శ్రీలంకను ఐక్యరాజ్యసమితిలో భారత్ ఎందుకు తప్పుపట్టింది, దీనిపై చైనా ఎలా జోక్యం చేసుకుంది?

ఫొటో సోర్స్, Getty Images
కొన్నేళ్ల ముందువరకు పొరుగునున్న శ్రీలంకతో భారత్ సంబంధాలు సవ్యంగానే ఉండేవి. అయితే, పెరుగుతున్న చైనా పెట్టుబడుల వల్ల రెండు దేశాల సంబంధాలు దెబ్బతింటున్నాయి.
గత నెలలో చైనా యుద్ధ నౌక ‘‘యూవాన్ వాంగ్ 5’’ రాకతో రెండు దేశాల మధ్య దూరం మరింత పెరిగింది.
శ్రీలంకలోని హంబన్‌టోట పోర్టుకు ఈ నౌకను తీసుకురావడంపై భారత ప్రభుత్వం బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ, ఈ నౌకను హంబన్‌టోటకు తీసుకొచ్చారు.
ఇప్పుడు తాజాగా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించిన సంకేతాలు కనిపిస్తున్నాయి.
శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ (యూఎన్‌హెచ్‌సీఆర్) వేదికగా భారత ప్రభుత్వం సోమవారం ఆందోళన వ్యక్తంచేసింది.
అయితే, తమిళులకు పూర్తి హక్కులు కల్పించే దిశగా తాము కృషి చేస్తున్నామని శ్రీలంక చెప్పుకొచ్చింది.
మరోవైపు శ్రీలంకకు చైనా మద్దతు పలికింది. భారత్ పేరును ప్రస్తావించకుండానే.. ‘‘ఇది శ్రీలంక అంతర్గత వ్యవహారం. మానవ హక్కుల పేరుతో ఇతరులు జోక్యం చేసుకోకూడదు’’అని చైనా వ్యాఖ్యానించింది.

శ్రీలంక: ముఖ్యాంశాలు

- భారత్ పొరుగునున్న శ్రీలంకకు 1948లో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం వచ్చింది
- శ్రీలంక జనాభా 2 కోట్లు. వీరిలో సింహళ ప్రజలది మెజారిటీ. తమిళులు, ముస్లింలు మైనారిటీలు
- గత కొన్నేళ్లుగా ఇక్కడ రాజపక్ష కుటుంబమే అధికారంలో ఉండేది
- 1983లో తమిళ వేర్పాటువాద సంస్థ ఎల్‌టీటీఈ, ప్రభుత్వం మధ్య అంతర్యుద్ధం చెలరేగింది
- 2005లో అప్పటి ప్రధాన మంత్రి మహింద రాజపక్ష పార్టీ అధ్యక్ష ఎన్నికల్లోనూ గెలిచింది
- సుదీర్ఘ కాలంపాటు కొనసాగిన ఎల్‌టీటీఈపై అంతర్యుద్ధం 2009లో ముగిసింది. తమిళ వేర్పాటువాదుల ఓటమితో మహింద రాజపక్ష హీరోగా మారారు
- అప్పట్లో గొటాబయ రాజపక్ష రక్షణ మంత్రిగా ఉండేవారు. ఆయనే 2019లో అధ్యక్షుడయ్యారు. మహింద రాజపక్షకు ఈయన తమ్ముడు
- 2022లో వరుస హింసాత్మక నిరసనల నడుమ ప్రధాన మంత్రి పదవికి మహింద రాజపక్ష, అధ్యక్ష పదవికి గొటాబయ రాజీనామా చేశారు
- ఆ తర్వాత రణిల్ విక్రమసింఘె దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. 2024 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు
- శ్రీలంకలో అధ్యక్షుడే దేశానికి, ప్రభుత్వానికి, సైన్యానికి అధిపతి

భారత్ ఏం అంటోంది?
ఐక్యరాజ్యసమితిలోని భారత ప్రతినిధి ఇంద్రమణి పాండే సోమవారం ఈ అంశంపై స్పందించారు. ఐక్యరాజ్యసమితి నిబంధనలను అనుసరించి మానవ హక్కులకు దేశాలు ప్రాధాన్యమిస్తామని భారత్ భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
శ్రీలంకలో తమిళుల పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. అక్కడ సమస్య పరిష్కారమయ్యే దిశగా చర్యలు తీసుకోవడంలేదని, రాజకీయ చొరవ కొరవడిందని ఆయన అన్నారు. రాజ్యాంగంలో 13వ సవరణను అనుసరించి ప్రొవిన్షియల్ కాన్సిల్స్‌కు అధికారాలు బదిలీ చేయాలని, వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
మరోవైపు శ్రీలంకలో శాంతి, సుస్థిరత, సమానత్వం, తమిళులకు హక్కులు లాంటి అంశాలకు రాజకీయ చర్చలతోనే పరిష్కారం లభిస్తుందని ఇంద్రమణి పాండే అన్నారు.

ఫొటో సోర్స్, Twitter/MFA_SriLanka
శ్రీలంక ఏం చెబుతోంది?
ఈ అంశంపై స్పందిస్తూ, మానవ హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందని శ్రీలంక విదేశాంగ శాఖ మంత్రి ఎంయూఎం అలీ సబరీ చెప్పారు.
‘‘ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, మానవ హక్కుల పరిరక్షణకు స్వతంత్రమైన ప్రజాస్వామ్య సంస్థల సాయంతో శ్రీలంక నిబద్ధతతో కృషి చేస్తోంది. ఈ విషయంలో పురోగతి కూడా కనిపిస్తోంది’’అని ఆయన వివరించారు.
‘‘ప్రజాస్వామ్య విలువలకు మద్దతు పలికేందుకు ఆసియాలో అత్యంత పురాతన ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఒకటైన శ్రీలంక కృషి చేస్తోంది. ఈ విషయంలో ఎదురయ్యే సవాళ్లను కూడా అధిగమిస్తున్నాం’’అని ఆయన చెప్పారు.
‘‘ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు శ్రీలంక ప్రాధాన్యం ఇస్తోంది. అదే సమయంలో మానవ హక్కుల పరిరక్షణకూ సమాన గౌరవమిస్తున్నాం’’అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా ఏమంది?
ఈ విషయంలో శ్రీలంకకు చైనా మద్దతు పలికింది.
ఐక్యరాజ్యసమితిలోని చైనా రాయబారి చెన్ షు తన ప్రకటనను ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘‘శ్రీలంక సార్వభౌమత్వం, స్వతంత్రతకు నేను గట్టి మద్దతు పలుకుతున్నాను. అభివృద్ధి దిశగా శ్రీలంక ఎంచుకుంటున్న మార్గాలను అందరూ గౌరవించాలి’’అని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈ విషయంపై చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ కూడా ఒక కథనం ప్రచురించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
‘‘మానవ హక్కుల పరిరక్షణ దిశగా శ్రీలంక చేస్తున్న కృషిని చైనా ప్రశంసిస్తోంది. ఇది పూర్తిగా శ్రీలంక అంతర్గత అంశం. దీనిలో వేరొకరు జోక్యం చేసుకోవడాన్ని చైనా వ్యతిరేకిస్తుంది’’అని ఆ కథనంలో రాసుకొచ్చారు.
అసలు ఏం జరుగుతోంది?
మూడు దేశాల స్పందనలను అంతర్జాతీయ విశ్లేషకులు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు.
ఎందుకంటే తమ ప్రటకనలో శ్రీలంక ఆర్థిక స్థితిగతుల గురించి కూడా భారత్ ప్రస్తావించింది. ‘‘అప్పులతో ఆర్థిక వ్యవస్థను నడిపించడంతో చుట్టుముట్టే సమస్యలు, వాటితో ప్రజల జీవితాలపై పడే ప్రభావం’’ గురించి కూడా భారత్ స్పందించింది.
నేరుగా పేరును ప్రస్తావించకుండా.. ఇది చైనాపై విమర్శలు చేయడమేనని నిపుణులు భావిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఈ విషయంపై తక్షశిల ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన యూసుఫ్ ఉంఝావాలా మాట్లాడుతూ.. ‘‘ శ్రీలంకలో తమిళుల సమస్యలను పరిష్కరించే దిశగా తగిన రాజకీయ ప్రక్రియలు ముందుకు వెళ్లడంలేదని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అదే సమయంలో అప్పులతో కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థ గురించి కూడా స్పందించింది. హంబన్‌టోటకు చైనా యుద్ధనౌక వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి’’అని ఆయన అన్నారు.
భారత్ ఇదివరకు ఏం చెప్పింది?
ఎప్పటినుంచో శ్రీలంకలోని తమిళుల సమస్యలకు రాజకీయ పరిష్కారం చూపాలని అక్కడి ప్రభుత్వంపై భారత్ ఒత్తిడి తీసుకొస్తోంది.
1987లో కుదిరిన శ్రీలంక-భారత్ ఒప్పందంలో ప్రొవిన్షియల్ కౌన్సిల్స్‌కు అధికార బదిలీ నిబంధనలను ఆమోదించాలని భారత్ డిమాండ్ చేస్తోంది.
అయితే, 1987లో ఏర్పాటుచేసిన ప్రొవిన్షియల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని అతివాద సింహళ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంపై ఇటీవల కాలంలో బహిరంగంగా స్పందించేందుకు భారత్ నిరాకరిస్తూ వచ్చింది. ఐరాస మానవ హక్కుల సంస్థలో శ్రీలంకకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై 2021 మార్చి 23న జరిగిన ఓటింగ్‌లో పాల్గొనేందుకు కూడా భారత్ నిరాకరించింది.
అయితే, ఇటీవల చైనా యుద్ధ నౌకను హంబన్‌టోట పోర్టుకు తీసుకురావడంతో భారత వైఖరి మారినట్లు కనిపిస్తోంది. ఈ నౌకను తీసుకురావొద్దని బహిరంగంగానే భారత్ స్పందించింది. అయినప్పటికీ, ఈ నౌక వచ్చేందుకు శ్రీలంక అనుమతించింది.
ఇవి కూడా చదవండి:
- మోదీ పాలనలో మహిళలపై నేరాలు పెరిగాయా, తగ్గాయా? 5 చార్టుల్లో అసలు నిజాలు
- కశ్మీర్ విషయంలో నెహ్రూ పాత్రేమిటి.. విలన్ ఆయనేనా
- ఐఫోన్ 14 అమ్మకాలను నిషేధించిన బ్రెజిల్, కారణం ఏమిటంటే...
- కింగ్ చార్లెస్: గాడున్‌స్టన్ బోర్డింగ్ స్కూల్లోనే ఎందుకు చదువుకున్నారు?
- క్వీన్ ఎలిజబెత్ 2: బ్రిటన్ రాణికి అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














