Climate Action: వాతావరణ లక్ష్యాలపై చేసిన హామీలకు దేశాలు కట్టుబడుతున్నాయా? ఎంతవరకు నెరవేర్చుతున్నాయి?

పగుళ్లు వారిన భూమి
    • రచయిత, ఎస్మీ స్టలార్డ్
    • హోదా, బీబీసీ న్యూస్

కాలుష్య ఉద్గారాలు, శిలాజ ఇంధనాల తగ్గింపు, అడవుల నరికివేతను ఆపేందుకు కొత్తగా తయారు చేసుకున్న లక్ష్యాలను అమలు చేసేందుకు ప్రపంచ నాయకులు సీఓపీ 26 సమావేశంలో గ్లాస్గో ఒప్పందం పై సంతకం చేశారు.

అయితే, ఈ లక్ష్యాలను సాధించేందుకు జరిగిన పురోగతి గురించి చర్చించేందుకు వివిధ దేశాలు తిరిగి బాన్ లో సమావేశమవుతున్నాయి. వీరు చేసిన ప్రమాణాలకు కట్టుబడుతున్నారా?

కాలుష్య ఉద్గారాలు: ఈ ఏడాదిలో తగ్గే అవకాశం

ఈ ఒప్పందంలో జరిగిన అంగీకారం ఏంటి?

వాతావరణ మార్పులను అరికట్టేందుకు, కార్బన్ డయాక్సైడ్ వాయువులను తగ్గించేందుకు పటిష్టమైన ప్రణాళికలను రూపొందిస్తామని గ్లాస్గోలో వివిధ దేశాలు అంగీకరించాయి.

ఇది ఎందుకు ముఖ్యం?

కార్బన్ డయాక్సైడ్ వాయువు వాతావరణ మార్పులకు కారణమవుతుంది. "పెరుగుతున్న ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర నిలపాలంటే ఈ ఉద్గారాలను తగ్గించడం అవసరం. ఉష్ణోగ్రతలు ఈ స్థాయిని దాటి పెరిగితే వాతావరణ విపత్తు ఏర్పడుతుంది" అని ఐక్యరాజ్య సమితికి చెందిన శాస్త్రవేత్తలు చెప్పారు.

ఇప్పటి వరకు ఏమి చేశారు?

ఈ ఏడాది సెప్టెంబరు నాటికి దేశాలు కొత్త ప్రణాళికలను సమర్పించాలని గడువు విధించారు. కానీ, ఈ ఒప్పందం పై సంతకం చేసిన 196 దేశాలకు గాను, 11 దేశాలు మాత్రమే తమ ప్రణాళికలను సమర్పించాయి.

కానీ, 2021 వేసవి నుంచి చైనాలో ఉద్గారాలను క్రమంగా తగ్గిస్తున్నట్లు తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రపంచంలో 27% ఉద్గారాల విడుదలకు చైనా కారణంగా ఉండటంతో, ఈ దేశంలో కనిపించిన తగ్గుదల వల్ల వాతావరణ మార్పుల పై గణనీయమైన ప్రభావం ఉంటుంది.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

If you cannot see the chart, please refresh your browser

సీఓపీ , బాన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అంటే ఏంటి?

  • ప్రతీ ఏడాది ప్రపంచంలో వివిధ దేశాల నాయకులు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సీఓపీ) వాతావరణ సమావేశానికి హాజరవుతారు.
  • గత ఏడాది గ్లాస్గోలో 26వ సీఓపీ చోటు చేసుకుంది.
  • ఈ ఏడాది చివర్లో ఈజిప్ట్ లోని షార్మ్- ఎల్-షేఖ్ లో సీఓపీ-27 సమావేశాన్ని జరిపేందుకు నిర్ణయించారు. ఈ రెండు సీఓపీ సమావేశాలకు మధ్యలో జరుగుతున్నదే బాన్ క్లైమేట్ సమావేశం. ఈ సమావేశంలో దేశాలు వాతావరణ మార్పుల విషయంలో సాధించిన ప్రగతి గురించి చర్చిస్తారు.
బొగ్గు

శిలాజ ఇంధనాలు: ఇంధన విపత్తు అభివృద్ధి పై ప్రభావం

బొగ్గు వాడకాన్ని తగ్గించాలని సీఓపీ 26లో ప్రణాళిక చేశారు. ఏటా 40% కార్బన్ డయాక్సైడ్ వాయువు విడుదలకు బొగ్గు వాడకం కారణం.

సమర్ధవంతంగా పని చేయని ఇంధన, గ్యాస్ సబ్సిడీలను కూడా క్రమంగా తొలగించేందుకు ప్రపంచ నాయకులు అంగీకరించారు. ప్రభుత్వం చేసే ఈ చెల్లింపుల ద్వారా శిలాజ ఇంధనాల ధరను కృత్రిమంగా తగ్గిస్తారు.

సబ్సిడీలను అధికంగా ఇస్తున్న దేశాలు
ఫొటో క్యాప్షన్, సబ్సిడీలను అధికంగా ఇస్తున్న దేశాలు

శిలాజ ఇంధనాలకు అత్యధికంగా సహకరిస్తున్న ప్రభుత్వాల పట్టీ ఈ గ్రాఫిక్ చూపిస్తోంది.

ఇందులో ఇరాన్ విలువైన సహజ వాయువు, విద్యుత్, ఇంధనం కోసం సుమారు 30 బిలియన్ డాలర్ల ప్రభుత్వ సహాయం అందిస్తోంది.

25 బిలియన్ డాలర్ల విలువతో చైనా రెండవ స్థానంలో ఉంది. 20 బిలియన్ డాలర్లతో భారత్ మూడవ స్థానంలో, 16బిలియన్ డాలర్లతో సౌదీ అరేబియా నాలుగవ స్థానంలో 15 బిలియన్ డాలర్లతో రష్యా ఐదవ స్థానంలో ఉంది.

ఎందుకు ముఖ్యం?

ప్రపంచంలో 64% కార్బన్ ఉద్గారాల విడుదలకు శిలాజ ఇంధనాలే కారణమని యూఎన్ క్లైమేట్ సైన్స్ బాడీ (ఐపీసీసీ) చెబుతోంది.

ఇప్పటి వరకు ఏమి చేశారు?

34 దేశాలు కొత్త బొగ్గు ప్లాంటులను ఏర్పాటు చేసేందుకు చూస్తున్నాయి. గత ఏడాది 41 దేశాలు కొత్త ప్లాంటులను ఏర్పాటు చేసే ప్రణాళికలు చేశాయి.

విదేశాల్లో ఉన్న బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులన్నిటికీ నిధులను సమకూర్చడం పూర్తిగా ఆపేస్తామని బొగ్గును అత్యధికంగా ఉపయోగించే చైనా చెప్పింది.

100 ప్లాంటులను తెరిచి బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచుతామని చైనా తర్వాత బొగ్గును అత్యధికంగా వినియోగించే భారత్ ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రకటించింది.

2021లో శిలాజ ఇంధనాలకు ఇచ్చే సబ్సిడీలను కూడా పెంచినట్లు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది.

రష్యా సరఫరా చేసే సహజ వాయువు పై ఆధారపడకుండా ఉండేందుకు అమలు చేసిన స్వల్పకాలిక చర్య అని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పాలసీ విశ్లేషకురాలు సబ్రినా ముల్లర్ చెప్పారు.

చెట్లు

అడవుల నిర్మూలన: ప్రపంచ ప్రగతిని నిరోధిస్తున్న బ్రెజిల్

ఒప్పందం ఏంటి?

ప్రపంచంలో 85 శాతం అడవులు కలిగిన 100కు పైగా దేశాలు 2030 నాటికి అడవుల నరికివేతను ఆపేస్తామని హామీ ఇచ్చాయి.

ఎందుకు ముఖ్యం?

ఏటా వాతావరణంలోకి విడుదలయ్యే 10% కార్బన్ డయాక్సైడ్ ను చెట్లు గ్రహించడంతో అడవుల నరికివేతను ఆపడం చాలా కీలకం.

ఇప్పటి వరకు ఏమి చేశారు?

ప్రపంచంలో సగం పైగా అటవీ భూభాగం రష్యా, బ్రెజిల్, కెనడా, అమెరికా, చైనాలలో ఉంది. ఈ దేశాలు అమలు చేసే చర్యలు చాలా తేడాను తీసుకొస్తాయి.

ప్రభుత్వ భూముల్లో పెరిగిన అడవులను సంరక్షిస్తామని ఏప్రిల్ లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఒక ఆదేశం పై సంతకం చేశారు.

కానీ, గత ఏడాది అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో సగం ఉన్న బ్రెజిల్ లో 69% అడవుల నరికివేత పెరిగింది.

"బ్రెజిల్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ చర్యలను అమలు చేయడంలో ఇచ్చిన సడలింపు వల్ల ఇటువంటి పరిణామం ఆశ్చర్యకరం కాదు" అని వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ గ్రూపుకు చెందిన ఫ్రాన్సెస్ సీమర్ అన్నారు.

సుదీర్ఘంగా కొనసాగుతున్న అడవి మంటల వల్ల రష్యా సవాలును ఎదుర్కొంటోంది. గత ఏడాది ఈ అడవి మంటలకు రష్యా 65 లక్షల హెక్టార్ల అటవీ భూమిని కోల్పోయింది.

డబ్బు

క్లైమేట్ యాక్షన్: అదనపు నిధులు

ఒప్పందం ఏంటి?

అభివృద్ధి చెందుతున్న దేశాలు 2022 చివరి నాటికి పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టేందుకు ఏడాదికి 100 బిలియన్ డాలర్ల నిధులను ఇచ్చేందుకు అభివృద్ధి చెందిన దేశాలు అంగీకరించాయి. అయితే, 2020లో ఈ నిధులను అందించడంలో వైఫల్యం జరిగింది.

ఎందుకు ముఖ్యం?

శిలాజ ఇంధనాల వాడకం నుంచి పక్కకు తొలగేందుకు, హరిత టెక్నాలజీ పై పెట్టుబడులు పెట్టేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిధులు అవసరం. వాతావరణ మార్పుల వల్ల కలిగే దారుణమైన ప్రభావాలను ఎదుర్కొనేందుకు కూడా వారు సిద్ధంగా ఉండాలి.

క్లైమేట్ యాక్షన్: అదనపు నిధులు
ఫొటో క్యాప్షన్, క్లైమేట్ యాక్షన్: అదనపు నిధులు

ఇప్పటి వరకు ఏమి చేశారు?

యూరోపియన్ యూనియన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు నిధులను పెంచుతూ హామీలు ఇస్తున్నప్పటికీ వారికున్న నిధులు, గతంలో విడుదల చేసిన ఉద్గారాల దృష్ట్యా వారు మరింత ఎక్కువగా వెచ్చించాలని వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అంటోంది.

యూకే, ఫ్రాన్స్, జెర్మనీ, జపాన్ మాత్రం అవసరం కంటే ఎక్కువగా నిధులను ఇస్తున్నారు.

మీథేన్: మితిమీరుతున్న పరిస్థితి

ఒప్పందం ఏంటి?

2030నాటికి 30% మీథేన్ వాయువుల విడుదలను తగ్గించే ప్రణాలికను 100కు పైగా దేశాలు అంగీకరించాయి.

చైనా, రష్యా, భారత్ ఈ ప్రణాళికలో చేరాల్సి ఉంది.

ఈ అంశం పై అమెరికాతో కలిసి పని చేస్తామని చైనా ఒక ఒప్పందంలో అంగీకరించింది.

ఎందుకు ముఖ్యం?

వాతావరణంలో మూడు వంతుల మానవ కారక ఉష్ణోగ్రతల విడుదలకు మీథేన్ కారణం.

ఏమి చేస్తున్నారు?

గత ఏడాది మీథేన్ స్థాయిలు తీవ్ర స్థాయిలో పెరిగాయని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది.

వ్యవసాయ, ఇంధన రంగం మిథేన్ విడుదలకు ప్రధాన కారణంగా ఉన్నాయి. కోవిడ్ ఆంక్షలు సడలించడంతో పెరిగిన ఆయిల్, గ్యాస్ వాడకం కూడా ఈ వాయువుల విడుదలకు పాక్షికంగా కారణమయింది.

వీడియో క్యాప్షన్, రాత్రి పూట సేద్యంలో వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలేంటి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)