆధారపడింది.
దీని ప్రకారం క్రిస్మస్ రోజే క్రిస్మస్ మొదటి రోజు, జనవరి 5 చివరి రోజు.
కానీ కొన్ని చర్చిలు మాత్రం బాక్సింగ్ డే నుంచి జనవరి 6 వరకు క్రిస్మస్ రోజులను లెక్కిస్తాయి.
కింగ్ ప్రసంగం ఎప్పుడుంటుంది?
బ్రిటిష్ రాజు/ రాణి 1932 నుంచి ప్రతి క్రిస్మస్ రోజున ప్రజలకు సందేశం ఇస్తారు.
ఈ ఏడాది రాణి మరణించారు. దీంతో కింగ్ చార్లెస్‌కు ఇది మొదటి క్రిస్మస్ సందేశం కానుంది. గత ఏడు దశాబ్దాలలో మొదటి "కింగ్స్ స్పీచ్" ఇదే.
ఇది సాధారణంగా క్రిస్మస్ రోజున రాత్రి 8:30 గంటలకు ఉంటుంది. టీవీ, ఆన్‌లైన్, రేడియోలలో ప్రసారం చేయనున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
క్రిస్మస్ ట్రీ, దాని డెకరేషన్ ఎప్పుడు తీసేయాలి?
కొన్ని సంప్రదాయాలు జనవరి 6 లోపు డెకరేషన్లను తొలగించాలని చెబుతాయి.
దానికి డెడ్ లైన్ కూడా ఉండొచ్చు. క్రిస్మస్ ట్రీలు వాటిని చేసిన నాలుగు వారాల వరకూ ఉంటాయి.
డిసెంబర్ ప్రారంభంలో దాన్ని తెచ్చినట్లయితే జనవరి రెండో వారం వరకు ఉంటుంది.
మిన్స్ పీస్‌లో మాంసం ఉంటుందా?
చాలా మంది ఈ ప్రశ్నను ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు. ఆ వంటకంలో మాంసం ఉండదు.
ఎండు ద్రాక్ష, బాదం వంటి పండ్లు, గింజలతో "మిన్స్ మీట్" తయారు చేస్తారు.
1770 కాలంలో మాంసం వాడేవారు.
నేడు కొన్ని వంటకాలలో జంతువుల కొవ్వుని ఉపయోగిస్తున్నారు.
అందుకే శాఖాహారులు కొనేటపుడు లేబుల్‌లను జాగ్రత్తగా చదవండి.
జపాన్‌లో క్రిస్మస్ సమయంలో కేఎఫ్‌సీని ఎందుకు తింటారు?
జపాన్‌లో క్రైస్తవులు తక్కువ. కాబట్టి క్రిస్మస్ పెద్ద ఎత్తున జరుపుకోరు.
ఓ కథనం ప్రకారం.. 1970లో జపాన్‌లో విదేశీయులకు టర్కీ కోడిని తినే అవకాశం ఉండట్లేదని అక్కడి కేఎఫ్‌సీ మేనేజర్ గ్రహించారు. వారికి చికెన్ మంచి ప్రత్యామ్నాయం అని భావించారు.
ఈ నేపథ్యంలో "కెంటకీ ఫర్ క్రిస్మస్" ప్రచారం చాలా పాపులర్ అయింది. లక్షలాది జపనీస్ కుటుంబాలు దీనిలో పాల్గొంటాయి. ఇది సంప్రదాయంగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
శాంటా ఒక్క రాత్రిలో ప్రపంచవ్యాప్తంగా ఎలా తిరుగుతారు?
శాంటాకు దాదాపు 30 గంటల సమయం ఉంది (టైమ్‌జోన్‌ల ఆధారంగా). కానీ, కోట్లాది మంది పిల్లలకు బహుమతులు అందించాలి.
క్వాంటమ్ మెకానిక్స్ లాంటి వాటితో శాంటాని ఒకే సమయంలో అన్ని ప్రాంతాల్లో ఉంచొచ్చా అంటూ శాస్త్రవేత్తలు రక రకాల సిద్ధాంతాలతో ముందుకు వచ్చారు.
"మాక్రోస్కోపిక్ క్వాంటం కోహెరెన్స్"ని శాంటా వినియోగిస్తున్నారా అని క్వాంటం భౌతిక శాస్త్రవేత్తలకు సందేహం కూడా ఉంటుంది " అని డబ్లిన్ ట్రినిటీ కాలేజ్ ప్రొఫెసర్ గూల్ చెబుతున్నారు.శాంటానే ఒక మాయ అని అంగీకరిస్తే అవన్నీ సిల్లీగా అనిపిస్తాయి.
ఇవి కూడా చదవండి:
- ఒక సీరియల్ కిల్లర్‌ను విడుదల చేయడం ప్రమాదకరం కాదని ఎలా నిర్ణయించారు?
- ఇండియాలో టీనేజ్ సెక్స్ ఎందుకు నేరం? ‘సమ్మతి తెలిపే వయసు’ను తగ్గించాలని కొందరు జడ్జిలు ఎందుకు అంటున్నారు
- భాగల్పూర్ మర్డర్ :‘‘మా అమ్మను గొడ్డలితో జంతువులకన్నా దారుణంగా నరికి చంపాడు’’
- సొరంగం తవ్వి రైలింజిన్‌ను దొంగిలించారా....అసలేం జరిగింది?











