ఉత్తరప్రదేశ్: ప్రయాగ్‌రాజ్ హింసాకాండ ప్రధాన నిందితుడి ఇంటిపై బుల్డోజర్‌తో దాడి

బుల్డోజర్

ఫొటో సోర్స్, ANI

ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం నాటి ప్రార్థనల తరువాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది.

యూపీ పోలీసులు ఇప్పటివరకు 300 మందికి పైగా అరెస్ట్ చేశారు. అంతేకాకుండా, భారీగా పోలీసుల సమక్షంలో ప్రయాగ్‌రాజ్ పరిపాలన యంత్రాంగం... ఆదివారం కరేలీ ప్రాంతంలోని ప్రధాన నిందితుడు జావేద్ మొహమ్మద్ ఇంటిపై బుల్డోజర్‌తో దాడి చేసింది.

ఆదివారం ఉదయం 11 గంటలలోగా ఇంటిని ఖాళీ చేయాలని వెల్ఫేర్ పార్టీ నాయకుడు జావేద్ మొహమ్మద్‌కు ప్రయాగ్‌రాజ్ అభివృద్ధి సంస్థ (పీడీఏ) నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుల ప్రకారం, జావేద్ మొహమ్మద్ ఇంటిని అక్రమంగా నిర్మించారు.

అక్రమ కట్టడాలకు సంబంధించి మే 10న ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆ నోటీసు ప్రకారం, మే 25లోగా అథారిటీ ఎదుట జావేద్ హాజరు కావాలని సూచించారు.. కానీ, ఆయన అథారిటీ ముందు హాజరు కాలేదు. గైర్హాజరుకు గల కారణాన్నికూడా చెప్పకపోవడంతో ఆయన ఇంటిని కూల్చివేయాలని ఆర్డర్లు జారీ చేశారు.

బుల్డోజర్‌ చర్యకు సంబంధించి జావేద్ కుటుంబసభ్యుల నుంచి మీడియాలో ఎలాంటి ప్రకటన లేదు.

శుక్రవారం నాటి హింసకు జావేద్ ప్రధాన సూత్రధారి అని యూపీ పోలీసులు చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

శుక్రవారం హింసాత్మక ఘటనకు సంబంధించి 8 జిల్లాలకు చెందిన మొత్తం 304 మందిని యూపీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. ప్రయాగరాజ్‌లో 91 మందిని అరెస్ట్ చేశారు.

ఆదివారం ఉదయానికి అందిన సమాచారం ప్రకారం సహ్రాన్‌పుర్‌లో 71, హత్రాస్‌లో 51, అంబేడ్కర్ నగర్‌లో 34, మొరాదాబాద్‌లో 34, ఫిరోజాబాద్‌లో 15, అలీగఢ్‌లో ఆరుగురిని, జలౌన్‌లో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

అల్లర్లకు పాల్పడినట్లుగా అనుమానిస్తూ వీరందరినీ అరెస్ట్ చేశారు.

శుక్రవారం నాటి హింస తరువాత ఉత్తర్‌ప్రదేశ్‌లో శనివారం కూడా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు, అధికారులు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ప్రయాగరాజ్ పోలీసులు

ఫొటో సోర్స్, @PRAYAGRAJ_POL

ప్రయాగ్‌రాజ్ సూత్రధారి అరెస్ట్

'వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా'కు చెందిన మొహమ్మద్ జావేద్ ఈ అల్లర్ల సూత్రధారుల్లో ఒకరని పోలీసులు చెబుతున్నారు. ఆయన్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ప్రయాగరాజ్ ఎస్ఎస్‌పీ అజయ్ కుమార్ మీడియాతో చెప్పారు.

జావేద్ భారత్ బంద్‌కు పిలుపిచ్చారని, ప్రయాగరాజ్‌లోని అటాలా ప్రాంతానికి అంతా చేరుకోవాలని ఆయన పిలుపిచ్చారని పోలీసులు చెప్పారు. శుక్రవారం ఈ ప్రాంతంలోనే హింస చెలరేగింది.

ఇంటరాగేషన్‌లో జావేద్.. తన కుమార్తె జేఎన్‌యూలో చదువుతున్నట్లు చెప్పారని, ఆమెకూ ఈ కుట్రలో పాత్ర ఉందని పోలీసులు చెప్పారు.

జావేద్ మొబైల్ ఫోన్ నుంచి కొన్ని నంబర్లు, వాట్సాప్ సంభాషణలు డిలీట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు ఆ మొబైల్ పంపించనున్నారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న జావేద్ కుమార్తెనూ విచారిస్తారా అని మీడియా ప్రశ్నించగా.. ప్రాథమిక విచారణలో ఆమె పాత్ర ఉన్నట్లు తేలిందని, పూర్తి ఆధారాలు దొరికితే ఆమెను అరెస్ట్ చేయడానికి పోలీస్ బృందాలు దిల్లీ వెళ్తాయని ఎస్ఎస్‌ఏ అజయ్ కుమార్ చెప్పారు.

పోలీసులు

ఫొటో సోర్స్, @RAKESHS_IPS

బుల్డోజర్‌తో..

ఈ ఘటన వెనుక భారీ కుట్ర ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని... ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నామని, మరింత దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

నిందితులకు సంబంధించిన అక్రమ నిర్మాణాలను ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ కూల్చివేసిందని.. నిందితుల వద్ద ఉన్న బ్లాక్‌మనీనీ జప్తు చేస్తామని ఎస్ఎస్‌పీ చెప్పారు.

మైనర్ బాలలను ముందుపెట్టి రాళ్ల దాడికి దిగారని, గుర్తు తెలియని వ్యక్తులు 5 వేల మంది అల్లర్లలో పాల్గొన్నారని పోలీసులు చెబుతున్నారు.

కాన్పూర్ పోలీసులు

ఫొటో సోర్స్, KANPURNAGARPOL

కాన్పూర్, సహారన్‌పుర్‌లోనూ

కాన్పూర్‌లో జూన్ 3 నాటి అల్లర్ల తరువాత శనివారం కాన్పూర్ డెవలప్2మెంట్ అథారిటీ మహ్మద్ ఇష్తియాక్ అనే వ్యక్తికి చెందిన భవనాన్ని బుల్డోజర్‌తో కూల్చివేసింది.

కాన్పూర్ అల్లర్ల ప్రధాన నిందితుడు జాఫర్ హయత్ హష్మీకి ఇష్తియాక్ సన్నిహితుడని పోలీసులు చెప్పారు.

కాన్పూర్ హింస తరువాతే అక్రమ నిర్మాణం కూల్చివేత చర్యలు చేపట్టారని.. అంతకుముందు ఎందుకు దీనిపై దృష్టి సారించలేదన్న మీడియా ప్రశ్నకు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆనంద్ ప్రకాశ్ తివారీ స్పందిస్తూ... సాక్ష్యాధారాల ఆధారంగానే చర్యలు చేపడతామని చెప్పారు.

ల్యాండ్ మాఫియా అక్రమాలు, వారి అక్రమ ఆస్తులపై నిత్యం విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నట్లు కాన్పూర్ డెవలప్‌మెంట్ అథారిటీ సెక్రటరీ త్రిభువన్ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

కాగా సహారన్‌పుర్‌లోనూ శుక్రవారం అల్లర్లు జరగ్గా... ఆ కేసులో 64 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముజమ్మిల్, అబ్దుల్ వాకర్‌ల ఇళ్లను నగరపాలక అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. ముజమ్మిల్, అబ్దుల్ వాకర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్ మాజీ మీడియా సలహాదారులు, దేవరియా ఎమ్మెల్యే, బీజేపీ నేత శలభ్ మణి త్రిపాఠీ ఓ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. మూసి ఉన్న ఓ గదిలో నిర్బంధించిన కొందరిని పోలీసులు లాఠీలతో కొడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

కుట్రదారులకు రిటర్న్ గిఫ్ట్ అని ఆయన తన వీడియోకు క్యాప్షన్ జోడించారు.

అయితే, ఈ వీడియో ఎక్కడిది అనేది బీబీసీ ఇంకా ధ్రువీకరించుకోలేదు. దీనిపై యూపీ శాంతిభద్రతల ఏడీజీని 'బీబీసీ' సంప్రదించగా ఆ వీడియో తమ దృష్టికి రాలేదని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఉత్తరప్రదేశ్ అల్లర్లలో అనుమానితుల ఇళ్ళపై బుల్డోజర్ దాడులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)