కరోనావైరస్: శరీరంలో వైరస్ కణాలు చనిపోయినా.. టెస్టుల్లో ‘పాజిటివ్’ అని వస్తోందా?

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
- రచయిత, రేచల్ ష్రేయర్
- హోదా, హెల్త్ రిపోర్టర్
కోవిడ్-19 కి చేసే ప్రధానమైన పరీక్ష చాలా సున్నితమైనది. మనకు ఇంతకుముందే వైరల్ ఇంఫెక్షన్ సోకి ఉంటే.. అది తగ్గిన తరువాత కూడా వైరస్ మృత కణాలు శరీరంలో ఉండవచ్చు.
కోవిడ్-19కు చేసే ముఖ్యమైన పరీక్షలో ఈ మృత వైరస్ కణాలను పరిగణనలోకి తీసుకుని 'పాజిటివ్' అని చూపించే అవకాశాలున్నాయని సైంటిస్టులు అంటున్నారు.
శరీరంలో వైరస్ ఒక వారం కన్నా ఎక్కువకాలం సజీవంగా ఉండదు. కానీ కొన్ని వారాల తరువాత కూడా పరీక్షల్లో పాజిటివ్ వస్తోందంటే మృత కణాలను పరిగణనలోకి తీసుకుంటోందనే అర్థం.
కానీ ఇంతకన్నా కచ్చితంగా పరీక్షించే పద్ధతేమిటో స్పష్టంగా తెలియట్లేదని పరిశోధకులు అంటున్నారు.
"పరీక్షా ఫలితాలు పాజిటివ్ లేదా నెగటివ్ అని వెల్లడయ్యే కంటే… ఒక కట్ ఆఫ్ పాయింట్ ఉండి, చాలా కొద్ది మొత్తంలో ఉన్న వైరస్‌ను విస్మరించగలిగేలా పరీక్షలు ఉంటే మనకు మెరుగైన ఫలితాలొస్తాయి" అని పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్ కార్ల్ హెనెఘన్ అభిప్రాయపడుతున్నారు.
ఒకపక్క కోవిడ్-19 కేసులు అధిక సంఖ్యలో పెరుగుతున్నా, ఆస్పత్రిలో చేర్చవలసిన అత్యవసర పరిస్థితులు చాలా తక్కువగానే ఉంటున్నాయంటే మృత వైరస్ కణాల వలన కూడా పరీక్షల్లో పాజిటివ్ రావడమే కారణం కావొచ్చు అని ఆయన అన్నారు.
కరోనావైరస్ పాజిటివ్ వచ్చిన వారినుంచీ సేరించిన వైరల్ కణాలను ఒక పారదర్శక పాత్రలో ఉంచి వైరస్ ఎదుగుతుందా లేదా గమనిస్తారు. మృత కణాలైతే వైరస్ ఎదగదు. సజీవ కణాలైతే వైరస్ వృద్ధి చెందుతుంది. ఇలాంటి పరిశోధనలు జరిపిన 25 అధ్యయనాలను యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లోని సెంటర్ ఫర్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ పరిశోధకులు పరిశీలించారు.
మృత కణాల సమస్య ఉండవచ్చని మొదటినుంచే అనుమానాలున్నాయి. ఇందుకే కోవిడ్ 19 డాటా పూర్తిగా విశ్వసనీయం కాదు. ఈ కారణాల వలన R సంఖ్య గందగోళాన్ని సృష్టిస్తోందని పరిశోధకులు అంటున్నారు.
బహుశా అందుకే ప్రపంచంలో చాలా దేశాల్లో కోవిడ్-19 కేసులు అధికస్థాయిలో ఉన్నా రికవరీ రేటు కూడా అంతే ఎక్కువగా ఉంటోంది.
అయితే అన్ని దేశాల్లోనూ క్రమక్రమంగా వ్యాపారాలు, సాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. పాఠశాలలు, మాల్స్, పార్కులు, మెట్రో రైళ్లు మొదలైనవన్నీ మెల్లిమెల్లిగా తెరుచుకుంటున్నాయి. వైరస్ వ్యాప్తి అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ అది ఎంతవరకూ ప్రమాదకరం అనేది సందేహమే!

ఫొటో సోర్స్, EPA
కోవిడ్ -19 టెస్ట్ ఎలా చేస్తారు?
పీసీఆర్ స్వాబ్ టెస్ట్ ద్వారా వైరస్ ఉందా లేదా నిర్ధారిస్తారు.
స్వాబ్ టెస్ట్ ద్వారా తీసుకున్న నమూనాను ప్రయోగశాలలో అనేకమార్లు పరీక్షించి... నిర్ధారణకు కావలసినంత వైరస్‌ను సేకరిస్తారు.
అయితే అనేక సైకిల్స్‌లో పరీక్షిస్తున్నప్పుడు ఎన్నిసార్లు తక్కువ వైరస్ కలక్ట్ అవుతోంది, ఎన్నిసార్లు ఎక్కువ వైరస్ కలక్ట్ అవుతోందో చెప్పడం కష్టం.
వైరస్‌ను సేకరించడానికి ఎక్కువసార్లు పరీక్షాలు జరపాల్సి వస్తే వైరస్ వృద్ధి చెందే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు.
అయితే కోవిడ్-19 టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ లేదా నెగటివ్ ఫలితాలు వస్తున్నాయిగానీ శరీరంలో ఎంత మోతాదులో వైరస్ ఉంది, అది ప్రమాదకస్థాయిలో ఉందా లేదా కొంచమే ఉందా అనేది తెలియదు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

చాలా ఎక్కువ మోతాదులో వైరస్ ఉన్న వ్యక్తికి, మృత కణాలు లేదా చాలా కొద్ది మొత్తంలో వైరస్ ఉన్న వ్యక్తికీ కూడా పరీక్షలో పాజిటివ్ అనే వస్తుంది.
కట్ ఆఫ్ పాయింట్‌లాంటిది ఉంటే ఫాల్స్ పాజిటివ్ ఫలితాలను నిరోధించవచ్చని ప్రొఫెసర్ హెనెఘన్ అంటున్నారు.
ఫలితంగా పాత వైరస్ మృత కణాల వలన పాజిటివ్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి అంటున్నారు.
దీనివల్ల ఎక్కువమంది క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం ఉండదు. ప్రజల్లో భయాందోళనలు తగ్గుతాయి అని అంటున్నారు.
అయితే కట్ ఆఫ్ పాయింట్ నిర్ణయించడం కష్టమనీ, కొందరు పేషెంట్లలో 8 రోజుల తరువాత కూడా సజీవంగా ఉన్న వైరస్ కణాలు కనిపించాయని, శరీరంలో వైరస్ ఎంతకాలం సజీవంగా ఉంటుందో తేల్చి చెప్పడం కష్టమని, దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందనీ కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకినవారు మీ వీధిలో ఉంటే ఏం చేయాలి... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కోవిడ్-19 నుంచి కోలుకున్నా అనారోగ్యం ఎందుకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- కరోనా వ్యాప్తిలో పిల్లల పాత్ర ఎంత? తాజా అధ్యయనం ఏం చెప్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








